
సాక్షి, రాయపూర్ : వరుస ఎదురుదెబ్బలతో డీలాపడ్డ మావోయిస్టులు అదును చూసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ, చోల్నార్ అటవీ ప్రాంతంలో పోలీస్‌లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు మందుపాతర పేల్చారు. ఈదుర్ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం రాయపూర్ తరలించారు.
దాదాపు 10 అడుగుల లోతులో మందుపాతర అమర్చారు. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలు అయ్యింది. దంతెవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి జవాన్లు రక్షణగా వెళ్లారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు పథకం ప్రకారం మందుపాతర పేల్చి ఆరుగురు జవాన్ల ప్రాణాలు తీశారు. అనంతరం వారి అధునాతన ఏకే 47, ఇన్సాన్ ఆయుధాలను ఎత్తుకెళ్లారు.