ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది.
కశ్మీర్‌లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్‌లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి.
ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది.
ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం
Comments
Please login to add a commentAdd a comment