jawan killed
-
గర్భిణీ భార్యను చూసేందుకు సెలవు పెట్టి వచ్చిన జవాన్.. నక్సల్స్ చేతిలో..
రాయ్‌పూర్: గర్భిణీ భార్యను చూసేందుకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ జవాన్ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. జవాన్ మృతితో అతని భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ జవాన్ వయసు 29 ఏళ్లు. గర్భిణీ భార్యను చూసేందుకు వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వచ్చాడు. షాపింగ్ చేసేందుకు శనివారం సాయంత్రం గ్రామంలోని మార్కెట్‌కు వెళ్లిన అతడిపై ఇద్దరు మావోయిస్టులు దాడి చేశారు. అతి దగ్గరకు వెళ్లి తుపాకీతో తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. జవాన్ సోదరుడితో పాటు గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సాధారణంగా మవోయిస్టులు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంత అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ లేదా ఇతర సెక్యూరిటీ సంస్థలకు చెందిన జవాన్లపై మాత్రం తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్మీ జవాన్‌ను ఇలా హత్య చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ అనుకునే ఇతడిపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో గత వారంలోనే ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు.. -
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి
జమ్మూ/శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. ఆదివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి దిగాయి. దాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని, ఇద్దరు సూసైడ్ బాంబర్లను హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పటేల్ నేలకొరిగారు. 9 మందికి గాయాలయ్యాయి. సంజ్వాన్ సమీపంలోని చద్దా ఆర్మీ బేస్ వద్ద ఎన్‌కౌంటర్‌కు దారితీసిన క్రమాన్ని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు గురువారం ఆర్ఎస్ పురా సెక్టార్లో సరిహద్దులు దాటారు. శుక్రవారం ఉదయం 4.25 గంటలప్పుడు ఆర్మీ బేస్ వద్దకు చేరుకున్నారు. జవాన్లు వారిని గమనించి అప్రమత్తమయ్యారు. అదే సమయంలో తర్వాతి షిఫ్టు కోసం 15 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. గ్రెనేడ్లు ప్రయోగిస్తూ దగ్గర్లోని జనావాసాల్లోకి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి కాల్పులకు దిగడంతో జవాన్లు అందులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 5 గంటలపాటు సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు బాంబర్లు హతమయ్యారు. సకాలంలో స్పందించడంతో... ఉగ్రవాదులు భారీగా పేలుడు పదార్థాలున్న జాకెట్‌ను ధరించారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారి వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. భారీగా నష్టం కలిగించి, ప్రధాని పర్యటనకు అవాంతరం కలిగించేందుకు జైషే కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు. సంఘటన ప్రాంతంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంఛర్, శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇదే ఆర్మీ క్యాంప్‌పై 2018లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. బారామూల్లాలో మరో ఉగ్రవాది హతం బారాముల్లా జిల్లాలో మాల్వాలో గురువారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో నాలుగో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు కారకుడైన లష్కరే టాప్ కమాండర్ యూసుఫ్ కట్రూతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు గురువారం హతమైన విషయం తెలిసిందే. మోదీ పర్యటనకు భారీ భద్రత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న కశ్మీర్‌లోని సాంబ జిల్లా పాలి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబ, పరిసరాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పాల్గొనే సభా ప్రాంతానికి చేరుకునే మార్గాల్లో చెక్పాయింట్లు పెట్టారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను నెలకొల్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల మెరుపుదాడి.. ఇద్దరు జవాన్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. నారాయణపూర్ జిల్లా కాదేనార్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్ కోసం బయలు దేరిన ఐటీబీసీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై అతి దగ్గర నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐటీబీసీ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్ముఖ్ సింగ్ అమరులయ్యారు. మృతి చెందిన జవాన్ల నుండి ఏకే 47 ఆయుధం, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీలను నక్సల్స్ దోచుకుని పోయారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందరరాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం -
తుపాకీతో భార్యను ఏడుసార్లు కాల్చి.. ఆపై
పట్నా : ఒక జవాన్ తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్‌లోని సీతామర్హి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న చంద్రభూషణ్ మొదట తన భార్య మధును తుపాకీతో ఏడు సార్లు కాల్చి ఆపై తానూ షూట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. వీరి వివాహం జరిగి ఆరు నెలలు కావొస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కలంతరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే వీరి కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఆఫీసర్ సహా ముగ్గురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిని బదామీబాగ్లోని 92 కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణరేఖ(ఎల్వోసీ) వెంట భారత పోస్టులు లక్ష్యంగా బుల్లెట్లు, మోర్టార్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన యశ్ పాల్(24) వీరమరణం చెందారు. యశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని ఉధమ్‌పూర్ జిల్లా మంతాలయ్ గ్రామమని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాక్ రేంజర్లు భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంబించారనీ, రాత్రివరకూ అవి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ పాక్ 110 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకల చెరలో బందీగా ఒకరిని సైనికులు రక్షించారు. బందిపొరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా స్థానికుల సాయంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఓ బందీని రక్షించగలిగాయి. -
సరిహద్దులో మాటువేసి మట్టుబెట్టారు
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ)వెంట పాక్ స్నైపర్ (దొంగచాటు) జరిపిన కాల్పుల్లో ఒక జవాను నేలకొరగగా పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. సుందర్బనీ సెక్టార్లో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో పాక్ స్నైపర్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడిని సాంబా జిల్లా మావా–రాజ్‌పురా ప్రాంతానికి చెందిన వరుణ్ కట్టల్(21)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాక్ బలగాలు పాల్పడిన ఈ చర్యకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయన్నారు. కాగా, ఎల్వోసీ వెంట పాక్ ఈనెల 9వ తేదీన జరిపిన స్నైపర్ కాల్పుల్లో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు పుల్వామా జిల్లా టిక్కెన్ ప్రాంతాన్ని శనివారం ఉదయం దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పుల్వామా జిల్లాకు చెందిన, హిజ్బుల్ ముజాహిదీన్ తరఫున పనిచేస్తున్న లియాఖత్ మునీర్ వనీ, వాజిద్ ఉల్ ఇస్లాం చనిపోయారు. -
మావోల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
గిద్దలూరు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా ముర్దొండ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరిలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరానికి చెందిన చట్టి ప్రవీణ్‌కుమార్ (24) ఉన్నారు. సేకరించిన సమాచారం ప్రకారం ప్రవీణ్ కుమార్ సహచర సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి వారి క్యాంపునకు సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. అందులో గౌతవరానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో పాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన గల్లిపల్లి శ్రీను మృతిచెందారు. ప్రవీణ్‌కుమార్ వినాయకచవితి పండుగ కోసం సెలవుపై స్వగ్రామం వచ్చి ఈనెల 15వ తేదీన తిరిగి విధులకు వెళ్లాడు. ఇంతలోనే కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, రంగలక్ష్మమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఉన్నతంగా చదివిం చుకోవాలన్న ఆశపడ్డామని... ఆర్థిక స్థోమత లేక సీఆర్పీఎఫ్ జవాన్‌గా పంపించామని.. చేతికి అందివచ్చిన కొడుకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌కు ఒక చెల్లెలు ఉంది. ప్రవీణ్ మరణ వార్తను సీఆర్పీఎఫ్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రవీణ్ మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు తెలిసింది. -
రాళ్ల దాడిలో జవాన్ మృతి
శ్రీనగర్: కశ్మీర్లో అల్లరి మూకలు విసిరిన రాళ్ల దాడిలో గాయపడిన ఓ జవాన్ శుక్రవారం చనిపోయాడు. మృతుడు సిపాయ్ రాజేంద్రసింగ్ క్విక్ రియాక్షన్ బృందంలో సభ్యుడని అధికారులు తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) కాన్వాయ్‌కు రక్షణగా వెళ్తున్న జవాన్లపై గురువారం అనంత్‌నాగ్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన రాజేంద్రసింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్రసింగ్ 2016లో సైన్యంలో చేరారు. -
ప్రధాని మోదీకి 72 గంటల డెడ్‌లైన్
శ్రీనగర్: ‘ప్రధాని నరేంద్ర మోదీకి నేను 72 గంటల టైమ్ ఇస్తున్నా. ఆలోగా నా కొడుకు మరణంపై భారత ప్రభుత్వం పగదీర్చుకోవాలి. లేదంటే మేమే ప్రతీకార చర్యకు దిగుతాం’... ఉగ్రవాదుల చేతిలో పైశాచికంగా హత్యగావించబడిన జవాన్ ఔరంగజేబ్ తండ్రి చెబుతున్న మాటలివి. ‘2003 నుంచి కశ్మీర్ పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితుల్లో మార్పులు వస్తాయని భావించా. కానీ, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. పైగా వేర్పాటువాదులు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు ఈ ప్రపంచాన్ని ఖూనీ చేస్తున్నారు. కశ్మీర్ గడ్డపై రక్తపాతానికి కారణం వాళ్లే. నేతలను, వేర్పాటువాదులను ఇక్కడి నుంచి తరిమేయాలి. రాజకీయాలను పక్కనపడేసి సైన్యం ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగాలి. అప్పుడే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కశ్మీర్లో శాంతి వర్థిల్లుతుంది. ప్రధాని మోదీ 72 గంటల్లో నా కొడుకు మరణానికి కారణమైన వాళ్లకి ధీటైన బదులిప్పించాలి. నా కొడుకును చంపిన వాళ్లను అదే రీతిలో సైన్యం కాల్చి చంపాలి. లేదంటే గ్రామస్తులతో కలిసి నేనే సరిహద్దుకు వెళ్తా’ అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. కాగా, ఔరంగజేబ్ తండ్రి ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఔరంగేజ్ మావయ్య, సోదరుల్లో ఒకరు కూడా సైన్యంలో పనిచేస్తున్న వాళ్లే. గతంలో ఆ కటుంబంలో ఒకరిని ఉగ్రవాదులు అపహరించి చంపారు కూడా. ఇప్పుడు ఔరంగజేబ్‌ను కూడా ఉగ్రమూకలు పొట్టనబెట్టుకున్నాయి. (చిధ్రమైన ఔరంగజేబ్) ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్ సోఫియాన్‌లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44వ దళంలో రైఫిల్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం ఉదయం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని ముసుగులు ధరించిన కొందరు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లారు. అది గమనించిన ఓ ఫార్మసిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరాఖకిరి శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో బుల్లెట్లతో ఛిద్రమైన ఔరంగజేబ్ మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా
-
పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జమ్మూ/సాక్షి, చెన్నై: భారత్‌తో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌కానిస్టేబుల్ ఎ.సురేశ్ చనిపోయారు. ఇంకా సరిహద్దులో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్, జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ఓ జవాను మృతి చెందారు. దక్షిణ కశ్మీర్... షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని జైపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న బలగాలపైకి తీవ్ర వాదులు తెగబడ్డారని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గోపాల్‌పురలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదులు గతంలో జరిగిన ఓ బ్యాంకు దోపిడీ ఘటనలో ప్రధాన నిందితులు. ఘటనాస్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
* చొరబాటు యత్నం భగ్నం * ఎన్కౌంటర్లో జవాను మృతి శ్రీనగర్: కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్ధార్ సెక్టార్లో గురువారం మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా సైనికులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మిలిటెంట్లు హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్ల అక్రమ చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. మంగళవారం కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్లో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా జవాన్లు భగ్నం చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్ హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. -
ఆర్మీ క్యాంపులో ఘర్షణ
♦ గుండెనొప్పితో జవాను మృతి.. కెప్టెన్‌పై సహచర జవాన్ల దాడి ♦ తిరుగుబాటు కాదన్న ఆర్మీ ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ క్యాంపులో ఆదివారం ఘర్షణ చెలరేగింది. సహచరుడు గుండెనొప్పితో మృతి చెందడంతో ఆగ్రహించిన కొందరు జవాన్లు.. కెప్టెన్‌పై దాడిచేశారని.. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆర్మీ తెలిపింది. ఈటానగర్‌కు దగ్గర్లోని క్యాంపులో రోజూలాగే రూట్ మార్చ్ మొదలైంది. ఓ జవాను తనకు ఛాతీలో నొప్పిగా ఉందని కెప్టెన్‌కు తెలిపారు. పరీక్షించిన యూనిట్ వైద్యాధికారి.. సదరు జవాను శిక్షణకు ఫిట్‌గా ఉన్నాడని చెప్పడంతో తప్పనిసరి స్థితుల్లో మార్చ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. మార్చ్ మొదలవగానే ఆ జవాన్ గుండెనొప్పితో కుప్పకూలటంతో వైద్యాధికారి.. ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురైదుగురు అక్కడే ఉన్న కెప్టెన్‌పై దాడిచేసి గాయపరిచారు. వెంటనే ఇతర జవాన్లు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయం బయటకు పొక్కటంతో.. సైన్యంలో తిరుగుబాటు మొదలైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆర్మీ ఉన్నతాధికారులు ఖండించారు. ఈ ఘటనలో విచారణకు ఆదేశించారు. -
ఎన్కౌంటర్లో జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటనలో ఓం వీర్ సింగ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారంతో భద్రతా దళాలు నిన్నటి నుంచి హంద్వారా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ప్రతిగా జవాన్లు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. -
ప్రెషర్ బాంబు పేలి జవాను మృతి
దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మారాయిగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మారాయిగూడెం నుంచి గొల్లపల్లి మధ్యలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులకు పహారా కోసం సీఆర్పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ సమయంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలడంతో సీఆర్పీఎఫ్ జవాను మడకం జోగా చనిపోగా, పొక్లెయినర్ డ్రైవర్ సంజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
మరోసారి దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు: జవాన్ మృతి
శ్రీనగర్: గడిచిన రెండు నెలలుగా తరచూ దాడులకు దిగుతున్న ఉగ్రవాద మూకలు మరోసారి పేట్రేగిపోయాయి. ఆదివారం ఉదయం కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలోని తంగ్ధర్ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రమూకల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు చెప్పారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనేఉన్నాయని పేర్కొన్నారు. -
ఉగ్రవాదుల దాడిలో సీఐఎస్ఎఫ్ జవాను మృతి
జమ్ము కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో సోమవారం జరిగిన గెరిల్లా దాడిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందిన ఓ జవాను మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్ నగరంలోని నాజ్ సినిమా థియేటర్ సమీపంలో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలపై వేర్పాటువాద గెరిల్లాలు సోమవారం ఉదయం కాల్పులు జరిపారు. గాయపడ్డ జవాన్లలో ఒకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో జవానుకు మాత్రం తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. కాల్పులు జరగడంతో దుకాణదారులు, పాదచారులు భయంతో పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు, పారా మిలటరీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు నాజ్ థియేటర్ సమీపంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. కాశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమాలు మొదలుకావడంతో 1990 నుంచే నాజ్ థియేటర్‌ను మూసేశారు.