
చత్తీస్‌గడ్ : చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవి దుర్మరణం చెందారు. వీరితోపాటు మరో ఆరుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దంతెవాడలోని సకులనార్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment