రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 12 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే, దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment