ITBP personnel
-
ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్ర భద్రత కోసం వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందితో కూడిన బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. పహాల్గాం వద్ద బస్సు నదీలోయలో పడిపోయింది బస్సు. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కూడిన బస్సు చందన్వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్లాన్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు. ఆ సమయంలో బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు జమ్ము పోలీసులు సైతం ఉన్నారు. గాయపడిన సిబ్బందని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu — ANI (@ANI) August 16, 2022 -
‘హర్ ఘర్ తిరంగ’పై జవాన్ల సందేశం..12వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరీ..
లద్దాఖ్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో.. లద్దాఖ్‌లోని లేహ్‌లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘భారత్ మాతాకి జై. లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది ఐటీబీపీ. भारत माता की जय ! ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7 — ITBP (@ITBP_official) July 27, 2022 భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్‌లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈడీ పోలీస్ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు -
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల మెరుపుదాడి.. ఇద్దరు జవాన్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. నారాయణపూర్ జిల్లా కాదేనార్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్ కోసం బయలు దేరిన ఐటీబీసీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై అతి దగ్గర నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐటీబీసీ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్ముఖ్ సింగ్ అమరులయ్యారు. మృతి చెందిన జవాన్ల నుండి ఏకే 47 ఆయుధం, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీలను నక్సల్స్ దోచుకుని పోయారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందరరాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం -
18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
-
గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు యోగా ఆవశ్యకతను చాటే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఇక మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు యోగాసానాలు సాధన చేస్తూ.. దాని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీబీపీ అధికారి ఒకరు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాన్ని ప్రదర్శించారు. గడ్డకట్టే చలిలో 18 వేల అడుగుల ఎత్తున సూర్యనమస్కారాలు చేశారు. అది కూడా కేవలం షార్ట్ మీదనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’’ అంటూ యోగా గొప్పతనాన్ని తెలిపారు. చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి! -
సైనికులకు చైనీస్‌లో శిక్షణ
సాక్షి,న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఇండో టిబెటన్ సరిహద్దు (ఐటీబీపీ) దళాలకు చైనా (మాండరిన్)భాషలో ప్రావీణ్యం కల్పించాలని భారత సైన్యం యోచిస్తోంది. బోర్డర్లో మరో 50 ఐటీబీపీ పోస్టులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో దళాలకు అత్యాధునిక సాధనాసంపత్తిని సమకూర్చనుంది. నిత్యం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సేవలందిస్తున్న సైనికులు ఆ వాతావరణాన్ని తట్టుకునేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దళాల సామర్థ్యం పెంపుకు, వారి సౌకర్యాల కోసం ప్రభుత్వం దృష్టిసారిస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఐటీబీపీ అధికారులు, జవాన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో 25 బోర్డర్ రహదారులు నిర్మిస్తామని, 9000 అడుగుల ఎత్తులో పనిచేసే సైనికులకు తేలికపాటి శీతల దుస్తులు అందచేస్తామని చెప్పారు. ఇండో చైనా బోర్డర్లో 3488 కిమీ ఎత్తులో సేవలందించే సైనికులకు స్నో స్కూటర్లను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.బోర్డర్ పోస్ట్‌ల్లో అత్యంత ఎత్తులో పనిచేసే పోస్ట్‌లకు హెలికాఫ్టర్లను అద్దెకు సమకూర్చాలనే ప్రతిపాదనను హోంమంత్రిత్వ శాఖ ఆమోదించిందని చెప్పారు. -
భారత్ ఎంబసీపై దాడిని ఖండించిన మోడీ
న్యూఢీల్లీ : అఫ్ఘానిస్థాన్లోని భారత దౌత్య కార్యాలయంపై దాడిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ఆప్ఘన్లోని రాయబారితో చర్చించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మోడీ తెలిపారు. కాగా హెరాత్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడిన నలుగురు దుండగులు భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. దాడి ఘటనను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం ఉదయం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది. దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఆఫ్ఘాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి
-
ఆఫ్ఘాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి
ఆఫ్ఘానిస్థాన్ హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది. దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.