రాళ్ల దాడిలో జవాన్‌ మృతి | Army jawan killed in stone pelting, 2 more soldiers dead in encounters | Sakshi
Sakshi News home page

రాళ్ల దాడిలో జవాన్‌ మృతి

Published Sat, Oct 27 2018 3:58 AM | Last Updated on Sat, Oct 27 2018 7:21 AM

Army jawan killed in stone pelting, 2 more soldiers dead in encounters - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో అల్లరి మూకలు విసిరిన రాళ్ల దాడిలో గాయపడిన ఓ జవాన్‌ శుక్రవారం చనిపోయాడు. మృతుడు సిపాయ్‌ రాజేంద్రసింగ్‌ క్విక్‌ రియాక్షన్‌ బృందంలో సభ్యుడని అధికారులు తెలిపారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌వో) కాన్వాయ్‌కు రక్షణగా వెళ్తున్న జవాన్లపై గురువారం అనంత్‌నాగ్‌ జిల్లాలో 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన రాజేంద్రసింగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్రసింగ్‌ 2016లో సైన్యంలో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement