maoist attack
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 12 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే, దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీలు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
1400 మంది భద్రతా బలగాల కూంబింగ్‌లో.. మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో సుమారు 11 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. మంగళవారం మావోయిస్ట్‌ల ఏరివేతే లక్ష్యంతో 1400 మంది భద్రతా బలగాలు జాయింట్ కూంబింగ్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే సమయంలో మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్ట్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పల్లో 11 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ ఐజి సుందర్ రాజ్ మావోయిస్ట్‌ల మృతి, కూంబింగ్‌ను ధృవీకరించారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్జీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. చెప్పారు. జవాన్ల చేతిలో హతమైన మావోయిస్టులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ 8 లక్షల రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ. 3లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి -
తొందరపాటు వల్లే మావోయిస్టుల ట్రాప్‌లో పడ్డారు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 10 మంది పోలీసులను మావోయిస్టులు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది మినీ బస్సులో ఆ ప్రాంతానికి మంగళవారం బయలుదేరి వెళ్లారు. గాలింపు చర్యలు పూర్తిచేసి బుధవారం దంతెవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం సమయంలో పల్నార్–అరన్పూర్ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి మినీ బస్సు చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబును మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు గాల్లోకి లేచి పక్కన చెట్లలో పడిపోయింది. బస్సు భాగాలు తునాతునకలు అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది డీఆర్జీ సిబ్బంది, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. భద్రతా బలగాలు తొందరపాటు చర్యవల్లే.. పేలుడు జరిగిన తీరును చూస్తే కూంబింగ్‌లో పోలీసులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ) పాటించలేదని తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం నిఘా సమాచారాన్ని పక్కాగా ధ్రువీకరించుకోవాలి. తర్వాత భద్రతా దళాలు ప్రయాణించే మార్గంలో ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి . అవసరమైతే భద్రతా దళాల కంటే ముందు రోడ్ ఆపరేటింగ్ పార్టీని పంపించాలి. మినీ బస్సులో బయలుదేరిన డీఆర్జీ బృందం వీటిని పాటించలేదని తెలుస్తోంది. దాంతో తిరుగు ప్రయాణంలో మావోయిస్టుల ఉచ్చులో చిక్కారు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుల్గూడా సమీపంలో సైతం ఇదే తరహాలో మావోయిస్టులు పన్నిన ట్రాప్‌లో భద్రతా దళాలు చిక్కుకున్నాయి. ఆ ఘటనలో 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలయ్యారు. టీసీఓసీ ఉచ్చులో.. వేసవికి ముందు అడవుల్లో పచ్చదనం పలచబడుతుంది. ఈ సమయంలో మావోయిస్టులు అడవి లోపలికి వెళ్లిపోతుంటారు. పోలీసులు మరింత ఉధృతంగా వారి కోసం గాలిస్తుంటారు. ప్రతి వేసవిలో సాయుధ భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టులు చిక్కుల్లో పడుతున్నారు. దీంతో భద్రతా దళాల వేగానికి అడ్డకట్ట వేసేందుకు కొంతకాలంగా టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెన్ (టీసీఓసీ) పేరుతో సరికొత్త వ్యూహాన్ని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. భావజాల వ్యాప్తి, కొత్త రిక్రూట్మెంట్, భద్రతా దళాలపై మెరుపుదాడులు చేయడం టీసీఓసీలో వ్యూహంలో భాగంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టీసీఓసీని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచారిస్తున్నాయంటూ భద్రతా దళాలకు సమాచారం చేరవేసి తమ ఉచ్చులో పడేసినట్టు తెలుస్తోంది. -
మావోయిస్టు దామోదర్ భార్య అరెస్ట్.. మిగిలిన నలుగురి జాడేది..?
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజిత అరెస్టు సందర్భంగా నెలకొన్న ప్రకంపనలు ఇంకా ఆగిపోలేదు. ఆమెతో పాటు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించిన మిగిలిన దళ సభ్యులు ఎక్కడున్నారు? వారి నెక్ట్స్ టార్గెట్ ఏంటనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటలు గడిచినా.. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అలికిడి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సానుభూతిపరులను ఏర్పాటు చేసుకుంటూ తమ భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ టీమ్‌లకు అండగా యాక్షన్ టీమ్‌లు సైతం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నట్టు సమాచారం. మావోల కదలికలు పెరగడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్టయ్యారు. కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చర్ల మండలం కూర్నపల్లి, బోదనెల్లి అడవుల్లో రజిత, ధనిలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో మిగిలిన దళ సభ్యులు పారిపోయారని పోలీసులు చెబుతుండగా అంతకు ముందే పోలీసుల అదుపులో రజిత, ధనిలతో పాటు మరో నలుగురు దళ సభ్యులు ఉన్నారంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నలుగురికి సంబంధించి పోలీసులు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా మావోయిస్టుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఆ నలుగురు ఏమయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంటాక్ట్ మిస్ అయ్యారా ? రజితతో పాటు సంచరిస్తున్న దళ సభ్యులు పోలీసుల రాకను గమనించి తప్పించుకున్నారని, అయితే వారు ఇంకా తమ కాంటాక్టులను సంప్రదించలేదనే వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఎవరైనా మావోయిస్టులు దళం నుంచి విడిపోతే తిరిగి కాంటాక్టులోకి వచ్చే వరకు వారు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. అయితే రజిత, ధనిలు పోలీసులకు పట్టుబడిన ఘటనలో తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్ ఏరియాలకు చేరుకునే అవకాశం ఎక్కువని తెలుస్తోంది. కూర్నపల్లి, బోదనెల్లి అటవీ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్‌కు అతి సమీపంలో ఉన్నాయి. పైగా అడవి దట్టంగా ఉండటం వానలు కురవడాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా తమ నాయకత్వంతోని కాంటాక్టులోకి వెళ్లి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకసారి వారు కాంటాక్టులోకి వచ్చిన తర్వాత నలుగురు దళ సభ్యుల గురించి మావోయిస్టు నాయకత్వం ప్రకటన చేయవచ్చని అంచనా. అవి గాయాలేనా ? రజిత ఒంటిపై కమిలిన గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం పట్టుడిన మావోయిస్టులను గురువారం వరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా రజితకు ఏమైనా గాయాలు అయ్యాయా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ను వివరణ కోరగా.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రిమాండ్‌కు తరలించే వరకు పక్కాగా నిబంధనలు పాటించామని చెప్పారు. విచారణ సందర్భంగా వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. మావోయిస్టులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రజిత, ధనిలను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. -
పంద్రాగస్టు వచ్చిందంటే ఆ ఘాతుకం యాదికొస్తది.. ఎమ్మెల్యేతో పాటు..
సాక్షి, నారాయణపేట: నారాయణపేటలో పంద్రాగస్టు వచ్చిందంటే చాలు 2005, ఆగస్టు 15న జరిగిన మావోయిస్టుల ఘాతుకం ప్రతి ఒక్కరి మనసు కలచివేస్తోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది మావోయిస్టుల తూటాలకు బలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అప్పటి ఎమ్మెల్యే నర్సిరెడ్డి మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో పట్టణంలోని హరిజనవాడలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొబ్బరికాయ కొడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో అప్పటికే కాపుకాసిన మావోయిస్టులు ఏకే 47తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మంది మృతిచెందగా తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన వారిలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు వెంకటేశ్వర్‌రెడ్డి, అప్పటి మున్సిపల్ కమిషనర్ డీవీ రామ్మోహన్, గన్‌మెన్ రాజారెడ్డి, డ్రైవర్ శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయం అటెండర్ సాయిబన్న, మాగనూర్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు లోకేశ్వర్‌రెడ్డి, ఊట్కూర్ మండల తిప్రాస్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మోనప్పగౌడ్, రవీందర్‌గౌడ్ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణపేటకు చెందిన దూడం విజయ్‌కుమార్, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వాహన డ్రైవర్ ఆరీఫ్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో అప్పటి ఆర్డీఓ శివారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి, దివంగత నేత ఘన్‌శ్యాందాస్‌ధరక్, ఎమ్మెల్యే పీఏ భాస్కర్, అవుటి రాజశేఖర్, నాగేందర్, లొట్టి శ్రీనివాస్, సూరి గాయపడి త్రుటిలో తప్పించుకున్న వారిలో ఉన్నారు. వైఎస్సార్ దిగ్భ్రాంతి.. ఈ వార్త విన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడు కేశవరావు, ఎంపీ జైపాల్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో అదేరోజు సాయంత్రం నారాయణపేటకు చేరుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే ఇతరుల మృతదేహాలను చూసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు బాడీగార్డులు మృతి
రాంచీ:జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఒక్కసారిగా మావోయిస్టులు దాడికిదిగారు. దీంతో అప్రమత్తమైన ముగ్గురు బాడీగార్డులు ఎమ్మెల్యేను రక్షించారు. అయితే ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతి చెందగా.. మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాడీగార్డును కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు బాడీగార్డుల నుంచి ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కేళ్లారు. ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఫుట్‌బాల్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ముందస్తు సమాచారం అందించలేదని తెలిపారు. గురుచరణ్ నాయక్ గతంలో మనోహర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించామని, జవాన్ మృతదేహాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని డీజీపీ తెలిపారు. -
టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
జయపురం: స్థానిక సబ్‌డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వర్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన టిఫిన్ బాక్స్ బాంబుని బీఎస్ఎఫ్ జవానులు శనివారం గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు అడ్డాగా పేరొందిన రామగిరి ప్రాంతం అడవుల్లో జవానులను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున బొయిపరిగుడ బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ జవానులు పోలీస్ డాగ్ సహాయంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామగిరి ప్రాంతంలోని పూజారిగుడ కూడలి దగ్గరున్న ప్రయాణికుల విశ్రాంతి భవనానికి కొంత దూరంలో బాంబుని గుర్తించి, డెఫ్యూజ్(నిర్వీర్యం) చేసినట్లు బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ క్యాంపు కమాండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు. బీఎస్ఎఫ్ జవానులను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు అమర్చిన ఈ బాంబు సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండడంతో మళ్లీ మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తుండడం విశేషం. మల్కన్‌గిరిలో మరో బాంబు నిర్వీర్యం.. మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి, నక్కమమ్ముడి పంచాయతీ, బలిమెల కూడలిలో డైక్–3 గ్రామ రహదారిలోని ఓ చెట్టుకి మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబుని బీఎస్ఎఫ్ జవానులు నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్‌కి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానులు కూంబింగ్ అనంతరం క్యాంప్‌కి తిరిగివస్తుండగా బాంబుని గుర్తించి, నిర్వీర్యం చేశారు. జవానులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబుని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే.. -
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
రాయపూర్: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. ఉమేష్ మర్కం గత కొంత కాలంగా 'గోప్నియా సైనిక్' (రహస్య పోలీసు ఇన్ఫార్మర్)గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన స్వగ్రామమైన కాటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటం గ్రామం నుంచి దంతెవాడ పట్టణానికి వెళ్తుండగా మావోయిస్టులు కొందరు మార్కంపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మార్కం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రాజధాని రాయ్‌పూర్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న తేటమ్ గ్రామంలో గత ఏడాది పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులకు మద్దతు ఇవ్వడంలో మార్కం కీలకపాత్ర పోషించారు. గత సంవత్సరం డిసెంబర్లో నుంచి అతను 'గోప్నియా సైనిక్'గా పని చేయడం ప్రారంభించాడు. ఈ రహస్య ఇన్ఫార్మర్లను నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను సేకరించడం కోసం స్థానిక స్థాయిలో జిల్లా పోలీసులు నియమిస్తారు. నిందితుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: శ్రీకి లీలలు!!.. జన్ ధన్ అకౌంట్ల నుంచి 6వేల కోట్ల సొమ్ము మాయమైందన్న కుమారస్వామి -
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల మెరుపుదాడి.. ఇద్దరు జవాన్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. నారాయణపూర్ జిల్లా కాదేనార్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్ కోసం బయలు దేరిన ఐటీబీసీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై అతి దగ్గర నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐటీబీసీ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్ముఖ్ సింగ్ అమరులయ్యారు. మృతి చెందిన జవాన్ల నుండి ఏకే 47 ఆయుధం, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీలను నక్సల్స్ దోచుకుని పోయారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందరరాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం -
తెర్రాం ఎన్కౌంటర్: బస్తర్ రేంజ్ ఐజీ కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: బీజాపూర్ జిల్లా తర్రెం ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు ఖండించారు. ఎన్‌కౌంటర్‌పై పొంతలేని సమాధానాలు చెబుతున్నారని, మావోయిస్టుల మాటల్లో వైరుధ్యం కనిపిస్తోందన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది జవాన్లు అమరులైన విషయం విదితమే. అయితే, ఈ ఘటనలో మృతి చెందిన మావోయిస్టుల వివరాలకు సంబంధించి పొంతనలేని సమాధానాలు వస్తున్నాయన్న ఐజీ సుందర్రాజు... ‘‘భద్రతా దళాల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, యూనిఫాం, బూట్ల లూటీ చేశారు. కానీ నక్సల్స్ మాత్రం 14 ఆయుధాలు, రెండు వేలకు పైగా తూటాలు లూటీ చేశామని చెప్పడంలో నిజం లేదు. నక్సలైట్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మినపా ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని మొదట ప్రకటించారు. అయితే, వారం రోజుల తర్వాత, 30 మంది సహచరులు మరణించారని చెబుతున్నారు. తాజాగా జరిగిన తర్రెం ఎన్కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారని చెబుతూ ఐదుగురు నక్సల్స్ ఫోటోలు విడుదల చేశారు’’ అని మావోయిస్టుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. చదవండి: తెర్రాం ఎన్కౌంటర్: హిడ్మా లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం నెత్తురోడిన బస్తర్ -
మీ త్యాగం మరువం సైనికా..
విజయనగరం క్రైమ్/సత్తెనపల్లి: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరత్వాన్ని పొందిన విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన ఆర్మీ జవాన్ రౌతు జగదీశ్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణల అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. జగదీశ్ మృతదేహానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, విశాఖ రేంజ్ డీఐజీ రంగారావులు నివాళులర్పించారు. జోహార్ జగదీశ్, భారత్ మాతాకీ జై అంటూ ఓ వైపు ఎన్సీసీ విద్యార్థులు, మరోవైపు అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు నినదిస్తుండగా గాజులరేగ దిగువ వీధిలో ఉన్న ఇంటి నుంచి మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య జగదీష్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించారు. జవాన్ రౌతు జగదీశ్ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు మౌనం పాటించగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు జగదీష్ మృతదేహంపై ఉన్న జాతీయ జెండాను తీసి అతని తండ్రి సింహాచలానికి అందజేశారు. అనంతరం ఆయన అంత్యక్రియాలు నిర్వహించారు. అలాగే, శాఖమూరి మురళీకృష్ణ (32) పార్థివదేహం మంగళవారం ఉదయం గుడిపూడిలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. ప్రత్యేక వాహనంలో సీఆర్పీఎఫ్ బలగాలు మురళీకృష్ణ పార్థివదేహాన్ని తీసుకువచ్చాయి. తర్వాత తాలూకా సెంటర్లోని సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచి బాణాసంచా కాల్చారు. అనంతరం ప్రత్యేక వాహనంపై మురళీకృష్ణ పార్థివదేహాన్ని ఉంచారు. యువకులు బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. సత్తెనపల్లి నుంచి గుడిపూడి వరకు 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకువెళ్లారు. గ్రామంలో మురళీకృష్ణ ఇంటి వద్ద పార్థివదేహాన్ని బాక్సులో నుంచి తెరిచి తల్లిదండ్రులకు చూపించారు. మురళీకృష్ణ మృతదేహానికి వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. శ్మశాన వాటికలో సీఆర్పీఎఫ్ పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
కమాండో రాకేశ్వర్ సురక్షితం
-
తెర్రాం ఎన్కౌంటర్: హిడ్మా లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ/ రాయ్‌పూర్: మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్ల పట్ల మావోయిస్టుల ఘాతుకానికి దీటుగా బదులిచ్చేందుకు, వారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా, భద్రతా బలగాలను ట్రాప్ చేసిన మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా 'ఆపరేషన్ ప్రహార్-3' చేపట్టనుంది. హిడ్మాతో పాటు 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా.. భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ జాబితాను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని తెర్రాం వద్ద మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో, మావోయిస్టులతో చేతులు కలిపి, వారితో భాగస్వామ్యమయ్యే వ్యక్తులను గుర్తించాలని కేంద్ర హోం శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా హిడ్మా వంటి కీలక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొత్త ఆపరేషన్‌కు ఉపక్రమించింది. చదవండి: పెళ్లింట చావు డప్పులు నెత్తురోడిన బస్తర్ -
మావోయిస్టుల అదుపులోని కమాండో రాకేశ్వర్ సురక్షితం
ఛత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ ఘటనలో కనిపించకుండా పోయిన కోబ్రా బెటాలియన్ కమాండో రాకేశ్వర్‌సింగ్ మావోయిస్టుల అదుపులో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రాకేశ్వర్ విడుదలపై ఇప్పటి వరకు మావోయిస్టులు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. మరోవైపు రాకేశ్వర్‌ను విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ‘అంకుల్.. ప్లీజ్.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ కమాండో రాకేశ్వర్‌సింగ్ కుమార్తె మావోయిస్టులను వేడుకున్న విషయం తెలిసిందే. తన తండ్రిని తల్చుకుని ఏడుస్తూ.. విడిచిపెట్టాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొత్తంగా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగా బయటపడాలని ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. జవాన్ల కోసం ముమ్మర గాలింపు బీజాపూర్ జిల్లాలోని తెర్రాం ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై శనివారం మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మావోల దాడితో అలర్ట్ అయిన జవాన్లు.. ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతి చెందగా.. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. అదృశ్యమైన జవాన్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యను తీవ్రతరం చేశాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల అడవులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. చదవండి: ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా 'ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి' -
ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: బీజాపూర్ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయికి వెళ్లి మావోయిస్టులను హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. బలగాల్లో ఆత్మ స్థైర్యం పెంచేందుకు అమిత్‌షా సోమవారం జగదల్పూర్, బీజాపూర్ జిల్లాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు జగదల్పూర్ వచ్చిన అమిత్‌షా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి 10.45 గంటలకు అమర జవాన్లకు నివాళులర్పించారు. 11.20 గంటలకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, సీఆర్పీఎఫ్ డీజీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బీజాపూర్ జిల్లా బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపునకు వెళ్లి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో మాట్లాడారు. రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను సాయంత్రం 3.30 గంటలకు పరామర్శించారు. అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఘటనపై జగదల్పూర్లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతూ మావోయిస్టులపై పోరులో జవాన్లు చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని, వారి అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరవదని కొనియాడారు. ‘ఆపరేషన్ ప్రహార్–3’చేపట్టి మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్నారు. బలగాలను, బెటాలియన్లను మరింత పెంచి, పోరును ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మావోలపై ప్రతీకారం తీర్చుకుంటామని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దండకారణ్య బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతోపాటు మరో ఎనిమిది మంది మావో యిస్టు పార్టీ అగ్రనేతలను మట్టుబెడతామన్నా రు. హోంమంత్రి ఏకంగా క్షేత్రస్థాయికి వచ్చి హెచ్చరిక చేయడంతో కేంద్రం ఈ ఘటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది. సరిహద్దు తెలంగాణలో మరింత కూంబింగ్.. గోదావరి పరీవాహక తెలంగాణ జిల్లాల్లో ప్రస్తు తం అలజడి నెలకొంది. బీజాపూర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు, యాక్షన్ టీముల కదలికలపై పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గత జూలైలో కమిటీలు వేసుకున్న మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లు కూడా చేస్తోంది. మరోవైపు సింగరేణి కార్మిక సమాఖ్యను, రైతు విభాగాన్ని, జననాట్య మండలిని పునరుద్ధరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. వెనక్కి వెళ్లకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు బీజాపూర్, జగదల్పూర్ జిల్లాల్లో ఒకవైపు అమిత్‌షా పర్యటన సాగుతుండగానే మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసింది. భారతదేశ దోపిడీ వర్గం రక్షణలో పనిచేసే భద్రతాదళాల్లో ఉద్యోగాలు చేయడం మానేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 నుంచి దోపిడీదారుల దాడులు తీవ్రమయ్యాయని, ఈ క్రమంలో దండకారణ్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండటంతోపాటు అనేక త్యాగాలు చేస్తున్నారని అన్నారు. పీఎల్జీఏ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లు చేస్తుండడంతోపాటు ప్రజలను, మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. కిసాన్ ఆందోళనలో 300 మంది రైతులు త్యాగాలు చేశారన్నారు. జై జవాన్–జై కిసాన్ అంటూ పాలకవర్గాలు ఇచ్చే నినాదం మోసపూరితమైనదని, గత 75 ఏళ్లలో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, కూలీలు, గిరిజనులు, నిరుద్యోగులు ఉద్యమించాలని లేఖలో కోరారు. ఈ నెల 26న భారత్‌బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. చదవండి: మా అధీనంలోనే కోబ్రా కమాండో -
'ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి'
చర్ల/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని తెర్రం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కోబ్రా బెటాలియన్ కమాండో రాకేశ్వర్‌సింగ్ ఆచూకీ కనిపించకుండా పోయింది. ఆయనను తామే అపహరించినట్టుగా మావోయిస్టులు ప్రకటించారు. నిజంగానే మావోలు రాకేశ్వర్‌ను అపహ రించారా అన్నది నిర్ధారించుకు నేందుకు సెక్యూరిటీ దళాలు, నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆయన ప్రాణా లతో క్షేమంగానే ఉన్నారా? లేక మళ్లీ పోలీసు బలగాలను ట్రాప్ చేసేందుకు కుట్ర పన్నారా? అలాకాకుండా తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఇలా కమాండో తమ అదుపులో ఉన్నాడని చెబుతూ బలగాల దూకుడుకు బ్రేక్ వేస్తున్నారా అన్న అనుమానాలను పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ నిజమే కావొచ్చన్న అధికారులు! జమ్మూకు చెందిన రాకేశ్వర్‌సింగ్ 210 కోబ్రా బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఆయన తోటి జవాను ఎన్కౌంటర్లో చనిపోయారు. రాకేశ్వర్ ఆచూకీ తెలియరాలేదు. అయితే మావోల ప్రకటనను నమ్మేందుకు కారణాలున్నాయని సెక్యూరిటీ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. కమాండోను అపహరించామని మావోయిస్టులు ఆదివారం ఫోన్ ద్వారా ఒక జర్నలిస్టుకు వెల్లడించారు. ఆ కాల్ చేసింది దాడికి సూత్రధారి అయిన హిడ్మా అని సదరు జర్నలిస్టు చెప్పారు. మావోయిస్టులు చెప్పినట్టే కమాండో రాకేశ్వర్‌సింగ్ ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదని.. అయితే నిజంగా నక్సల్స్ చేతికి ఆయన చిక్కారనేందుకూ గట్టి ఆధారాల్లేవని అధికారులు అంటున్నారు. సంప్రదింపులపై దృష్టి జవాన్ తమ ఆధీనంలో ఉన్నాడంటూ మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు హక్కుల సంఘం నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అక్కడి హక్కుల నాయకుడు సోను సోరుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మీడియా ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపి.. మావోయిస్టుల నుంచి జవాన్‌ను విడిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగా బయటపడాలని ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. విడిపించండి..ప్రధాని మోదీ, అమిత్‌షాలకు రాకేశ్ భార్య విజ్ఞప్తి రాకేశ్వర్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా చర్యలు తీసుకోవాలని కమాండో భార్య మీనూ మన్హాస్ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిపించినట్టుగా.. తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించాలని ఆమె వేడుకున్నారు. ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి ‘అంకుల్.. ప్లీజ్.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ కమాండో రాకేశ్వర్‌సింగ్ కుమార్తె మావోయిస్టులను వేడుకుంది. తన తండ్రిని తల్చుకుని ఏడుస్తూ.. విడిచిపెట్టాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి వీడియోను చూసిన వారంతా సానుభూతితో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే -
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
-
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్ ఘటనకు ప్రధాన సూత్రధారైన హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టును మడివి. వనజగా గుర్తించారు. ఆమె వద్ద నుంచి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. అతడిని పట్టుకునేందకు వెళ్లిన దళాలు అతడి వ్యూహంలో చిక్కుకున్నాయి. అనంతరం భద్రతా దళాలను హిడ్మా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. గతంలో కసాపాల్, మినపా ఘటనలకు హిడ్మానే నాయత్వం వహించాడు. ఎవరీ హిడ్మా.. హిడ్మా అలియాస్ హిడ్మాన్న(40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజనుడు. 90వ దశకంలో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు. భయంకరమైన, ఘోరమైన ఆకస్మిక దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ప్రస్తుతం మహిళలతో సహా 180-250 మంది మావోయిస్టుల దళానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో (డీకేఎస్‌జడ్) లోనే కాక సీపీఐ(ఎం) 21 సుప్రీం మెంబర్ సెంట్రల్ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అతడిని సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా నియమించినట్లు తెలిసింది. భీమ్ మాండవి హత్యా నేరంలో ఎన్ఐఏ హిడ్మాపై చార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎలా దాడి చేస్తారంటే.. ప్రతి ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో మావోయిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేసుకుని వ్యూహాత్మక ఎదురు దాడి (కౌంటర్ ఆఫెన్సివ్ కాంపెయిన్(టీసీఓసీ) అంబుష్ ఆపరేషన్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం)లను నిర్వహిస్తారు. ఈ కాలాన్నే ఎందుకు ఎన్నుకుంటారంటే.. ఈ సీజన్లో చెట్లు ఆకులు రాలి మోడులుగా మారడంతో భద్రతా దళాల కదలికలు బాగా కనిపిస్తాయి. అందుకే మావోయిస్టులు ఎక్కువగా ఈ సీజన్లో ఎదురుదాడులకు దిగుతారు. నేడు చత్తీస్‌గఢ్‌కు అమిత్ షా.. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఉ.10.30 గంటలకు జగదల్పూర్కు వెళ్లి.. అమరులైన జవాన్లకు అమిత్ షా నివాళులర్పించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం అమిత్ షా రాయ్‌పూర్‌లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే -
ఆ జర్నలిస్ట్‌లకు శిక్ష తప్పదు: మావోయిస్టులు
సాక్షి, చర్ల: రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి, మీడియాకు ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధులు మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను వెళ్లగొట్టి.. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన గనులను దోచుకోవడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపించింది. అందులో భాగంగానే అటవీ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తూ.. ఆదివాసీలపై దాడులు చేస్తూ.. వారిని వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో కొందరు సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని.. బీజాపూర్ జిల్లాకు చెందిన గణేశ్ మిశ్రా, లీలాధర్‌రథి, విజయ్, ఫారూఖ్ అలీ, సుబ్రాస్తు చౌదరి పేర్లను ప్రస్తావించింది. ఆ అవినీతిపరులను, కార్పొరేట్ శక్తుల బ్రోకర్లను ప్రజాకోర్టులో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారంటూ పార్టీ తన లేఖలో పేర్కొంది. మీడియా ప్రతినిధుల్లో కలవరం.. మావోల హెచ్చరికలతో బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇదేమి కొత్త కాదు.. ప్రాణాలకు తెగించి ఈ ప్రాంతాల్లో జర్నలిస్టులు పని చేస్తుంటారన్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం బీజాపూర్ జిల్లాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సాయిరెడ్డితోపాటు అదే జిల్లాకు చెందిన మరొక జర్నలిస్టుపై అనుమానం పెంచుకున్న మావోలు హతమార్చారు. మావోయిస్టులకు కొన్నిసార్లు అందే తప్పుడు సమాచారంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెనక్కి తగ్గిన మావోలు.. ఇక ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టులపై మావోలు చేసిన ఆరోపణలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మావోలకు అందే తప్పుడు సమాచారం వల్ల కిడ్నాప్‌లకు గురైన పలువురు అమాయక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల పక్షాన నిలిచి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి దండకారణ్యానికి వెళ్లి చర్చలు జరిపి సరైన సమాచారమిచ్చి బందీలుగా ఉన్న వారిని విడిపించడం జరిగింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులు ఇప్పటికీ సరైన ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారని, అయితే మావోయిస్టుల ఆరోపణలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల హెచ్చరికలను వెనక్కి తీసుకోవాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక జర్నలిస్టులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన జర్నలిస్టు సంఘాలు మద్దతునిచ్చి ఆందోళనల్లో పాల్గొనడంతో మావోయిస్టులు అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు వద్దని, పరిస్థితిపై సామరస్యంగా చర్చించుకుందామని కోరింది. చదవండి: దూకుడే మంత్రం -
మావోయిస్టుల ఊచకోత.. 25 మంది హత్య
బస్తర్ : ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 25 మంది గిరిజనులు హతమార్చి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీస్ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని పేర్కొంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్యకు ఉపక్రమించామని తెలిపింది. ఈ ఘటనకు బస్తర్ పోలీస్ ఐజీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీలే అని మావోయిస్ట్ పార్టీ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. గతకొంతకాలంగా వీరు మావోయిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. ‘ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు వస్తున్నారని, పోలీసులే బాంబులు పెట్టి అమాయకులు చంపి తమపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 మంది పార్టీ నేతలను ఎన్కౌంటర్ చేశారు. కార్యకర్తలను హత్య చేశారు. డీజీపీలు, ఐజీలు హెలికాప్టర్లలతో తిరుగుతూ, కూంబింగ్ చేస్తూ ప్రజలను భయకంపితులకు గురిచేస్తున్నారు. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25 మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం’ అని మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేర్కొంది. -
భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో మావోయిస్ట్‌ల కలకలం
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఎస్సై నేలకొరగగా నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్దోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మాటు వేసి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై శ్యాంకిశోర్ శర్మను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టులను కాంకేర్ డివిజినల్ కమిటీ సభ్యుడు అశోక్ రైను, ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణ నరేటి, ఎల్ఓఎస్ సభ్యులు సవితా సలామే, పర్మిలలుగా గుర్తించారు. వీరిలో అశోక్‌పై రూ.8 లక్షల రివార్డు, కృష్ణపై రూ.5 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ. లక్ష చొప్పన రివార్డు ఉన్నట్లు రాజ్‌నంద్‌గావ్ ఏఎస్పీ తెలిపారు. వీరికి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన పలు ఘటనలతో సంబంధముందన్నారు. ఏకే–47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 12–బోర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. -
తగ్గిన మావోయిస్టుల ప్రాబల్యం
-
కలవరపెడుతున్న కరపత్రాలు
సాక్షి, ములుగు : జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వరుసగా జరుగుతున్న మావోయిస్టు కరపత్రాల విడుదల జిల్లా యంత్రాంగానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల కావడంతో కలకలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపి నాయకులు, ఆదివాసీ సంఘాలు, అధికారులను టార్గెట్ చేస్తూ విడుదల కావడంతో ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిప్పి కొట్టిన ప్రజాప్రతినిధులు.. గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో గుబులు మొదలయ్యింది. తాము చేయని తప్పుకు తలదించాల్సిన అవసరం లేదని కొంతమంది ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలపై ఈ నెల 18న జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘాటుగా స్పందించారు. భూ ఆక్రమణలకు, అవినీతి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేటతెల్లం చేశారు. అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు కరపత్రాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు కరపత్రాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులను ఏటూరునాగారం స్టేషన్‌కి పిలిపించి తగిన వివరాలను సేకరించారు. స్థానికంగా ఉండకుండా పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. దీంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఆరా తీస్తున్నారు. మొదటి కరపత్రంలో ఇలా.. లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 17న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఇందులో ఏటూరునాగారంలోని కొంత మంది నాయకులు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, ఉమ్మడి భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ దందాలు, భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అలాగే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వైద్యుల కారణంగానే సామాన్య గిరిజనులు వైద్యసేవలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటును ఆశ్రయించి వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించినా వాటిని గిరిజనుల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని ఐటీడీఏ పీఓ, ఏపీఓల వైఖరిని తప్పుబట్టారు. రెండో కరపత్రంలో.. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల ప్రోత్భలంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఈ నెల 24న ఓ కరపత్రంలో పేర్కొన్నారు. మండలంలోని సుడిబాక గ్రామానికి చెందిన 56 మంది రైతుల 150 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కబ్జా చేశారని కరపత్రంలో తెలిపారు. జీఎస్పీ, ఏవీఎస్పీ సంఘాలకు చెందిన వారు కూడా వత్తాసు పలుకుతూ లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. లక్ష్మీనగరం, దానవాయిపేట గ్రామాల ఆదివాసీలకు చెందిన 27 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్నారని, అమాయక ఆదివాసీలు నిత్యం అధికారులు, కోర్టుల చుట్టూ న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. రైతుల నుంచి ఆక్రమించిన భూమిని వెంటనే వారికి అప్పగించాలని, లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్షతప్పదని కరపత్రంలో హెచ్చరించారు. -
ఖానాపూర్‌లో నేటికీ చెదరని జ్ఞాపకాలు
సాక్షి, ఖానాపూర్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంఘటనల వివరాలివే.. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్ఐ ఖాదర్‌ఉల్‌హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్‌హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్. మోహన్‌దాస్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 1999 డిసెంబర్ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్‌కంట్రోలర్ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్ఐ మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్ దుర్మరణం చెందారు. ఖానాపూర్‌లో అమరుల స్థూపం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్‌తో పాటు ఎస్ఐ గోగికారి ప్రసాద్‌లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఐదుగురు మావోల ఎన్కౌంటర్
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని దుర్వేదా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు పోలీసు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటన్నర పాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ముగిసిన అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మహిళ సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను తరలించి కూంబింగ్ ముమ్మరం చేశారు. -
టీఆర్ఎస్కు మావోయిస్టుల హెచ్చరిక
సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్బీ పోలీసులు ఇన్ఫార్మర్గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు. అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్ పిలుపునిచ్చారు. -
కూతురి సీమంతానికి వస్తానని..
యశవంతపుర : ఛత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల దాడిలో మరణించిన కలబురిగికి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్సై మహదేవ్ పాటిల్ (50) అంత్యక్రియలు శనివారం సాయంత్రం స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జిల్లాలోని కమలాపుర తాలూకా మరగుత్తి గ్రామంలో అపార జనసందోహం కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ప్రత్యేక వాహనంలో ఆయన పార్థివదేహం గ్రామంలోకి రాగానే భారీసంఖ్యలో ప్రజలు జాతీయ పతాకం ఊపుతూ గౌరవం ప్రకటించారు. యువత బైక్ ర్యాలీతో అనుసరించారు. పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాటిల్ భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకటో తేదీన వస్తానని మహదేవ్ పాటిల్ జూలై 1వ తేదీన కూతురి సీమంత వేడుకకు రావలసి ఉండగా, అంతలోనే విషాదం సంభవించింది. చత్తీస్‌గడ్‌లోని బిజాపుర జిల్లాలో మూడురోజుల కిందట నక్సలైట్ల దాడిలో పాటిల్ అమరుడయ్యారు. ఆయన హైదరాబాద్‌లో సీఆర్పీఎఫ్లో 15 ఏళ్లు నుంచి పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌కు బదిలీ అయ్యారు. ఆయనకు భార్య, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. -
అగ్రనేతల కోసం జల్లెడ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం వణుకుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కూంబింగ్ దళాల బూటు చప్పుళ్ల శబ్ధాలతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లుతోంది. ఒడిశా సరిహద్దుల్లోని పాడువా వద్ద జరిగిన ఎకౌంటర్‌లో ఐదుగురు కీలక నేతలు హతమయ్యారు. వీరిలో ముగ్గురు అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను హతమార్చిన మావోల బృందంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. మరో వైపు వీరి వద్ద లభ్యమైన కిట్ బ్యాగ్‌లలో అత్యంత కీలక సమాచారం పోలీసుల చేతికి చిక్కింది. ఏవోబీలో మావో అగ్రనేతలు గత కొంత కాలంగా షెల్టర్ తీసుకుంటున్నారన్న వార్త కలకలం రేపింది. ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్‌లు గిరిజనులతో కూడా భేటీఅవుతున్నారన్న సమాచారం పోలీసులను కలవరపెడుతోంది. పైగా మావోలకు సహకారం అందిస్తున్నది పోలీసులేనన్న వార్తలు పోలీస్ ఉన్నతా«ధికారులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ ఆరోపణలతోనే సీలేరు జెన్కోలో పనిచేస్తున్న హోంగార్డులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మావో అగ్రనేతల కోసం మూడు కంపెనీల ప్రత్యేక బలగాలు గాలింపు సాగిస్తున్నారు. మరో వైపు ఆదివారం యాక్షన్ టీమ్స్‌ను కూడా రంగంలోకి దించారు. విశాఖ రేంజ్ డీఐజీ, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతి ఏటా మావోలు ఏదో ఒక అలజడి సృష్టిస్తుంటారు. గతంలో ఇదే ఉత్సవాల సమయంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్లు రవిశంకర్, సింహాచలంలను హతమార్చారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే సమయంలో పలువుర్ని ఇన్ఫార్మర్ల నెపంతో మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి జాతర మహోత్సవాల సందర్భంగా ఎలాంటి అలజడలు..అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఓ పక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు విశాఖ మన్యంలోనే మావో అగ్రనేతలున్నారని, ఏదో భారీ విధ్వంసానికి తెగపడేందుకు కుట్ర చేస్తున్నారన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నారు. అగ్రనేతలు సంచరించినట్టుగా చెబుతున్న గ్రామాల్లో అణువణువు గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఓ ఆరడజను మంది గిరిజనుల విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారని, వార్ని విడిచిపెట్టాలంటూ వామపక్ష నేతలు ఎస్పీని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. మరో వైపు అనుమానం వచ్చిన గిరిజనులకే కాదు..పోలీసుల్లో కూడా మావోయిస్టులకు సహకరిస్తున్న వారు ఉన్నారన్న వార్తలతో మరింత నిఘా పెంచారు. ఒక్క పోలీసులనే కాదు.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మావో సాను భూతిపరులపై కూడా నిఘా పెట్టారు.ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీ పోలీసులు, ఒడిశా సరిహద్దు వైపు నుంచి ఆ రాష్ట్ర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏవోబీలో కూంబింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని శనివారం మావోలు మందుపాతర పేల్చడం..ఈ ఘటనలో ముగ్గురు ఎస్పీజీ దళ సభ్యులు గాయపడడంతో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కచ్చితంగా ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. ఎన్నికలనంతరం పోలీసులు కాస్త విశ్రాంతి తీసుకుంటారని భావించిన మావోలు ఏవోబీలో ఏదో విధంగా అలజడి సృష్టించేందుకు తెగపడే సూచనలు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఏది ఏమైనా మరో సంఘటన జరగకుండా సాధ్యమైనంత త్వరగా ఏవోబీలో మకాం వేసిన పోలీసులు మావో అగ్రనేతలను పట్టుకోవాలని పకడ్బందీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. -
ఏజెన్సీలో మావోయిస్టుల ఘాతుకం
-
మావోయిస్ట్ అటాక్
-
అమర జవానుకు అశ్రునివాళి
సాక్షి, రామచంద్రపురం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన శీలం రామకృష్ణ (30) వీరమరణం పొందారు. ఆయ న మృతదేహాన్ని బీఎస్ఎఫ్ నేతృత్వంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పట్టణంలోని శీలంవారి సావరంలో ఉన్న ఆయన ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన ఆయన మృతదేహాన్ని పట్టణ వాసులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలకు గౌరవ సూచకంగా జవాన్లు గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి, వందనం సమర్పించారు. విశాఖపట్నం, కాకినాడ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు రామకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వీర జవాను రామకృష్ణ మృతదేహం ఇంటికి చేరుకోగానే భార్య సౌందర్య, ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బీఎస్ఎఫ్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రామకృష్ణకు 2016లో సౌందర్యతో వివాహం జరిగింది. ఇటీవల ఇంటికి వచ్చిన రామకృష్ణ మాటల సందర్భంగా తన మామయ్యతో ‘‘నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దురుగాని’’ అని అన్నారు. రామకృష్ణ అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజల్ని చూసి.. ఆ మాటలే గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముని గిపోయారు. ఆర్డీఓ ఎన్.రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్సై ఎస్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్మశాన వాటికలో రామకృష్ణ మృతదేహానికి వైఎస్సార్ సీపీ రామచంద్రపురం ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు శ్రద్ధాంజలి ఘటించి, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు జవాన్లు మృతి
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందరాజ్ మాట్లాడుతూ.. 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కాల్పులకు దిగిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నమని ఆయన తెలిపారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి
చర్ల/మల్కన్‌గిరి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ– చింతల్నార్ పోలీస్ స్టేషన్ల సరిహద్దులోని బీమాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మాటువేసి ఉన్న మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో, పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. కాల్పుల అనంతరం మృతదేహాల వద్ద ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు .303 రైఫిళ్లు, ఒక బర్మార్ తుపాకీ, పేలుడు సామగ్రి,, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నలుగురిలో దుధి హిడ్మా, ఆయ్‌తే అనే ఇద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు కూడా ఉందని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని దక్షిణ బస్తర్ డీఐజీ సుందర్రాజ్ తెలిపారు. -
ఎన్కౌంటర్ కలకలం
కోనరావుపేట(వేములవాడ): ఒడిశాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ కోనరావుపేట మండలంలో కలకలం రేపింది. ఇదే మండలంలోని శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క ఎన్కౌంటర్లో ఉన్నట్లు ప్రచారం కావడంతో మండలకేంద్రంతో పాటు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని పుస్పూల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భధ్రాతా బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్ట్ మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఆమెపేరు జ్యోతి అని తెలియడంతో కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామంతో పాటు మండలం ఉలిక్కిపడింది. చివరికి శివంగాలపల్లికి చెందిన జ్యోతి కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. జ్యోతి నేపథ్యం ఇదీ... కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల నర్సయ్య, భూదవ్వల కూతురు జ్యోతి అలియాస్ జ్యోతక్క. ఐదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో, 6–10 వరకు కోనరావుపేట ఉన్నత పాఠశాలలో, ఇంటర్ సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో చదివింది. 2004లో శివంగాలపల్లిలో అప్పటి దళ కమాండర్ పద్మక్క గ్రామంలో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాన్ని కళ్లారా చూసి, మాటల్ని విన్న జ్యోతి ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. కళాశాలలో చదువుతుండగానే సీవో రఘు ఆధర్యంలో దళంలోచేరి అజ్ఞాతంలోకి వెళ్లింది. మదిమల్ల ఎల్జీఎస్ దళ స భ్యురాలిగా ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్, నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్ ప్రాంతాల్లో పనిచేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో దళకమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల్లో ఆందోళన... గురువారం ఎన్కౌంటర్ జరిగిందని, అందులో వీరి కూతురు ఉందని ప్రచారం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నర్సయ్య, భూదవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు వినోద, ప్రేమల, జ్యోతి, ఇద్దరు కుమారులు మల్లయ్య, సుధాకర్ ఉన్నారు. వీరిలో మల్లయ్య మృతి చెందగా, జ్యోతి అజ్ఞాతంలో ఉంటుంది. ఎప్పటికైనా తమ కూతురు రాకపోతుందాని వృద్ధ తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. -
‘అమ్మా.. ఐ లవ్ యూ. జాగ్రత్త’
-
మావోయిస్టు దాడిలో జర్నలిస్టు దుర్మరణం
చత్తీస్గడ్: మావోయిస్టుల దాడిలో ఒక వీడియో జర్నలిస్టు దుర్మరణం పాలయ్యారు. దంతేవాడ జిల్లాలో మంగళవారం జరిగిన నక్సల్స్‌దాడిలో ప్రభుత్వరంగ మీడియాసంస్థ దూరదర్శన్‌కు చెందిన కెమెరామ్యాన్ దుర్మరణం చెందారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన దూరదర్శన్ బృందం, పోలీసులపై దంతెవాడలోని అరన్పూర్ అడవుల సమీపంలో ఈదాడి జరిగింది. ఈ ఘటనపై నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందర్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. చనిపోయిన మీడియా పర్సన్‌ను దూరదర్శన్ వీడియో జర్నలిస్టు అచ్యుతానందన్ సాహుగా గుర్తించామన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్రు పోలీసులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించామని డీఐజీ మీడియాకు వెల్లడించారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. Dantewada Naxal attack: Two security personnel who were injured brought to hospital. Two security personnel and a DD cameraman lost their lives in the attack. #Chhattisgarh pic.twitter.com/ZiqbwiNbNs — ANI (@ANI) October 30, 2018 -
పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్’ కీలక వీడియో!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన మన్యంలో డీజీపీ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మావోల ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ పర్యటనకు ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్‌తోపాటు నిఘా వర్గాలు మావోల కదలికలపై అంచనా వేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సంబంధించిన తాజా సమాచారం సేకరించిన అనంతరం బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి డీజీపీ మన్యం పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో మావోయిస్టులు నిర్వహించిన ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్, పార్టీ నాయకుల నుంచి సెల్‌ఫోన్‌ను మావోయిస్టులు ముందే తీసుకుని, వారిని దూరంగా ఉండాలంటూ గన్లతో కాపలా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డుపై బైక్‌పై వెళుతున్న వారిని మావోయిస్టులు అడ్డగించినట్టు చెబుతున్నారు. వారిలో ఒకరు మావోయిస్టుల కన్నుగప్పి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించినట్టు తెలిసింది. అందులో మావోయిస్టులు దారి అడ్డగించడం, ఘటన తర్వాత పారిపోతున్న క్లిప్పింగ్‌ను పోలీసులు వ్యూహాత్మకంగానే మంగళవారం విడుదల చేసినట్టు తెలిసింది. ఇంకా కీలక ఆధారాలతో ఉన్న వీడియో పోలీసుల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపిన మావోయిస్టుల్లో కొందరిని వీడియో ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. స్తంభించిన మన్యం.. స్వచ్ఛందంగా బంద్ అరకు/పాడేరు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యకాండకు నిరసనగా సోమవారం మన్యంలో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అరకు పట్టణంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. బంద్ వల్ల అరకు పర్యాటక కేంద్రం బోసిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు స్థానికంగా రిజర్వ్ చేసుకున్న అతిథి గృహాలు, ప్రైవేట్ రిసార్ట్స్, టూరిజం, పలు లాడ్జీల గదులన్నింటినీ ఆన్లైన్లోనే రద్దు చేసుకున్నారు. దీంతో మూడ్రోజుల నుంచి అరకులోయ ప్రాంతంలోని అతిథి గృహాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉన్న పర్యాటకులు కూడా భయంతో గదుల నుంచి బయటకు రాలేదు. పాడేరులో కిడారి, సోమకు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది మంగళవారం సంతాపాన్ని తెలియజేశారు. అరకు అంటే బెరుకు! విశాఖపట్నం : అరకు ఈ పేరు వింటేనే పర్యాటకులు అక్కడి అందాలు చూడడానికి పరుగులు పెడతారు. ప్రకృతి సోయగాలు, అందాల లోయలు, మంచుకమ్మిన పర్వతాలు, మెలికలు తిరుగుతూ కనిపించే రహదారులు, జలజల జాలువారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌందర్యాల సమాహారం విశాఖ మన్యం! అలాంటి రమణీయతలో అలరారే ఏజెన్సీ ఇప్పుడు పర్యాటక ప్రియులను భయపెడుతోంది. మూడు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యం వణుకుతోంది. ఇప్పుడు ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల కోసం భారీ సంఖ్యలో పోలీసులు కూంబిగ్ చేపట్టారు. సాయుధ భద్రతా దళాలు అడవుల్లోనూ, మారుమూల పల్లెలు, గూడేల్లోనూ అణువణువునా జల్లెడ పడుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి వెళ్లడానికి సాహసించలేక పోతున్నారు. అరకులోని పద్మావతి గార్డెన్స్, డుంబ్రిగుడ మండలం చాపరాయి, అనంతగిరి మండలం బొర్రా గుహలు, టైడా, ఇంకా పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు పర్యాటకులెవరూ తొంగి చూడడం లేదు. నిత్యం వేలాది మందితో కిక్కిరిసే బొర్రా గుహలు బోసిపోతూ కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి పర్యాటకశాఖ నడిపే టూర్ ప్యాకేజీ బస్సులను కూడా సోమ, మంగళవారాలు రద్దు చేసింది. మరోవైపు అరకు పరిధిలో ఉన్న 180 పర్యాటకశాఖ గదులు ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక అనంతగిరిలోని పర్యాటక గదుల పరిస్థితి కూడా అదే. పక్షుల కిలకిలరావాలతో అలరించే టైడా జంగిల్‌బెల్స్ కూడా జనంలేక వెలవెలబోతోంది. విశాఖ మన్యంలో సామాన్య పరిస్థితులు నెలకొనడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా బుధవారం నుంచి పర్యాటక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి మంగళవారం రాత్రి సాక్షి’కి చెప్పారు. -
గన్మెన్ల తుపాకులు లాక్కొని చంపారు : డీఐజీ
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారని విశాఖ డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాదాపు 20మంది మవోయిస్టులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు.ఎమ్మెల్యే గన్మెన్లను దూరంగా పంపి వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. అనంతరం సర్వేశ్వరావు, సోమలను కిరాతంగా కాల్చి చంపారు. రెండు టీమ్‌లుగా ఏర్పాడ్డ మావోలు మొదటగా సోమను కాల్చి చంపారు. అనంతరం సర్వేశ్వరావును కాల్చారు. ఒడిశాకు 15 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఫైర్ తర్వాత మావోయిస్టులు పారిపోయారు.మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతాం’ అని డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల పోలీసులు అరకు ఘటనతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు రూరల్ ఏరియాల్లోకి వెల్లోద్దని సూచించారు. తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పర్యటనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా పెంచారు. ఎజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు భద్రత పెంచతున్నట్లు ప్రకటించారు. -
మావోయిస్టుల ఘాతుకం
చర్ల/పర్ణశాల : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. వరుస ఘటనల్లో తమ అనుచరులను కోల్పోతున్న మావోయిస్టులు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. సీఏఎఫ్, డీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పరిధిలోని చోల్నార్ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు జరిగింది. బచెలి నుంచి చోల్నార్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కూలీలకు రక్షణగా ఉండేందుకు బచెలి నుంచి ఒక బొలెరో వాహనంలో బచేలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు సీఏఎఫ్, డీఎఫ్లకు చెందిన మరో ఆరుగురు జవాన్లు బయలుదేరారు. జవాన్ల రాకను ముందుగానే గమనించిన మావోయిస్టులు మార్గమధ్యంలోని ఓ కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన శక్తివంతమైన మందుపాతరను పేల్చివేశారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం సుమారు 20 అడుగుల మేర ఎత్తు ఎగిరి పడి తునాతునకలైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు టీకేశ్వర్ బర్గ్, తాలిగ్రాం, విక్రమ్‌యాదవ్, రాజేష్‌సింగ్, వీరేందర్నాథ్లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అర్జున్రాజ్వరున్ అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం జవాన్లు మృతి చెందారని నిర్ధారించుకున్న మావోయిస్టులు రెండు ఏకే–47, రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఐఎన్ఎస్ఏఎస్లు, రెండు గ్రెనేడ్లను అపహరించుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బచేలి స్టేషన్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ జవాన్‌ను అర్జున్ వరుణ్‌కు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఘటనలో 200 మంది మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చిన సమయంలో ఘటనాస్థలం వద్ద దాదాపు 200మంది సాయిధులైన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడికి కోసం సుమారు యాభై కేజీల ఐఈడీని మావోయిస్టులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు బలగాలు సంఘటన జరిగిన చుట్టూ గల అటవీప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని బస్తర్ డీఐజీ రత్నల్ దాగ్ని పరిశీలించారు. ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ దుర్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చిలో తొమ్మిది మంది ఈ ఏడాది మార్చి 13న సుక్మా జిల్లా క్రిష్టారాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టులు భారీ ఐఈడీ అమర్చి సీఆర్పీఎఫ్ జవాన్లను క్యాంపునకు తీసుకెళ్తున్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనాన్ని పేల్చడంతో తొమ్మిది మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ దాడితో మావోయిస్టులు, పోలీసు బలాగాల మధ్య పరస్పర దాడులతో దండకారణ్య అట్టుడుకుతోంది. -
‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్ అన్నారు. మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా
-
మావోయిస్టుల ప్రతీకార చర్య
సాక్షి, రాయపూర్ : వరుస ఎదురుదెబ్బలతో డీలాపడ్డ మావోయిస్టులు అదును చూసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ, చోల్నార్ అటవీ ప్రాంతంలో పోలీస్‌లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు మందుపాతర పేల్చారు. ఈదుర్ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం రాయపూర్ తరలించారు. దాదాపు 10 అడుగుల లోతులో మందుపాతర అమర్చారు. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలు అయ్యింది. దంతెవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి జవాన్లు రక్షణగా వెళ్లారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు పథకం ప్రకారం మందుపాతర పేల్చి ఆరుగురు జవాన్ల ప్రాణాలు తీశారు. అనంతరం వారి అధునాతన ఏకే 47, ఇన్సాన్ ఆయుధాలను ఎత్తుకెళ్లారు. -
జవాన్లకు ఆధునిక ఆయుధాలు: హన్స్‌రాజ్
సాక్షి, సుకుమా : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం బుధవారం ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. కాగా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంతోపాటు, నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదాన్ని సవాలుగా తీసుకున్నాయని హన్స్‌రాజ్ తెలిపారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో నక్సల్స్ ఏరివేత చేపడతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమర జవాన్లకు సంతాపం తెలిపారన్నారు. బలగాలను ఆధునీకరిస్తాం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో జవాన్లకు రక్షణగా సాంకేతికతను వాడుకుంటామని హన్స్‌రాజ్ వెల్లడించారు. మందుపాతరలను గుర్తించేందుకు ఐఈడీ డిటెక్షన్ టెక్నిక్‌ను వినియోగిస్తామన్నారు. ఆయాప్రాంతాల్లో బలగాలను పెంచడానికి బదులు ఆధునిక ఆయుధాలను జవాన్లకు అందచేస్తామన్నారు. కాగా సుకుమా జిల్లాలో మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. -
సీఆర్పీఎఫ్పై మావో పంజా
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ దాడికి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా.. సుక్మా జిల్లా కిష్టారం వద్ద మంగళవారం అత్యంత శక్తివంతమైన మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారంతా ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే. కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల 20 మంది మావోయిస్టులు మరణించిన తడపలగుట్టలో ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. 200 కిలోల పేలుడు పదార్థంతో.. ఇటీవల మావోయిస్టుల విధ్వంస కార్యకలాపాలు పెరగడంతో కిష్టారం క్యాంపునకు అనుబంధంగా కాసారంలో మరో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పలువురు జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఈ అనుబంధ క్యాంపునకు బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు.. మార్గంలో సుమారు 200 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)ను అమర్చా రు. సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనాల్లో మొదటి వాహనం అక్కడికి చేరుకోగానే.. మందుపాతరను పేల్చారు. మావోయిస్టులు సాధారణంగా 20 కిలోల వరకు పేలుడు పదార్థాన్ని మందుపాతరల్లో వాడుతారు. అలాంటిది ఏకంగా 200 కిలోల వరకు వాడటంతో... భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి జవాన్ల బుల్లెట్ ప్రూఫ్ వాహనం సుమారు 20 అడుగుల మేర ఎగిరిపడింది. అందులో ఉన్న 11 మంది జవాన్లలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే చనిపోయిన జవాన్లకు సంబంధించిన ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని.. వెనుక మరో వాహనంలో వస్తున్న జవాన్లు కాల్పులు జరపడంతో వారు పారిపోయారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో 200 మంది వరకు మావోయిస్టులు పాల్గొని ఉంటారని పేర్కొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. మృతదేహాలు ఘటనా స్థలంలోనే ఉన్నాయని.. బుధవారం మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయనున్నారు. అనంతరం ఏపీ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అంతా యూపీ, బెంగాల్, బిహార్ వారే మరణించిన జవాన్లంతా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే. వారిని ఆర్కేఎస్.థామస్, అజయ్ కె.ఆర్.యాదవ్, మనోరంజన్, జితేందర్‌సింగ్, శోభిత్ కె.ఆర్.శర్మ, లక్ష్మణ్, మనోజ్ సింగ్, ధర్మేంద్ర సింగ్, చంద్ర హెచ్.ఎస్‌లుగా గుర్తించారు. మాధవ్‌కుమార్, రాజేశ్‌కుమార్‌లు గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని ఛత్తీస్‌గఢ్ డీఐజీ డీపీ ఉపాధ్యాయ, సుక్మా ఎస్పీ అభిషేక్ శాండిల్య పరిశీలించారు. సెలవులు ముగించుకుని రాగానే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాకలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం ద్వారా సరిహద్దుల్లో బేస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులు ముగించుకుని వచ్చిన 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఇక్కడ రిపోర్టు చేసి.. తమ బేస్ క్యాంపులకు వెళ్లి విధుల్లో చేరారు. వారిలో కొందరు కిష్టారం సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా మావోయిస్టుల బాంబు దాడి ఘటన జరిగింది. సెలవులు ముగించుకుని విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే జవాన్లు మృత్యువాతపడటంతో విషాదం నెలకొంది. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా..! తెలంగాణలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలనుకున్న మావోయిస్టులకు తడపలగుట్ట ఎన్కౌంటర్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న మావోయిస్టులు.. అవకాశం కోసం ఎదురుచూసి, తాజా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌తో ఆగ్రహంగా ఉన్న మావోయిస్టులు.. ఈనెల 5న అర్ధరాత్రి సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్–2 డిపోకు చెందిన రెండు బస్సులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ప్రైవేటు బస్సు, మూడు లారీలు, ఒక ట్రాక్టర్‌ను దహనం చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తిని హతమార్చారు. తాజాగా బాంబు పేలుడుకు పాల్పడ్డారు. సంతాపం వ్యక్తం చేసిన మోదీ మావోయిస్టుల మందుపాతర పేలుడులో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మావోయిస్టుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు భారతదేశం సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..’’అని ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా జవాన్లు మరణించిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. -
మావోల ఘాతుకం.. 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
-
సోమశిల ఘటనకు 24ఏళ్లు..
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి రాష్ట్రంలోనే పెనుసంచలనం సృష్టించిన సోమశిల మందుపాతర దాడి ఘటనకు నేటితో 24ఏళ్లు పూర్తవుతున్నాయి. అప్పట్లో నల్లమల పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలో 14 నవంబర్ 1993న మావోయిస్టులు (అప్పటి పీపుల్స్‌వార్) కొల్లాపూర్ మండలం సోమశిలలో ఓ అతిథి గృహానికి నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఓ ప్రైవేట్ బస్సులో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశీనాయుడుతో పాటు ఎస్సైలు శివప్రసాద్, టి.కిషోర్, ఏఆర్ హెచ్‌సీ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు వై.వీ.ఎన్ ప్రసాద్, జయరాములు, షేక్ హైదర్, ఎస్.సుభాన్, జోహెబ్ ఎక్బాల్ సోమశిలకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్న క్రమంలో కొల్లాపూర్–సోమశిల మధ్య ఘాట్ రోడ్డులో బస్సును పేల్చారు. ఈ ఘటనలో కొందరు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు కాళ్లు తెగిపోయి తీవ్రంగా గాయపడినప్పటికీ ఎస్పీ పరదేశీనాయుడు, ఇతర సిబ్బంది విరోచితంగా కాల్పులు జరిపి మావోయిస్టులను ఎదుర్కొన్నారు. దీంతో బస్సులో భారీ స్థాయిలో పోలీసు శాఖకు సంబంధించిన ఆయుధాలను వారికి చిక్కకుండా కాపాడారు. అయితే, ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత ఎస్పీ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆయనతో పాటు 9మంది వీరమరణం పొందారు. అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి మృతి చెందడం అదే తొలిసారి. నేడు వర్ధంతి సభ మావోయిస్టుల కాల్పులలో వీరమరణం పొంది న పరదేశినాయుడు వర్ధంతిని మంగళవారం నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ బి.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు పట్టణంలోని వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశినాయుడు విగ్రహం వద్ద సాయుధ బలగాలు నివాళులర్పించే కార్యక్ర మం ఉంటుందని పేర్కొన్నారు. -
సీఆర్పీఎఫ్కు ఎట్టకేలకు అధిపతి దొరికారు!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీఆర్పీఎఫ్కు అధిపతిని నియమించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ రాయ్ భట్నాగర్ను కేంద్ర హోంశాఖ బుధవారం నియమించింది. రాయ్ 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. రెండురోజుల కిందట సుక్మాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కేంద్రం తీరును కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై విమర్శించారు. సీఆర్పీఎఫ్కు ఇప్పటివరకు పూర్తికాలం అధిపతిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఆర్పీఎఫ్ గత డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ కేంద్ర హోం శాఖ నిన్నటివరకు నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. సుక్మా దాడి నేపథ్యంలో సీఆర్పీఎఫ్కు వెంటనే అధిపతిని నియమించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండో-టిబేటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి 1983 బ్యాచ్‌కు చెందిన ఆర్కే ప్రచండ నియమితులయ్యారు. -
నిర్లక్ష్యమే జవాన్ల ప్రాణాలను తీసింది
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించడానికి విధుల నిర్వహణలో జవాన్లు నిర్లక్ష్యం వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది. ఆ రోజున రోడ్డు నిర్మాణ పనులకు రక్షణగా ఉన్న బృందంలోని 36 మంది జవాన్లలో ఇద్దరు, ముగ్గురు మినహా అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, అదే అదనుగా భావించిన మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీఆర్పీఎఫ్లోని 76వ బెటాలియన్‌కు చెందిన 99 మంది జవాన్లు మూడు బృందాలుగా విడిపోయి రోడ్డు నిర్మాణ పనులకు కాపలా కాస్తున్నారు. ఒక్కో బందంలో 30 నుంచి 36 మంది జవాన్లు ఉన్నారు. ఒక్కో బృందంలోని సభ్యులు భోజన విరామానికి వెళ్లాలంటే అతి తక్కువ సంఖ్యలో వెళ్లాలి. దాన్నే ఆపరేషన్ అప్రమత్తత అంటారు. అలా అప్రమత్తంగా వ్యవహరించక పోవడం వల్ల అనసరంగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2010లో పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించడానికి కారణం కూడా ఆపరేషన్ నిబంధనలను పాటించక పోవడమే కారణం. ఆ రోజున తెల్లవారు జామున మావోయిస్టులు దాడి జరిపినప్పుడు ఎక్కువ మంది జవాన్లు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకే అలసి పోయిన జవాన్ల బృందం కలసికట్టుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మావోయిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది జవాన్లు మరణించారు. ముగ్గురు, నలుగురు చొప్పున బృందాలుగా విడిపోయి వెళ్లాల్సిన జవాన్లు అలా చేయకుండా ఒకే గుంపుగా వెళ్లడం ఒక పొరపాటైతే వెళ్లిన దారినే వెనక్కి రావడం రెండో పొరపాటు. గుణపాఠం నేర్చుకోలేదు ఈ రెండు సంఘటనల నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే ఈ రోజున కూడా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడి జరిపిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీనియర్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. తాము కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు జరిపామని గాయాలతో బయటపడిన జవాన్లు చెప్పిన మాటలను వారి సీనియర్ అధికారులే నమ్మడం లేదు. 12 ఏకే–47 రైఫిళ్లు, 31 ఇన్సాస్ రైఫిళ్లు, 3000 బుల్లెట్లను సంఘటన స్థలం నుంచి మావోయిస్టులు ఎత్తుకెళ్లారంటే ఎదురు కాల్పులు జరిగి ఉండే అవకాశం లేదు. సీఆర్పీఎఫ్కు అధిపతి లేరు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. -
ఇంకెన్నాళ్లీ రక్తచరిత్ర ?
-
ఛత్తీస్‌గఢ్‌లో మృతి చెండిన జవాన్లకు నివాళులు
-
ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
చింతూరు (పశ్చిమ గోదావరి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో మావోయిస్టులు దండకారణ్యంలోని సుక్మా, కాంకేర్ జిల్లాల్లో మూడుచోట్ల జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు చనిపోయారు. సుక్మా జిల్లా కిష్టారం వద్ద జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు, కుంట సమీపంలో జరిపిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా తాజాగా శనివారం కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్-122వ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పఖంజూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఛోటేబేటియా అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బేచా గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులతో జవాన్లకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్ తరలిస్తుండగా విజయ్‌కుమార్, రాకేష్ అనే జవాన్లు మృతి చెందారు. రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో జవాను చనిపోయాడు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బిజాపూర్ జిల్లాలో శనివారం ఓ యాత్రికుల బస్సును దహనం చేసిన మావోయిస్టులు సుక్మా జిల్లా భెర్జీ వద్ద ఓ ఆటోను కూడా తగులబెట్టారు. -
జార్ఖండ్‌లో మావోల దాడిలో ఏడుగురు మృతి!
-
జార్ఖండ్‌లో మావోల దాడిలో ఏడుగురు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్ రాంచి: జార్ఖండ్‌లో బుధవారం మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యూస్ చానల్స్ ద్వారా తెలుస్తోంది. అయితే, పీటీఐ వార్తాసంస్థ మాత్రం ఇద్దరు పోలీసులు చనిపోగా, ఏడుగురు గాయపడినట్లు పేర్కొంది. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు టాటా 407 వాహనంలో పాలము జిల్లాలోని కాలాఫరి వైపు వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గత రెండు రోజులుగా పాలము జిల్లాలోని పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం కూడా కాల్పులు భారీగా ఎదురుకాల్పులు జరగడంతో అక్కడికి తరలివెళ్తున్న పోలీసులపై మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. మరో ఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ముగ్గురు 2013లో బస్తర్‌లో కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీపై దాడి చేసినవారిలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. నాటి దాడిలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ సహా 31 మంది కాంగ్రెస్ నేతలు చనిపోయారు. -
ఒడిశాలో మావోల పంజా
-
జవాన్ల కుటుంబాలకు రూ. 38 లక్షల పరిహారం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 38 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. క్షతగాత్రులకు రూ. 65 వేల వంతున ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మావోయిస్టులు దొంగదెబ్బ తీస్తున్నారని, వాస్తవ యుద్ధంలోకి వస్తే అప్పుడు అసలు విషయం తేలిపోతుందని హోం మంత్రి అన్నారు. సుక్మా జిల్లాలోని దట్టమైన చింతగుహ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో 14 మంది మరణించి, మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
మే 7 సీమాంధ్ర ఎన్నికలు పై ఉన్నతాధికారుల దృష్టి
-
మావోయిస్టుల దాడి.. 12 మంది జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు రెచ్చిపోవడంతో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల సామగ్రితో తిరిగి వస్తున్న సిబ్బంది మీద మావోయిస్టులు దాడులు చేశారు. బీజాపూర్ జిల్లా కుంతల్నార్ సమీపంలో ఎన్నికల సామగ్రితో వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దీనికి 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షణగా వస్తుండగా.. వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన జవాన్లతో పాటు పోలింగ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. జగదల్పూర్ జిల్లా జి.రామ్‌ఘాట్ వద్ద మరో సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందునుంచే హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని, 108 వాహనంలో పోలింగు సామగ్రిని తరలించారు. అయినా కూడా దాని గురించి పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ వాహనాన్ని కూడా మందుపాతరతో పేల్చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బీజాపూర్, జగదల్పూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. దీంతో పోలీసులు పలు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఈ దారుణం తప్పలేదు. అబూజ్మడ్ కేంద్రంగా జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న మావోయిస్టులు.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో దాదాపు 600 గ్రామాల్లో నాయకులు కనీసం ప్రచారం కూడా చేయలేకపోయారు. -
ఛత్తీస్‌గడ్‌లో చెలరేగిన మావోయిస్టులు
-
పోలీసుల బస్సుపై మావోయిస్టుల కాల్పులు
గడ్చిరోలి, న్యూస్‌లైన్: గడ్చిరోలి జిల్లాలో ఎన్నికల బందోబస్తు నిర్వహించి తిరిగివె ళ్తున్న పోలీసుల బస్సుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో అవాక్కయిన పోలీసులు కూడా నిలదొక్కుకుని ఎదురుకాల్పులు జరిపారు. అయితే సంఘటనలో ఒక పోలీసు అధికారి మరణించగా మరో అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు అహేరి తాలూకాలోని ఆషా గ్రామం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికలను అడ్డుకుంటామని మావోయిస్టులు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు జిల్లాలోని తమ పట్టున్న ప్రాంతాల్లో కరపత్రాలను పంచడంతోపాటు అనేక ప్రాంతాల్లో బోర్డులను కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీస్ యం త్రాంగం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. అయితే జిల్లాలో తమ పట్టును నిరూపించుకునేందుకు గురువారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను అపహరిం చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. బేస్ క్యాంప్‌పై కాల్పులు జరిపారు. అయితే పెద్ద మొత్తం లో ఉన్న పోలీసుల బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో పారిపోయారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించి సామగ్రి సహా పోలీసులు, సిబ్బంది బస్సులో వెళ్తుండగా ఊహిం చని విధంగా మావోయిస్టులు మరోసారి పథకం ప్రకారం నలుమూలల నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో దట్టమైన పొదలను ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. గంటసేపు రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, ఈ కాల్పు ల్లో గిరిధర్ ఆత్రమ్ అనే పోలీసు మరణిం చగా రమేష్, సందీప్ కొడపే, మురళి వెలదే, ఆమర్దీప్ బురసే, ప్రకాస్ చికారామ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని హెలికాప్టర్ సహా యంతో నాగపూర్‌కు తరలించారు. ఈ ఘటన అనంతరం అక్కడికి అదనపు బలగాలు చేరుకుని ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. -
ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
దాడి చేసిన నక్సల్స్‌ను వేటాడతామన్న హోం మంత్రి ఛత్తీస్‌గఢ్‌లో షిండే పర్యటన.. నక్సల్స్ దాడి మృతులకు నివాళులు ఎన్ఐఏతో దర్యాప్తు జరిపిస్తాం చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు సహా 16 మందిని బలితీసుకున్న నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శపథం చేశారు. మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. షిండే, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, గవర్నర్ శేఖర్దత్లు.. నక్సల్స్ దాడిలో మృతిచెందిన 15 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలకు జగ్దల్పూర్లో నివాళులర్పించారు. దర్బాఘాట్కు వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జగ్దల్పూర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఘటన పూర్వాపరాలపై చర్చించారు. సీఎం, గవర్నర్, ఇతర సీనియర్ అధికారులతో షిండే సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, భద్రతా దళాలు మోహరించటం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతుండటం వల్ల ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నారని తమకు నివేదికలు అందాయని చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో ఈ దాడికి తెగబడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు... ‘‘మేం తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం ఎలా తీర్చుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘గతంలో చేసినట్లుగానే కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి.. ఈ దాడిలో ప్రమేయం ఉన్న మావోయిస్టులను వేటాడతాయి. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు’’ అని షిండే బదులిచ్చారు. గత ఏడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల తరహాలోనే.. రాష్ట్రం లో లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని.. తగినన్ని భద్రతా దళాలను అందిస్తామని చెప్పారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి... నక్సల్స్ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తుందని షిండే తెలిపారు. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘ఇలాంటి ఘటన ఇది రెండోది. దీనిపై ఇప్పటికే చర్చించాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు బలగాలు చేయాల్సిన పని చేస్తాయని మాకు విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు. పౌరుడి ప్రాణం తీసిన హెడ్ ఫోన్! ఇదిలావుంటే.. మంగళవారం మావోయిస్టుల దాడిలో భద్రతా సిబ్బందితో పాటు చనిపోయిన పౌరుడు విక్రమ్నిషాద్.. తన చెవులకు హెడ్ ఫోన్ పెట్టుకుని మొబైల్ ఫోన్ నుంచి పాటలు వింటూ బైక్‌పై వచ్చి ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెప్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్ ఉండటం వల్ల అతడు కాల్పుల శబ్దం వినలేదని, సమీపంలోని వారు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. దాడిలో పాల్గొన్న నక్సలైట్ల ఆచూకీ కోసం కూంబింగ్ ఆపేషన్ మొదలుపెట్టినట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. దాడి నేపధ్యంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ విభాగం 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. 9వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్స్ హింస వల్ల గత రెండు దశాబ్దాల్లో 12,183 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో 9,471 మంది పౌరులు కాగా.. 2,712 మంది భద్రతా సిబ్బంది. ఛత్తీస్‌గఢ్ సంతలో నక్సల్స్ కాల్పులు చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో గ్రామీణుల వేషధారణలో వచ్చిన నక్సల్స్ పేట్రేగిపోయా రు. జనసమ్మర్ధంగా ఉండే వారాంతపు సంతలోకి బుధవారం ప్రవేశించిన మావోయిస్టులు అన్నదమ్ములైన వ్యా పారులు రూపేంద్ర కాశ్యప్, కేదార్నాథ్ కాశ్యప్లపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. రూపేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా కేదార్ పరిస్థితి విషమంగా ఉంది. -
ఒడిశాలోఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
కొరాపుట్/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఒడిశాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్ జిల్లాలో ఉన్న ముంగుడవలస అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన మల్లా సంజీవ్ అలియాస్ యాదన్న, మరొకరిని ఖమ్మం జిల్లాకు చెందిన ఎపె స్వామి అలియాస్ నరేందర్‌గా గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై మావోలు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగిందని వివరించారు. ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలోనే వీరు తూర్పు విశాఖ నుంచి ఇక్కడకు చేరుకున్నారని, వీరిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. క్రియాశీల పదవుల్లో కొనసాగిన సంజీవ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మల్లా సంజీవ్(38)ది అనంతపురం జిల్లా, కంబదూరు మండలం గూళ్యం గ్రామం. కళ్యాణదుర్గంలో టెన్త్ చదివిన ఆయన చిన్న వయసులోనే నక్సల్బరి ఉద్యమాలకు ఆకర్షితుడై 1999లో మావోయిస్టు పార్టీలో చేరి కీలక పదవుల్లో కొనసాగాడు. రామగిరి మండలంలోని పలు ప్రాం తా ల్లో దాడులు, పేరూరు ఎక్స్ఛేంజ్ కార్యాలయం పేల్చివేత, పరిటాల రవీంద్ర సన్నిహితుడు చమన్‌పై దాడి, కరువు దాడుల ఘటనల్లో సంజీవ్‌పై కేసులున్నాయి. దీంతో పోలీసు నిఘా పెరగడంతో కర్ణాటకకు తరిలిపోయాడు. అక్కడా పోలీసుల నిఘా పటిష్టం కావడంతో మల్కన్‌గిరి దళంలోకి చేరి ఆర్గనైజర్, కమాండర్ పదవుల్లో కొనసాగాడు. మల్కన్‌గిరి దళం నుంచి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ) దళంలోకి అడుగిడిన ఆయన దళంలోని ఓ సభ్యురాలిని వివాహమాడాడు. -
మావోయిస్టుల మెరుపు దాడి
-
సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోల మెరుపుదాడి
ఖమ్మం : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లా తమెళ్వాడలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు బుధవారం మెరుపు దాడి చేశారు. మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు మావోయిస్టుల దాడిని భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. కాగా ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడిత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఊపిరి పీల్చుకున్న భద్రతా దళాలపై మావోలు దాడికి పాల్పడుతున్నారు. సుక్మా జిల్లాలో ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు పేల్చి మందుపాతరలో ఇద్దరు జవాన్లు, ఓ వాహన డ్రైవర్ మృతి చెందారు. -
బీహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. జాముయ్ జిల్లాలోని పరాశి గ్రామంలో సమీపంలో ఎస్టీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపన కాల్పుల్లో ఓ జవాను మరణించాడని ఆ జిల్లా ఎస్పీ జితేంద్ర రాణా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని పరాశి గ్రామంలోని పీడబ్ల్యూడీ శాఖకు చెందిన భవనాన్ని సాయుధలైన మావోయిస్టులు పేల్చివేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ జవాన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు ఉపక్రమించారని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే మరణించిన, గాయపడని జవాన్లు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని ఆయన తెలిపారు. అయితే పరాశి పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను జవాన్లు తీవ్రతరం చేశారు.