చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాో సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి.
కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోసారి. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఏకే 47తోపాటు ఇతన భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రీజియన్‌లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment