ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 38 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. క్షతగాత్రులకు రూ. 65 వేల వంతున ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మావోయిస్టులు దొంగదెబ్బ తీస్తున్నారని, వాస్తవ యుద్ధంలోకి వస్తే అప్పుడు అసలు విషయం తేలిపోతుందని హోం మంత్రి అన్నారు.
సుక్మా జిల్లాలోని దట్టమైన చింతగుహ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో 14 మంది మరణించి, మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే.