రాయ్‌పూర్ : ఛతీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల వసతి గృహంలో ఓ మైనర్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దంతేవాడ జిల్లా పతారాస్ జిల్లాలో చోటు చేసుకుంది. పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని ఒక పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్నపాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లోనే నిర్జీవ శిశువుకు జన్మనిచ్చింది.
విషయం తెలిసిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి.. వివరాలు సేకరించారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక జన్మనిచ్చిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment