తప్పించుకున్న ‘లష్కర్’ అగ్రనేతలు
శ్రీనగర్: సైన్యం ఉగ్రమూకల్ని చుట్టుముట్టిన ప్పటికీ.. స్థానికులు భద్రతా బలగాలపై రాళ్లదాడి చేసి వారిని తప్పించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం రాత్రి ప్రారంభించిన తన ఆపరేషన్‌ను సైన్యం అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. లష్కర్ ఏ తోయిబా(ఎల్‌ఈటీ) కశ్మీర్ చీఫ్ అబూ దుజానాతో పాటు మరికొందరు అగ్రనేతలు హక్రిపొరా ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్ర మత్తమయ్యాయి.
ఉగ్రస్థావరాన్ని ఆర్మీ చుట్టు ముట్టడంతో దుండగులు సైనికులపై కాల్పులు ప్రారంభించారు. ఉగ్రమూకల్ని సైన్యం ప్రతిఘ టిస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు.. జవాన్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సైన్యం దృష్టి మరలడంతో ఉగ్రవాదులు రాత్రిపూట అక్కడి నుంచి పరారయ్యారని ఉన్నతాధికారులు తెలి పారు. దీంతో తమపై రాళ్లు రువ్వే వారిని సైతం ఉగ్రవాదులుగా పరిగణిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు.
సైన్యంపై కశ్మీరీల రాళ్లదాడి
Published Thu, May 25 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement
Advertisement