Stones attack
-
ప్రయాగరాజ్ వెళ్తున్న ట్రైన్‌పై మధ్యప్రదేశ్‌లో రాళ్ల దాడి
-
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్లదాడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్ వేసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి. ర్యాలీగా వెళుతున్న సమయంలో ఇరు పార్టీలు ఎదురుపడగా.. కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు. -
టీడీపీ కార్యకర్తల అరాచకం
తాడేపల్లిరూరల్/తాడికొండ: వెంకటపాలెంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు అక్కచెల్లెమ్మలు నీరాజనం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు అరాచకం సృష్టించారు. కొంత మందికి మద్యం తాపించి, బస్సుపై రాళ్ల దాడి చేయించారు. ఈ దాడిలో బస్సు వెనుక అద్దాలు పగిలాయి. నులకపేట నుంచి బస్సులో తల్లితో పాటు వచ్చిన ఓ బాలుడి మెడకు తీవ్ర గాయమైంది. ఎర్రబాలెం ఇండస్ట్రియల్ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన వారు బైక్‌పై పారిపోతుండగా స్థానికులు అడ్డగించారు. బస్సులోని వారు దిగి ఎందుకు రాళ్లతో దాడి చేశారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ తిరగబడే ప్రయత్నం చేశారు. మంగళగిరి రూరల్ సిఐ నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని ప్రశ్నించారు. ‘మాది వెంకటపాలెం. మా పేర్లు బొల్లిబోయిన హరికృష్ణ, యల్లమల్ల సుబ్బారావు. బస్సు మమ్మల్ని ఢీకొట్టబోయింది. దీంతో మాకు కోపం వచ్చింది’ అని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా వారు అక్కడ నిద్రపోయారు. రైతుల ముసుగులో దాడి: సీఎం వైఎస్ జగన్ సభకు వెళ్లి పలువురు తిరిగి వస్తుండగా తుళ్లూరులోని అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా నల్ల బెలూన్లు, రిబ్బన్లతో దూసుకొచ్చి సీఎం డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో మేడికొండూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లాం చిన్న రాయప్ప ‘జై జగన్..’ అని నినదించడంతో అక్ష లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు, మహిళలు దాడి చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
కర్రలు, రాళ్లతో దాడులకు దిగిన టీడీపీ నేతలు
-
మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ
పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. ఈ మేరకు మహిళలను లాఠీలతో కొడతూ చెదరగొట్టారు. ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలపై మహిళలు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఈ నిరసనలు కారణంగా ఆ విగ్రహం ఉన్న స్థలంపై వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు. (చదవండి: అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!’ దళితుణ్ణి ఘోరంగా హింసించి చంపారు) -
టీడీపీ నేతల రాళ్ల దాడి
వినుకొండ (నూజెండ్ల): గ్రామ దేవత పోలేరమ్మకు పొంగళ్లు పెట్టుకుని ఇంటికి వస్తున్న వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడి కుటుంబం, బంధువులపై టీడీపీ నాయకులు రాళ్లదాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో గురువారం జరిగింది. బాధితులు, వినుకొండ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పూర్ణి శ్రీను కుటుంబ సభ్యులతోపాటు బంధువులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించేందకు మొక్కుబడి ప్రభను కట్టుకుని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. టీడీపీ నాయకులు బోడేపూడి గోవిందరాజులు, వాసు, సత్యం, కిషోర్, చంద్రబాబు, గాడిపర్తి రాంబాబు, మహేష్, వెంకటేశ్వర్లు, యండ్రపల్లి శ్రీను, కోండ్రు అశోక్, సతీష్, మరో 50 మందికిపైగా జనం వైఎస్సార్సీపీ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన పూర్ణి పెదనాసరయ్య, పాల ఆదిలక్ష్మి, వేల్పుల నాగమల్లేశ్వరి, పూర్ణి నాసరయ్య, బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వినుకొండ సి.ఐ. అశోక్‌కుమార్ సిబ్బందితో గ్రామలోకి వెళ్లి పరిస్థితులను అదుపు చేశారు. గాయపడినవారిని 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత
-
అగ్నిపథ్: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత..
సాక్షి, వరంగల్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. కాగా, వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్(BSNL) ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ విధ్వంసంపై ఇలా ప్లాన్! -
ఆర్టీసీ బస్సుపై దొంగల రాళ్లదాడి
నవీపేట/భైంసా(ముథోల్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) శివారులో ఆర్టీసీ బస్సుపై దుండగులు దాడికి యత్నించారు. హైదరాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న బస్సుపై శనివారం అర్ధరాత్రి దాటాక.. ప్రధాన రహదారిపైకి చేరిన దొంగలు రాళ్లతో దాడిచేసి, ఆపాలని చూశారు. అప్రమత్తమైన డ్రైవర్ బాబా బస్సు వేగాన్ని పెంచి దుండగుల నుంచి తప్పించారు. నవీపేట పోలీసులకు సమాచారమిచ్చారు. దుండగుల దాడిలో బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండగా.. ఒకరి కంటికి చిన్న గాయమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు భైంసా డిపో మేనేజర్ అమృత తెలిపారు. ఇది దారిదోపిడీ దొంగల పనేనని ఆమె చెప్పారు. అబ్బాపూర్(ఎం) శివారులో రెండు నెలల క్రితం కూడా భైంసా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుపై దుండగులు ఇలాగే రాళ్ల దాడిచేసి బస్సును ఆపేందుకు యత్నించారు. -
చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది?
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీల పరిశీలించగా, చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదు. గాయాలైన వ్యక్తుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు నిర్ధారణ అయ్యింది. చంద్రబాబు సభలో రాయి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి విదితమే. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు. చదవండి: ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో! నవరత్నాల క్యాలెండర్ విడుదల -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మేడిపల్లి చెరువు పూజలు చేసేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గ్రామ ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని కిషన్‌రెడ్డిని నిలువరించారు. దీంతో మేడిపల్లి చెరువు దగ్గర ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. . ఫార్మాతో భూములు కోల్పోతుంటే పరామర్శించకుండా.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఓ దశలో ఆయన వాహనాలపై రైతులు రాళ్లు, చెప్పులు విసిరారు. రైతుల విసిరిన రాళ్ల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫార్మసిటీ అక్రమ భూ సేకరణ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. ఫార్మా సిటీకి ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఆయనపైకి రైతులు దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసన తెలుపుతున్నమాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో సహా పలువురి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాచారంలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక మేడిపల్లి చెరువు సందర్శనకు ఎమ్మెల్యే రాకతో పోలీసులు కొంతమంది రైతులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. -
రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..
న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్ ఎలా ముందుకు సాగారంటే.... ఇండియన్ ఆర్మీ 16 బిహార్ బెటాలియన్‌కు సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్ బాబు, చైనా కమాండింగ్ ఆఫీసర్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్ స్వయంగా గల్వాన్ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్ సంతోష్ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి. చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు. -
రెచ్చిపోయిన సునీత సోదరుడు మురళి
-
రాళ్ల దాడిలో జవాన్ మృతి
శ్రీనగర్: కశ్మీర్లో అల్లరి మూకలు విసిరిన రాళ్ల దాడిలో గాయపడిన ఓ జవాన్ శుక్రవారం చనిపోయాడు. మృతుడు సిపాయ్ రాజేంద్రసింగ్ క్విక్ రియాక్షన్ బృందంలో సభ్యుడని అధికారులు తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) కాన్వాయ్‌కు రక్షణగా వెళ్తున్న జవాన్లపై గురువారం అనంత్‌నాగ్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన రాజేంద్రసింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్రసింగ్ 2016లో సైన్యంలో చేరారు. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బిహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి
పట్నా/బక్సార్: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బక్సార్ జిల్లా డుమ్రావ్ వైపు వెళ్తుండగా నందన్ గ్రామం దగ్గర్లో దళితవాడలో తాము పడుతున్న ఇబ్బందులను గమనించేందుకు రావాలని కేకలు వేస్తూ కొందరు సీఎం వాహన శ్రేణిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎంసహా ఎవరూ గాయపడలేదు. రాళ్లను ఎవరు, ఎందుకు విసిరారో తెలియాల్సి ఉంది. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ అధికార జేడీయూ.. ఆర్జేడీపై విమర్శలు చేసింది. -
సైన్యంపై కశ్మీరీల రాళ్లదాడి
తప్పించుకున్న ‘లష్కర్’ అగ్రనేతలు శ్రీనగర్: సైన్యం ఉగ్రమూకల్ని చుట్టుముట్టిన ప్పటికీ.. స్థానికులు భద్రతా బలగాలపై రాళ్లదాడి చేసి వారిని తప్పించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం రాత్రి ప్రారంభించిన తన ఆపరేషన్‌ను సైన్యం అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) కశ్మీర్ చీఫ్ అబూ దుజానాతో పాటు మరికొందరు అగ్రనేతలు హక్రిపొరా ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్ర మత్తమయ్యాయి. ఉగ్రస్థావరాన్ని ఆర్మీ చుట్టు ముట్టడంతో దుండగులు సైనికులపై కాల్పులు ప్రారంభించారు. ఉగ్రమూకల్ని సైన్యం ప్రతిఘ టిస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు.. జవాన్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సైన్యం దృష్టి మరలడంతో ఉగ్రవాదులు రాత్రిపూట అక్కడి నుంచి పరారయ్యారని ఉన్నతాధికారులు తెలి పారు. దీంతో తమపై రాళ్లు రువ్వే వారిని సైతం ఉగ్రవాదులుగా పరిగణిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. -
బంక్‌లో పెట్రోల్ పోయిస్తుండగా దాడి చేశారు!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం సాయంత్రం ఓ రియల్టర్‌పై దాడి జరిగింది. బీఎన్‌రెడ్డి నగర్ బంక్‌లో పెట్రోల్ పోయిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ శ్రీనివాసరెడ్డి, అతని డ్రైవర్ ఫిరోజ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ రోజు ఉదయమే తనకు ప్రాణహాని ఉందంటూ.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రియల్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల రాళ్లదాడి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అటవీ అధికారులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వెంటనే ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లదాడి చేశారు. వారినుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారైనట్టు సమాచారం. పరారైన కూలీల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
-
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. శ్రీవారి మెట్టు సమీపంలో ఎర్రగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహించగా.. ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలంలో 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
నాగార్జునకు గాయాలు...కారు ధ్వంసం
-
భక్తులకు చేదు అనుభవం
-
కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయం పై సమైక్యవాదుల దాడి