
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. నారాయణపూర్ జిల్లా కాదేనార్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్ కోసం బయలు దేరిన ఐటీబీసీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై అతి దగ్గర నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐటీబీసీ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గుర్ముఖ్ సింగ్ అమరులయ్యారు. మృతి చెందిన జవాన్ల నుండి ఏకే 47 ఆయుధం, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీలను నక్సల్స్ దోచుకుని పోయారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందరరాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
చదవండి: Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment