ఫైల్ ఫోటో
చత్తీస్‌గడ్: మావోయిస్టుల దాడిలో ఒక వీడియో జర్నలిస్టు దుర్మరణం పాలయ్యారు. దంతేవాడ జిల్లాలో మంగళవారం జరిగిన నక్సల్స్‌దాడిలో ప్రభుత్వరంగ మీడియాసంస్థ దూరదర్శన్‌కు చెందిన కెమెరామ్యాన్ దుర్మరణం చెందారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన దూరదర్శన్ బృందం, పోలీసులపై దంతెవాడలోని అరన్పూర్ అడవుల సమీపంలో ఈదాడి జరిగింది.
ఈ ఘటనపై నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందర్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. చనిపోయిన మీడియా పర్సన్‌ను దూరదర్శన్ వీడియో జర్నలిస్టు అచ్యుతానందన్ సాహుగా గుర్తించామన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్రు పోలీసులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించామని డీఐజీ మీడియాకు వెల్లడించారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగిందని తెలిపారు.
Dantewada Naxal attack: Two security personnel who were injured brought to hospital. Two security personnel and a DD cameraman lost their lives in the attack. #Chhattisgarh pic.twitter.com/ZiqbwiNbNs
— ANI (@ANI) October 30, 2018
Comments
Please login to add a commentAdd a comment