ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో చత్తీస్గఢ్ పర్యటనకు వెళ్లనున్నారు.
రాయ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో చత్తీస్గఢ్ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభిస్తారు. చత్తీస్గఢ్ పర్యటనలో మోదీ విద్యా సంస్థలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడనున్నారు. మోదీ ఇదే రోజు రాయ్పూర్కు వెళ్లి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.