
మావోయిస్టుల దాడిలో ధ్వంసమైన బొలెరో వాహనం
ఛత్తీస్‌గఢ్: దంతేవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గోతియా అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్ జిల్లా నుంచి దంతేవాడ వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.