Kashmiri
-
కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. కశ్మీర్‌లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్‌లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా... అక్షరాల ఇది వాస్తవం. కుంకుమ పువ్వు సాగు చేయాలంటే కశ్మీర్‌కు వెళ్లాల్సినవసరం లేదు. పండించాలన్న ఆసక్తి ఉంటే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా ఇక్కడ సృష్టించి సాగు చేయవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు. అలా ఎవరూ ఊహించని కశ్మీరీ కుంకుమపువ్వు సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధి. కశ్మీర్ నుంచి విత్తనాలు తెచ్చి.. కుంకుమపువ్వు సాగు కోసం శ్రీనిధి కశ్మీర్‌కు వెళ్లి 300 కిలోల నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేశారు. అందులో 225 కిలోలను సాగుకు వినియోగించారు. ఏరోఫోనిక్ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను ఉంచి ఇంట్లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న కశ్మీర్ తరహా వాతావరణం కలిగిన గదిలో వాటిని ఉంచారు. 2022, ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన కుంకుమపువ్వు సాగు... నవంబర్ 20కి సరిగ్గా మూడు నెలలకు తుదిదశకు చేరుకుంది. 30,000 మొక్కల్లో దాదాపుగా 20,000 మొక్కలు అంటే ఏడు గ్రాములకు పైన ఉన్న విత్తనాలు మాత్రమే పువ్వు దశకు చేరుకున్నాయి. సాధారణంగా 150 పువ్వుల నుంచి ఒక గ్రాము కుంకుమపువ్వు దిగుబడి ఉంటుంది. మదనపల్లెలో శ్రీనిధి ప్రయోగాత్మకంగా చేసిన సాగులో కశ్మీర్లో సంప్రదాయక సాగు పద్ధతిలో వచ్చే దిగుబడితో సమానంగా తొలి ప్రయత్నంలోనే 200 గ్రాముల కల్తీలేని, నాణ్యమైన ఏ గ్రేడ్ కుంకుమపువ్వును పండించింది. పునరుత్పత్తి ప్రక్రియ నవంబర్ 20 తొలి పంట తుది దశకు చేరుకునే క్రమంలోనే మలి పంటకు సన్నాహాలను ప్రారంభించారు. కుంకుమపువ్వు తీసేసిన తర్వాత మొక్కలను అలాగే పునరుత్పత్తి ప్రక్రియకు వినియోగించి వాటి నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నారు. ఒక విత్తనం నుంచి 3–5 పిలకలు ఉత్పత్తి అయ్యాయి. ఈ సారి వర్టికల్ ఫాంలో ప్రత్యేకగదిలో సాయిల్ బెడ్స్(మురిగిన నల్లమట్టి, నున్నటి ఇసుక, కోకోపిట్, వర్మీకంపోస్టు, వరిపొట్టు) రూపంలో తయారు చేసుకుని మొక్కలను నాటారు. వీటితో పాటుగా ట్రయల్ రన్లో భాగంగా ఓపెన్ ఎయిర్‌లో కొన్ని మొక్కలు నాటి చూశారు. ప్రత్యేకగదిలో ఏర్పాటు చేసిన మొక్కలు ఆశించిన స్థాయిలో పెరుగుతుండగా, బయట వేసిన మొక్కలు తొందరగా వాడిపోయాయి. ప్రస్తుతం వేసిన రెండో పంట ఏప్రిల్‌కు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది నవంబర్‌కు ఒక టన్ను విత్తనం నుంచి రెండు కిలోల కుంకుమపువ్వు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 5,000 చదరపు అడుగుల స్థలంలో గదిని ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెకి ఉన్నతాధికారులు క్యూ హార్టికల్చర్, టూరిజం, ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం, టీటీడీ తదితర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మదనపల్లెకు వచ్చి ప్రయోగాత్మక సాగును పరిశీలించారు. భవిష్యత్ పరిశోధనలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల బాపట్లలో జనవరి 6, 7 తేదీల్లో జరిగిన 52వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని కుంకుమపువ్వు సాగుపై వ్యవసాయ పరిశోధక విద్యార్థులకు శ్రీనిధి విశదీకరించింది. ఆన్లైన్లో అమ్మకాలు.. కుంకుమపువ్వును అమ్మేందుకు వినూత్న పద్ధతిని అనుసరించింది. పర్పుల్ స్ప్రింగ్స్ పేరుతో బ్రాండ్ పేరును రిజిస్టర్ చేయించి ఆన్లైన్ వేదికగా అమ్మకాలను ప్రారంభించింది. గ్రాము రూ.600 చొప్పున విక్రయించి రూ.1,20,000 వరకు మొదటి ఆదాయాన్ని ఆర్జించింది. సామాజిక మాధ్యమాల వేదికగా యూట్యూబ్‌లో ఆమె ప్రారంభించిన పర్పుల్ స్ప్రింగ్స్ వెబ్‌సైట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
ఇదే అసలైన సర్జికల్ స్ట్రైక్ అంటూ ఎగతాళి
కృష్ణరాజపురం (బెంగళూరు): కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బెంగళూరులో ఓ యువకుడు ‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇదే’ అని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ‘రిప్ బ్రో’ అని కూడా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్‌లో మరో 40 మంది సైనికులు మరణిస్తారని కూడా ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై భగ్గుమనడంతో వెంటనే ఖాతా నుంచి పోస్ట్ తొలగించి అబిద్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అబిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
అచీవ్మెంట్
మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుం టారని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! ఇండియా ఆడడం లేదని ఇండియాలో ఆడే స్టార్లే లేకుండా పోతారా?! అఫ్షాన్ ఆషిక్ ఇప్పుడు ఫుట్‌బాల్‌లో రైజింగ్ స్టార్. అయితే కశ్మీర్లో రాళ్లు విసిరిన అమ్మాయిగానే అఫ్షాన్ దేశమంతటికీ తెలుసు. చేత్తో ఫుట్‌బాల్ పట్టుకుని ఆటకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని అఫ్షాన్లా అస్సలు ఊహించుకోలేం. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని, నీలిరంగు చుడీదార్లో పోలీసుల మీదకు రాళ్లు విసురుతున్న అఫ్షాన్ గత ఏడాదికాలంగా అల్లరిమూకలంతటికీ ఒక ఫొటో ఐడెంటిటీ! నిరుడు ఏప్రిల్‌లో ఓ ఉదయం ఫుట్‌బాల్ ట్రైనింగ్‌కి వెళుతున్న కొంతమంది అమ్మాయిల టీమ్‌ని పోలీసులు అడ్డగించినప్పుడు ఆ టీమ్‌లోనే ఉన్న అఫ్షాన్ పోలీసులకు ఎదురు తిరిగింది. తన స్నేహితురాలిని ఓ పోలీసు అధికారి అసభ్యంగా మాట్లాడి, ఆమె చెంపపై కొట్టి జీపులో వెళ్లిపోతున్నప్పుడు ఆపుకోలేని కోపంతో పోలీసులపై అఫ్షాన్ రాళ్లు విసిరింది. అది చూసి దేశం నివ్వెరపోయి చూసింది. అప్పటివరకు.. అమ్మాయిల చేతుల్లో తుపాకుల్ని మాత్రమే చూసిన దేశం.. రాళ్లు విసురుతున్న ఒక అమ్మాయిని మొదటిసారిగా చూసింది! డెబ్భై ఏళ్లుగా జమ్మూకశ్మీర్‌లో యువకులు పోలీసులపైకి రాళ్లు విసిరే దృశ్యాన్ని ఈ దేశం చూస్తూనే ఉంది. అయితే వారిలో ఒక యువతిని చూడ్డం అదే తొలిసారి. ఎవరీ అమ్మాయి అని ఇంటిలిజెన్స్ ఆరా తీసినప్పుడు.. రాష్ట్రంలో ఉన్న బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్లలో అఫ్షాన్ ఒకరన్న విషయం బయటపడింది. ఫుట్బాల్ని కాలితో ఒడుపుగా తన్నడానికి శిక్షణ కావాలి. రాయిని గురి చూసి కొట్టడానికి కశ్మీర్‌లాంటి చోట్ల చిన్న కవ్వింపు ఎదురైతే చాలు. ‘రాయి విసిరిన అమ్మాయి’గా అఫ్షాన్ నలుగురి కళ్లలో పడగానే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అఫ్షాన్ కోచింగ్ తీసుకుంటున్న స్పోర్ట్స్ అకాడమీలో చేరడానికి వచ్చే అమ్మాయిల సంఖ్య రెట్టింపయింది. బాలీవుడ్ నుంచి ఓ నిర్మాత వచ్చి, ‘అథియాశెట్టిని హీరోయిన్గా పెట్టి నీ జీవిత కథ తీస్తానమ్మాయ్.. ఇంకెవ్వరికీ మాట ఇవ్వకు’ అని చెప్పి వెళ్లాడు కూడా! ఇప్పుడామె ‘ఇండియన్ ఉమెన్స్ లీగ్’లో ముంబై టీమ్‌కి ‘జమ్మూకశ్మీర్ ఉమెన్స్ స్క్వాడ్ అండ్ గోలీ’ కెప్టెన్.ఇవన్నీ మూమూలే. శబ్దం వస్తే ఎవరైనా తలతిప్పి చూస్తారు. అఫ్షాన్ వైపు దేశమంతా అలాగే తలతిప్పి చూసింది. అయితే కశ్మీర్ అమ్మాయిలు మాత్రం అఫ్షాన్ ఇన్స్పిరేషన్తో చేతుల్లోకి రాళ్లు తీసుకుంటున్నారు! జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు ‘స్టోన్ పెల్టర్స్’ అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా!! రాళ్లు విసిరే అమ్మాయిలను హ్యాండిల్ చెయ్యడానికి సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ 500 మంది మహిళా కమెండోలను జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే దింపబోతోంది. మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుంటారని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! ఉన్నది అద్దాల మేడ అని కూడా చూసుకోకుండా రాయి విసురుతారు. అది తెలివిలేకపోవడం కాదు. తమాయించుకోలేకపోవడం. కశ్మీర్.. భారతదేశపు అద్దాల మేడ. అద్దాల మేడ కాబట్టి లోపల ఉన్నవాళ్లు రాళ్లు విసరలేరు అనుకోడానికి లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అఫ్షాన్ ఉంది. అఫ్షాన్ ఉన్నచోట ప్రతిఘటనా ఉంటుంది. ఆ రోజు ప్రశాంతంగా ఆమె ఫుట్‌బాల్‌ను అమెను ఆడుకోనిస్తే ఇప్పుడు కమెండోలు అవసరమయ్యేవారే కాదేమో?!అఫ్షాన్లానే మరో అమ్మాయి పదకొండేళ్ల నథానియా జాన్. ఇండియా ఫుట్‌బాల్ ఆడడం లేదని ఫుట్‌బాల్ టన్నెల్లోకి వెళ్లే అవకాశం ఇండియాకు లేకుండా పోతుందా? ఈ తమిళనాడు బాలిక భారతదేశపు తొలి అధికారిక మ్యాచ్ బాల్ క్యారియర్‌గా (ఒ.ఎం.బి.సి) రష్యాకు వెళ్లి వచ్చింది. ‘ఫిఫా’ ఆటోమోటివ్ భాగస్వామి కియా మోటార్స్.. 10–14 ఏళ్ల మధ్య వయసు గల ఫుట్‌బాల్ ప్లేయర్స్ నుంచి ఇండియా తరఫున ఒ.ఎం.బి.సి. విజేతగా గర్ల్స్‌లో నథానియాను ఎంపిక చేసింది. జూన్ 22న బ్రెజిల్–కోస్టారికా మధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 24వ మ్యాచ్‌లో నథానియా రెండు జట్ల ప్లేయర్లతో కలిసి ఫుట్‌బాల్ టన్నెల్ గుండా బరి వరకు వెళ్లి బంతిని అందించింది. వాళ్లతో ఫొటోలు దిగింది, వాళ్ల ఆటను చూసి ఆనందించింది. ఇండియా మురిసిపోడానికి ఫిఫాలో ఈ మాత్రం ‘ప్రాతినిధ్యం’ తక్కువేం కాదు. గ్రేట్ ఇండియన్ అచీవ్మెంట్! నథానియాలా ఫిఫాకు వెళ్లి రావడం మాత్రమే అచీవ్మెంట్ కాదు.. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎప్పటికైనా ఇంటర్నేషనల్ గేమ్‌లో ఆడాలని నథానియా అనుకుంటోంది. అదీ ఇండియా అచీవ్మెంట్! అఫ్షాన్ కూడా అంతే. కశ్మీర్ అమ్మాయే అయినా, రాళ్లు విసిరిన అమ్మాయే అయినా ఇండియాకు ఒక అచీవ్మెంట్. - మాధవ్ శింగరాజు -
సైన్యంపై కశ్మీరీల రాళ్లదాడి
తప్పించుకున్న ‘లష్కర్’ అగ్రనేతలు శ్రీనగర్: సైన్యం ఉగ్రమూకల్ని చుట్టుముట్టిన ప్పటికీ.. స్థానికులు భద్రతా బలగాలపై రాళ్లదాడి చేసి వారిని తప్పించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం రాత్రి ప్రారంభించిన తన ఆపరేషన్‌ను సైన్యం అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) కశ్మీర్ చీఫ్ అబూ దుజానాతో పాటు మరికొందరు అగ్రనేతలు హక్రిపొరా ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్ర మత్తమయ్యాయి. ఉగ్రస్థావరాన్ని ఆర్మీ చుట్టు ముట్టడంతో దుండగులు సైనికులపై కాల్పులు ప్రారంభించారు. ఉగ్రమూకల్ని సైన్యం ప్రతిఘ టిస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు.. జవాన్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సైన్యం దృష్టి మరలడంతో ఉగ్రవాదులు రాత్రిపూట అక్కడి నుంచి పరారయ్యారని ఉన్నతాధికారులు తెలి పారు. దీంతో తమపై రాళ్లు రువ్వే వారిని సైతం ఉగ్రవాదులుగా పరిగణిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. -
ఆర్మీ సాయంతో విద్యార్థులు విజయకేతనం!
కాశ్మీర్ః ఎప్పుడూ సమస్యలతో సతమతమయ్యే కాశ్మీర్ లోయలో విద్యాకుసుమాలు విరబూశాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆర్మీ ఉచిత కోచింగ్ ఇవ్వడంతో శిక్షణ తీసుకున్న పదిహేనుమంది విద్యార్థుల్లో పదకొండుమంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఓ రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహించడం ద్వారా ఆర్మీ.. సూపర్ 30 స్టూడెంట్స్ ను ఐఐటీ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసుకుంది. వీరిలో కాశ్మీర్ వ్యాలీనుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన పదిహేను మందిలో పదకొండు మంది విద్యార్థులు ఐఐటీ అడ్బాన్స్ పరీక్షకు అర్హత సంపాదించి ప్రత్యేకతను చాటారు. కాశ్మీరీ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్మీ అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీర్ లలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు పంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక పరీక్షను నిర్వహించి, మొత్తం 30 మంది సూపర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత శాస్త్రాల్లో నుభవజ్ఞులైన అధ్యాపకులతో పదకొండు నెలల పాటు వారికి డాగర్ డివిజన్ కు చెందిన చినార్ కార్స్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో అవకాశం కల్పించింది. ఇక్కడ శిక్షణ పొంది, ఎంట్రన్స్ పరీక్ష రాసిన 15 మందిలో 11 మంది అర్హతను సాధించారని... చినార్ కార్స్ ఈ సంవత్సరం నుంచి సూపర్ 30 ప్రోగ్రామ్ ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందని మేజర్ జనరల్ జెఎస్ నైన్ తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన మేజర్... కాశ్మీర్ లోని యువకులంతా తమ ప్రతిభను వెలికి తీసి, చినార్ 9 జవాన్ క్లబ్స్ ద్వారా సరైన ఉద్యోగావకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది హాజరౌతారని, జమ్మూ, కాశ్మీర్ లలో నిర్వహించిన సూపర్ 30 పరీక్ష ద్వారా శిక్షణ తీసుకున్న మొత్తం 15 మంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి, అందులో 11 మంది ఐఐటీ పరీక్షకు అర్హత సాధించారని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తాజా ఫలితాలు ఇప్పుడు కాశ్మీర్ లోని విద్యారంగానికే ఆశను కల్పిస్తున్నాయి. -
కాశ్మీర్లో మోదీ దీపావళి
న్యూఢిల్లీ: వరదల కారణంగా నిరాశ్రయులైన వేలాదిమంది కాశ్మీరీలకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. దీపావళి సందర్భంగా కాశ్మీర్ వరద బాధితుల మధ్య తాను గడపాలని నిర్ణయించుకున్నట్లు మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నెల 23న శ్రీనగర్ వెళ్లనున్నట్లు తెలిపారు. గత నెలలో భారీ వరదల కారణంగా కాశ్మీర్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ సంభవించనంతటి భారీ వరదల కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో నష్టం ఏర్పడడంతో బాధితుల పునరావాసం కోసం వెయ్యి కోట్ల రూపాయలను ప్రధాని ఇదివరకే ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బార్ రూమ్‌లలో పెళ్లిళ్లు చట్టబద్ధం కాదు చెన్నై: న్యాయువాదుల కార్యాలయూల్లో, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహస్య పెళ్లి ప్రవూణాలతో జరిగే వివాహాలు, హిందూ వివాహ చట్టం పరిధిలోకి రావని, వాటిని వివాహాలుగా పరిగణించడానికి వీల్లేదని వుద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో వుహిళలే నష్టపోతున్నందున, ఆ వివాహాలను సవాలుచేస్తూ తగిన కోర్టు వుుందు వుహిళలు పిటిషన్ దాఖలు చేయువచ్చని తెలిపింది. అడ్వకేట్లు జారీచేసే సర్టిఫికెట్‌ను వివాహానికి రుజువుగా గుర్తించలేవుంటూ తీర్పు చెప్పింది. కాగా, మరో కేసులో మొదటి పెళ్లి జరిగిన 23 రోజులకే ఆ విషయం దాచి రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ ...రెండో భర్త వేధిస్తున్నాడంటూ గృహ హింస చట్టం కింద కేసు పెట్టి భరణం కోరగా అందుకు ఢిల్లీలోని ఓ కోర్టు నిరాకరించింది. భరణం చెల్లింపు ఆదేశాలిచ్చి ఇటువంటి బహు భర్త ల/భార్యల సంబంధాలకు ఆమోదం తెలపలేమని స్పష్టం చేసింది. -
ఉగ్రవాదుల నిధులు అటాచ్
న్యూఢిల్లీ: కాశ్మీరీ వలసవాది నసీర్ సఫీ మీర్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.55 లక్షల మొత్తాన్ని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది. ఇంత పెద్దమొత్తంలో ఉగ్రవాదుల నిధులను ఈడీ అటాచ్ చేయడం ఇదే ప్రథమం. నకిలీ పాస్‌పోర్టు కేసులో 2006, ఫిబ్రవరిలో మీర్‌ను ఢిల్లీలో పోలీసు లు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు, రెండు కిలోల ఆర్డీఎక్స్, మందుగుండుతోపా టు రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ నిబంధనల కింద మీర్‌పై కేసు నమోదు చేశారు. ఆరోగ్య కారణాలతో 2008లో ఢిల్లీ హైకోర్టు నుంచి మీర్ బెయిల్ పొందాడు. తర్వాత ఢిల్లీ నుంచి అదృశ్యమయ్యాడు. ఇదిలాఉండగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, టోనీ మార్కెట్లో రహస్యంగా పనిచేస్తున్న హవాలా నిర్వాహకుడి నుంచి నల్లధనాన్ని మీర్ తీసుకున్నట్లుగా ఆరోపిస్తూ ఈడీ 2007లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం స్పెషల్ సెల్ ఆధీనంలోనున్న రూ. 55 లక్షల మొత్తాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎవరీ మీర్... జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటువాద శక్తులకు నిధులను సమకూర్చడంలో నసీర్ సఫీ మీర్ కీలక పాత్రదారి అనే ఆరోపణలు ఉన్నాయి. 43 ఏళ్ల మీర్ ఉత్తర కాశ్మీర్‌కు చెందినవాడు. 1983లో చదువు మానేసి తివాచీల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత రాజధాని ఢిల్లీకి వచ్చి లజ్‌పత్‌నగర్‌లో కొన్నాళ్లు ఉన్నాడు. అయితే 1990లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత దుబాయ్‌కు వలస వెళ్లాడు. దుబాయ్‌లో సొంత ఇల్లు, తివాచీల షోరూమ్ ఉన్న మీర్... మరోవైపు గల్ఫ్‌లో మారకద్రవ్య సరఫరా వ్యవహారాలు సాగించేవాడు. అక్కడి నుంచే భారతీయ పాస్‌పోర్టు(నకిలీ) సంపాదించాడు. అలాగే దక్షిణ ఢిల్లీలోని జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో ఎన్నారై ఖాతాను నిర్వహించాడు.హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌కు సన్నిహితుడైన మీర్... కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్, వేర్పాటువాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే మిర్వాయిజ్ గురువారం శ్రీనగర్ నుంచి ఫోన్లో పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... మిర్, అతని కుటుంబం గురించి మాత్రమే తనకు తెలుసునని, అతణ్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదని చెప్పారు.