
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లో సుమారు 11 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. మంగళవారం మావోయిస్ట్‌ల ఏరివేతే లక్ష్యంతో 1400 మంది భద్రతా బలగాలు జాయింట్ కూంబింగ్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే సమయంలో మావోయిస్ట్‌లు తారసపడ్డారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్ట్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పల్లో 11 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ ఐజి సుందర్ రాజ్ మావోయిస్ట్‌ల మృతి, కూంబింగ్‌ను ధృవీకరించారు.