ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కలకలం | 500 People on Way to PM's Meet Taken Hostage by Maoists in Dantewada | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కలకలం

Published Sat, May 9 2015 11:08 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

500 People on Way to PM's Meet Taken Hostage by Maoists in Dantewada

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా  మావోయిస్టులు కలకలం సృష్టించారు. మోదీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు సుకుమా జిల్లాలో సుమారు 500మంది గిరిజనులను కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీరించటం లేదు. ఈ సంఘటన స్థానికంగా దుమారం రేపుతోంది.

కాగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. ఆయన శనివారం అక్కడ మోదీ విద్యా సంస్థలను సందర్శించి  విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే మోదీ, రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు దంతెవాడ చేరుకున్నారు. మరోవైపు మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement