బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు | Special Task Force (STF) jawan killed in Maoist attack | Sakshi
Sakshi News home page

బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Published Fri, Sep 20 2013 11:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

Special Task Force (STF) jawan killed in Maoist attack

బీహార్‌ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. జాముయ్‌ జిల్లాలోని పరాశి గ్రామంలో సమీపంలో ఎస్టీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపన కాల్పుల్లో ఓ జవాను మరణించాడని ఆ జిల్లా ఎస్పీ జితేంద్ర రాణా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.

 

ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని పరాశి గ్రామంలోని పీడబ్ల్యూడీ శాఖకు చెందిన భవనాన్ని సాయుధలైన మావోయిస్టులు పేల్చివేశారు. ఆ  ఘటనపై సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ జవాన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు ఉపక్రమించారని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే మరణించిన, గాయపడని జవాన్లు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని ఆయన తెలిపారు. అయితే పరాశి పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ను జవాన్లు తీవ్రతరం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement