పోలీసుల బస్సుపై మావోయిస్టుల కాల్పులు | Commando killed, 5 injured in Maoist attack in Gadchiroli | Sakshi
Sakshi News home page

పోలీసుల బస్సుపై మావోయిస్టుల కాల్పులు

Published Fri, Apr 11 2014 10:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Commando killed, 5 injured in Maoist attack in Gadchiroli

గడ్చిరోలి, న్యూస్‌లైన్: గడ్చిరోలి జిల్లాలో ఎన్నికల బందోబస్తు నిర్వహించి తిరిగివె ళ్తున్న పోలీసుల బస్సుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో అవాక్కయిన పోలీసులు కూడా నిలదొక్కుకుని ఎదురుకాల్పులు జరిపారు. అయితే సంఘటనలో ఒక పోలీసు అధికారి మరణించగా మరో అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు అహేరి తాలూకాలోని ఆషా గ్రామం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికలను అడ్డుకుంటామని మావోయిస్టులు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు వారు జిల్లాలోని తమ పట్టున్న ప్రాంతాల్లో కరపత్రాలను పంచడంతోపాటు అనేక ప్రాంతాల్లో బోర్డులను కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీస్ యం త్రాంగం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. అయితే జిల్లాలో తమ పట్టును నిరూపించుకునేందుకు గురువారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను అపహరిం చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. బేస్ క్యాంప్‌పై కాల్పులు జరిపారు. అయితే పెద్ద మొత్తం లో ఉన్న పోలీసుల బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో పారిపోయారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించి సామగ్రి సహా పోలీసులు, సిబ్బంది బస్సులో వెళ్తుండగా ఊహిం చని విధంగా మావోయిస్టులు మరోసారి పథకం ప్రకారం నలుమూలల నుంచి కాల్పులు జరిపారు.

 ఈ ఘటనలో పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో దట్టమైన పొదలను ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. గంటసేపు రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, ఈ కాల్పు ల్లో గిరిధర్ ఆత్రమ్ అనే పోలీసు మరణిం చగా రమేష్, సందీప్ కొడపే, మురళి వెలదే, ఆమర్‌దీప్ బురసే, ప్రకాస్ చికారామ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని హెలికాప్టర్ సహా యంతో నాగపూర్‌కు తరలించారు. ఈ ఘటన అనంతరం అక్కడికి అదనపు బలగాలు చేరుకుని ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement