
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బీజాపూర్ దంతెవాడ జిల్లా లావాపురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
⚡⚡ Nine Naxalites eliminated in encounter by Security forces in Chhattisgarh's Dantewada District.
— Āryāvarta Updates (@_AryavartaNews) September 3, 2024