రాయ్‌పూర్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఏకంగా 18వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా దంతేవాడ ఎమ్మెల్యే అయిన భీమా మాండవిని గత ఏప్రిల్లో మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న దంతెవాడలో ఎన్నిక నిర్వహణ అంతా సులభమైన విషయం కాదు. అలాగే మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు డోన్‌ల సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment