Migrant
-
మా సరిహద్దుపై ఓ కన్నేసి ఉంచాం- కెనడా ప్రధాని
-
West Africa: పడవ బోల్తా.. 105 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.ఈ ఉదంతం గురించి ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.పశ్చిమ ఆఫ్రికా దేశపు మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. -
భారత్‌లో ఓటేసిన పాకిస్థాన్ వలస జంట.. భావోద్వేగంతో..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) పాకిస్థాన్‌కి చెందిన దంపతులు ఓటేశారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చి భారత పౌరసత్వం పొందిన ఈ జంట శనివారం జైపూర్‌లోని సంగనేర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులైన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు చివరిసారిగా 2013లో పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ తర్వాత మతపరమైన వేధింపులతో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ను వదిలి 2014లో విజిటర్స్ వీసాపై తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చారు. ఎనిమిది సంవత్సరాల పాటు అధికారిక పరిశీలనలో గడిపిన తర్వాత వీరిద్దరూ 2022లో భారత పౌరసత్వం పొందారు. అయితే వీరి పిల్లలకు మాత్రం ఇంకా భారత పౌరసత్వం లభించలేదు. భారతీయులమని గర్వంగా చెప్పుకొంటాం సంగనేర్‌లోని విద్యాస్థలి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తొలిసారి ఓటేసి బయటకు వచ్చిన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు.. తాము ఇప్పుడు భారతీయులమని గర్వంగా చెప్పుకోగలమని భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఏడాది జరిగే భారత పార్లమెంటరీ ఎన్నికలలోనూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నామని నిర్మల తెలిపారు. నిర్మల జనరల్ మెడిసిన్‌లో వైద్యురాలు కాగా అశోక్ అనస్థీషియాలజిస్ట్‌గా ఉన్నారు. తమను ఓటు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని తెలిసి పాకిస్తాన్లో ఉంటున్న తన తల్లి, సోదరులు సంతోషం వ్యక్తం చేశారని, తమను అభినందించారని నిర్మల పేర్కొన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా తమ నిజమైన మాతృభూమి అయిన భారతదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత్‌లో ఎన్నికల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. తమకు పౌరసత్వం ఇచ్చినందుకు కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. కశ్మీర్‌లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్‌లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
ప్రేమించకపోతే దాడి చేస్తావా? ఇదేం పిచ్చి..?
ఇటీవల ప్రేమించకపోయినా లేదా ఏ కారణాల చేత ప్రేమ జంటలు విడిపోతే ఆ కథలు చివరికి చంపుకోవడంతో ముగింపు పలుకుతున్నాయి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్ చిన్న మనస్పర్థలకు వేరైతే ఎవ్వరి వారు ఉండాలి. లేదా ఆ వ్యక్తికి మనమనుసులో చోటు లేదని లైట్ తీసుకునేలా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ కక్ష పెంచుకుని ఏదో క్రిమినల్ మాదిరి స్పాట్ పెట్టి చంపేంత స్థాయికి దిగజారి కటకటలా పాలవ్వతున్నారు. దీనివల్ల ఇరువురు జీవితాలు కోల్పోవడమే గానీ ఏం యూజ్ ఉండుదు. అలాంటి దారుణ ఘటనే స్వీడిష్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అల్జరీయన్ వలసదారు 26 ఏళ్ల మహమ్మద్ అమనా, స్వీడిష్ గర్లఫ్రెండ్‌తో ఉండేవాడు. ఏమయ్యింది ఏమో కొన్నాళ్లుగా ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. దీన్ని అంగీకరించని మహమ్మద్ అమనా కక్షతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేసి మరీ మాజీ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఓ నిచ్చెన సాయంతో ఆమె అపార్ట్మెంట్లోకి నేరుగా వచ్చేశాడు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆ అపార్ట్మెంట్లో ఓ స్నేహితుడితో కలిసి ఉంటోంది. అక్కడ ఉన్న ఆమె స్నేహితుడి అమనాని రావద్దని అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో అమనా కోపంతో అతడిపైకి రాయితోటి, కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. ఈ మొత్తాన్ని అమనా మాజీ ప్రియురాలే రికార్డు చేసింది. ఈ దుశ్చర్య కారణంగా మహ్మద్ అమనాకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా స్వీడన్‌కి తిరిగి రాకుండా పదేళ్ల నిషేధంతో బహిష్కరించింది. అమనాకి ఈ శిక్ష మొదటిసారేం కాదు. ఐతే ఆ బహిష్కరణ అమనా విషయంలో అమలు కాకపోగా అతడు మళ్లీ ఇలాంటి అనేక కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవలే కోర్టు మళ్లీ అతనికి ఇదే తరహా శిక్ష విధించింది. మరీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
పడవ బోల్తా.. 41 మంది మృతి..
మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి ప్రాణాలతో చేరారు. అనంతరం పడవ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. 45 మందితో ప్రయాణించిన పడవ.. మధ్యదరా సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరూ మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సంక్షోభంతో నిండిపోయిన ట్యూనీషియా నుంచి 45 మందితో పడవ ప్రయాణించినట్లు తెలుస్తోంది. పడవ మొదలైన కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఆ భయానక దృశ్యాల గురించి తెలిపారు. ఇదీ చదవండి: 'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..' -
‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం
గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా అట్టడుకుతోంది. నూహ్ జిల్లాల్లో చెలరేగిన హింసతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్‌లలో 144 సెక్షన్ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్‌లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. బజరంగ్ దళ్ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. Hamein kuch nahin chahiye... Bas Delhi tak chor do... #Muslim slum-dwellers in #Gurugram after their men were beaten by drunk goons reportedly from #BajrangDal for being Muslim. #NuhConspiracy pic.twitter.com/ST3baTlsyf — Ankita Anand (@ankita_das_) August 2, 2023 ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి గురుగ్రామ్‌లో నివసిస్తున్న 100 ముస్లిం కుటుంబాల్లో.. ప్రస్తుతం తాము 11 మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఓ ముస్లిం వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్ల కారణంగా తాము ఎక్కడికి పోలేని పరిస్థితి తలెత్తిందని, సొంత ఊరు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చులు కూడా లేవని కన్నీటి పర్యంతమయ్యాడు 25 ఏళ్ల షమీమ్ హుస్సేన్... చదవండి: Haryana communal violence: బలగాల్ని దింపండి #GuruGramViolence: Muslim owned shops looted & vandalised! Shanties of poor Muslims burnt! Spillover of #NuhViolence was seen in Gurgaon! Fires were reported from 3 locations! Meat shops & Muslim hotels were ransacked & vandalised! Muslims have been threatened to leave Gurugram! pic.twitter.com/H717JUn8pg — Muslim Spaces (@MuslimSpaces) August 2, 2023 ఆయన మాట్లాడుతూ.. ‘గత సాయంత్రం కొంతమంది గుంపు వచ్చి, రెండు రోజుల్లో ఇక్కడున్న ముస్లింలందరూ ఖాళీ చేయాలని బెదిరించారు. రోడ్డు మీదకు వెళ్తే పేరు అడిగి కొడుతున్నారు. తిరిగి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అప్పు చెల్లించాల్సి ఉంది. నాకేం జరిగినా పర్లేదు. కానీ నాకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. మామల్ని కాపాల్సిందిగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని ఆర్థిస్తున్నానంటూచేతులు జోడించి వేడుకున్నాడు. మా కుటుంబం జీవనోపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చి కేవలం ఏడు రోజులు మాత్రమే అయ్యింది. రెండు రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఉద్యోగం దొరకగా.. ఇంకా జీతం ఇవ్వలేదు. నా ఏడాది వయస్సున కొడుకు పేరు అలీషాన్. అల్లరి మూకలు వచ్చి నన్ను, నాభార్యను కొడతారని భయమేస్తోంది. ఇది తలుచుకొని భయపడి నా భార్య రెండు రోజులుగా ఏడుస్తోంది. సొంత ఊరిలోనూ ఉపాధి లేకపోవడంతో తిరిగి వెళ్లలేం.. ఇక్కడా ఉండలేకపోతున్నాం.. ఎలా బతకాలి’ ’ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ వాపోయాడు. చదవండి: మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్ #MuslimsUnderAttack Is it a crime to do journalism in Gurugram Gurugram: In Sector 70, 200 Muslim families have fled fearing threats and assault by local Bajrang Dal workers. I was threatened twice when I was reporting there. my religion was asked,and the camera was turned off pic.twitter.com/LRZ2FEFZYN — Tarique Anwar (@imtariqueanwar) August 2, 2023 దీనిపై గురుగ్రామ్ జిల్లా కమిషనర్ స్పందిస్తూ.. స్థానిక వలస కార్మికులను ఖాళీ చేయమని బెదిరించినట్లు వార్తలు అందాయని, జిల్లా, పోలీసు అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వలస కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సున్నిత ప్రాంతాలు, ఇరు వర్గాల మతపరమైన ప్రదేశాలైన మసీదులు, దేవాలయాల చుట్టూ రాత్రిపూట మోహరింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రేపటి వరకు నగరంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. -
సైకో వీరంగం.. గుమ్మం నుంచి బామ్మను లాగి..
ఫ్రాన్స్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్‌గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9 — Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు -
నూతన విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం.. ఎక్కడున్నా ఓటు పక్కా!
సాక్షి,షాబాద్(హైదరాబాద్): వలసదారుల ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్నా బతుకు దెరువు కోసం సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఎన్నికల సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలేకపోవడం.. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం వంటి కారణాలను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారు ఉన్నచోటే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. దీంతో జిల్లా నుంచి వలస వెళ్లిన వ్యక్తులకు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు అవకాశం లభించనుంది. వ్యవసాయాధారిత జిల్లా కావడం పల్లెలు ఎక్కువగా ఉండడం.. వ్యవసాయ పనులు లేని సమయంలో పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్థిక భారం పడటం.. సుదూర ప్రాంతాల నుంచి రాలేక ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటింగ్ శాతం పడిపోయిన సందర్భాలున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురానున్న నూతన విధానం వల్ల ఉన్న చోటు నుంచే ఓటు వేసే రిమోట్ ఓటింగ్ సిస్టం ద్వారా అధిక శాతం నమోదుకు ఎన్నికల కమిషన్ ప్రయతి్నస్తోంది. ఓటర్లు తాము ఉంటున్న ప్రాంతాల నుంచే ముందస్తుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెరగనున్న ఓటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విధానం ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదవండి: ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి -
ఈవీఎం తరహాలో ఆర్వీఎం.. ఈసీ సరికొత్త ప్లాన్!
ఢిల్లీ: దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం బాగా కనిపించింది. సాంకేతికతంగా అభివృద్ధి చెందినా.. వలస ఓటర్లు దూరం అవుతుండడం సరికాదనే అభిప్రాయంలోకి ఉంది కేంద్రం ఎన్నికల సంఘం. ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో.. వాళ్ల ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(RVM)పద్ధతిని తీసుకురాబోతోంది. తద్వారా సొంత ఊళ్లకు వెళ్లకుండానే ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఓటింగ్ టూల్ ద్వారా వలస ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒక రిమోట్ పోలింగ్ బూత్ నుంచి ఆర్వీఎం ద్వారా 72 నియోజకవర్గాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ కొత్త సాంకేతిక విధానాన్ని రాజకీయ పార్టీలకు వివరించేందుకు ఇప్పటికే ఈసీ ఆహ్వానించింది కూడా. ఈ నమునాను వివరించే కార్యక్రమం 2023 జనవరి 16వ తేదీన జరగనుంది. ఈ విధానంతో పాటు టూ వే మెథడ్ ఫిజికల్ ట్రాన్సిట్ పోస్టల్ బ్యాలెట్, ప్రాక్సి ఓటింగ్, స్పెషల్ ఎర్లీ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోస్టల్ బాలెట్స్(వన్ వే లేదంటే టూ వే), ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్.. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలను పరిశీలించింది కూడా. దేశంలో రాష్ట్రాల మధ్యే 85 శాతం అంతర్గత వలసలు సాగుతున్నట్లు ఒక అంచనా. కేంద్రం వద్ద ఈ వలసల లెక్కలు లేకపోయినా.. పనులు, వివాహాలు, చదువు తదితర కారణాలతో ఇలాంటి వలసలు కొనసాగుతున్నాయన్నది పలు విశ్లేషణల ద్వారా తేలింది. -
‘ఎండి’పోతున్న పక్షులు
బరంపురం: వేసవి కారణంగా ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న రోజువారీ ఉష్ణోగ్రతలకు చిలికా సరస్సులోని విదేశీ విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. చిలికా వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న సరస్సులోని విదేశీ పక్షుల లెక్కింపు ప్రక్రియ బుధవారం సాయంత్రం నాటికి పూర్తయింది. ఈ లెక్కన సరస్సులోని పలు దీవులు సహా సరస్సు పరిసర ప్రాంతాల్లో మొత్తం 59,687 పక్షులు నివశిస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిలో 22,395 విదేశీ పక్షులు ఉండగా, మిగతా 39,292 పక్షులు స్థానిక పక్షులుగా అధికారులు గుర్తించారు. ఏటా నవంబర్‌లో శీతాకాలం సమీపించగానే విడిది కోసం విదేశాల నుంచి ఇక్కడి సరస్సుకి చేరుకునే ఈ అతిథి పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వేసవి ప్రారంభం కాగానే తమ స్వదేశానికి బయలుదేరుతాయి. అయితే ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల ఇక్కడే ఉండిపోయిన కొన్ని విదేశీ పక్షులు వేసవి ఉష్ణోగ్రతల కారణంగా చనిపోతున్నాయి. మృతి చెందుతున్న వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో, పెలికాన్, బ్రాహ్మణి డక్ పక్షులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రోజూ 36 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఈ ఉష్ణాన్ని ఈ పక్షులు తట్టుకోలేకపోతున్న కారణంగానే మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ పక్షుల మరణాలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని పర్యాటకులు, యాత్రికులు కోరుతున్నారు. -
వలస రెక్కలు ఇరిగిపాయె!
సాక్షి, సిటీబ్యూరో: చూడముచ్చటైన పక్షులు విలవిలలాడుతున్నాయి. ఖండాంతరాలనుంచి వలస వచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. నగరానికి వస్తున్న విదేశీ విహంగాల పాలిట ప్లాస్టిక్ వ్యర్థాలు, శబ్ద, వాయు కాలుష్యం శాపంలాపరిణమిస్తున్నాయి. ఆహారం, వసతి కోసం నగరంలో పలు మంచినీటిచెరువులకు వలస వస్తున్నవాటిలో ఎన్నో పక్షులు ఇక్కడే మృత్యువాతపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల కోసం వేసిన వలల్లో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్యలో వలస వస్తున్న పక్షుల్లో సుమారు 30 నుంచి 40 శాతం తగ్గుముఖం పడుతున్నట్లు పక్షి శాస్త్రవేత్తల గణాంకాలు వివరిస్తున్నాయి. మరోవైపు చేపలు పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకు ఉన్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కులకు, మెడలకు చుట్టుకొని ఊపిరివదలుతుండటంఆందోళన కలిగిస్తోంది. వీటి శాతం సుమారు 13 శాతం ఉన్నట్లు పక్షి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనుమరుగవుతున్నపలు జాతుల పక్షులు.. రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగవుతోంది. శబ్ద, వాయు కాలుష్యం, వాటి సహజ ఆవాసాలైన చెరువులు, కుంటలు, జలాశయాలు కాలుష్యకాసారంగా మారడం, కబ్జాకు గురవడంతో వాటి విస్తీర్ణం తగ్గడం, నగరీకరణ ప్రభావం, పర్యాటక, మానవ తప్పిదాలు, చైనా మాంజా.. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. సైబీరియా, యూరప్, ఆఫ్రికా, మియన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి గ్రేటర్ నగరంతో పాటు.. సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలకు ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి జాతులు తరలివస్తుంటాయి. మాయమవుతున్నవాటిలో ఇవీ.. ఈ సమయానికి హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస వస్తాయి. కానీ ఈసారి వీటి సంఖ్య 50కి మించి లేదని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులదీ ఇదే పరిస్థితి. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి జాడ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పక్షి కనిపిస్తే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుందన్న నానుడి ఉండడం విశేషం. పక్షుల రాక తగ్గిపోవడంతో జీవవైవిధ్యం కనుమరుగవుతోందని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వలస పక్షులకు ఈ ప్రాంతాలు ఆలవాలం గ్రేటర్‌తో పాటు సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు ఏటా వలస పక్షులను అక్కున చేర్చుకొని వాటికి ఆహారం, వసతి సమకూరుస్తున్నాయి. ప్రధానంగా కేబీఆర్ పార్క్, అనంతగిరి హిల్స్, ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల), అమీన్పూర్ చెరువు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా జలాశయాలకు ఏటా సుమారు 200 జాతులకు చెందిన వేలాది పక్షులు తరలివస్తాయి. కానీ ఈసారి వీటిలో 30– 40 శాతం తగ్గుముఖం పట్టినట్లు పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల వలసలకు ప్రధాన కారణాలు.. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణం ,మంచు ప్రభావంతో ఆహారం, వసతి సమకూర్చుకోవడం కష్టతరంగా మారడంతో వేలాది కిలోమీటర్ల నుంచి నగరానికి పక్షులు వలస వస్తుంటాయి. పక్షులు వలసవచ్చే ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉండడం, వలస వచ్చే ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి నీటిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, చిన్న కీటకాలు ఆహారంగా లభ్యమవుతాయి. ఆయా కారణాల రీత్యా పక్షులు వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు . ఈ ప్రాంతాల్లో వలసలు మాయం... పదేళ్ల క్రితం నగరంలోని హుస్సేన్‌సాగర్‌కు విభిన్న రకాల బాతులు, వాటి ప్రజాతులకు చెందిన పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడు ఈ జలాశయం కాలుష్య కాసారం కావడంతో ప్రస్తుతం వలస పక్షుల జాడే కనుమరుగైంది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, కాప్రా, రామకృష్ణాపూర్, బోయిన్పల్లి చెరువుల్లోనూ ఇదే దుస్థితి. ఆయా జలాశయాల్లో గుర్రపుడెక్క ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో నీటిపై తేలియాడుతూ జీవించే పక్షి జాతుల మనుగడ కష్టతరమవుతోంది. ప్రధాన కారణాలివే.. ♦ చేపలను పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకున్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కు, మెడకు చుట్టుకొని మృత్యువాత పడుతున్నాయి ♦ ఆయా ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉండడం ♦ జలాశయాల విస్తీర్ణం క్రమంగా కబ్జాలు, అన్యాక్రాంతం కావడంతోకుంచించుకుపోయాయి. ♦ పట్టణీకరణ ప్రభావంతో ఆయాజలాశయాల చుట్టూ జనావాసాలు,పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు నెలకొనడం ♦ పర్యాటక కార్యకలాపాలు, టూరిస్టుల రాకపోకలు పెరగడంతో దెబ్బతింటున్న పక్షుల సహజ జీవన శైలి ♦ మానవ సంబంధ కార్యకలాపాలు, ఫొటోలు తీయడం, పక్షుల సహజఆవాసాలను దెబ్బతీయడం ♦ చైనీస్ మాంజా చెట్లు, కొమ్మలకుచిక్కుపడడం.. వీటిలో పక్షులుచిక్కి ప్రాణాలు కోల్పోవడం నగరీకరణ, కాలుష్యం వల్లే.. ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల వలలు, పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలే వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటి మరణాల శాతం క్రమంగా పెరుగుతోంది. వలస పక్షుల సంరక్షణకు అన్ని వర్గాలు పాటుపడాలి.– డాక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం, ఓయూ ఈ కేంద్రాలకు వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్ (బాతు), షౌలర్, గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్ లింక్స్, భార్మెడో గూస్ బాతు, గుజరాత్ రాజహంసలు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు,డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు జాతులున్నాయి. వలస పక్షులకు నిలయాలు.. ఈ ప్రాంతాలు ప్రాంతం వలస పక్షుల జాతులు, ప్రజాతులు 1 కేబీఆర్ పార్క్ 24 రకాలు 2 అనంతగిరి హిల్స్ 37 ,, 3 ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల) 38 ,, 4 అమీన్పూర్ చెరువు 42,, 5 హిమాయత్ సాగర్ 52,, 6 ఉస్మాన్ సాగర్ 99,, 7 మంజీరా 153,, -
40 ఏళ్లుగా రంజాన్ ఉపవాసాలు ఉంటున్నా
‘మాది నెల్లూరు ప్రాంతం. నలభై ఏళ్ల క్రితం ఖతార్ రాజధాని దోహాకు వెళ్లాను. అక్కడ వ్యాపారవేత్త అయ్యాను. ఇక్కడ కూడా వ్యాపారవేత్తగా, సినిమా ఫైనాన్షియర్‌గా ఉంటున్నాను. రెండేళ్ల క్రితం వరకు సంవత్సరంలో తొమ్మిది నెలలు అక్కడా మూడు నెలలు ఇక్కడా ఉండేవాణ్ణి. ఇప్పుడు వయసు రీత్యా ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను’ అన్నారాయన. పదింతల జీతం ‘నేను సి.ఏ చేసి 1980లో బెంగళూరులో ఉద్యోగం చేసేవాణ్ణి. అప్పుడు నా జీతం 1500. ఎవరో చమురు దేశాలకు వెళితే ఎక్కువ జీతం వస్తుందని చెప్పారు. ఎంత వస్తుందని ఆరా తీస్తే 20 వేలు అని తేలింది. అంటే అక్కడ రెండేళ్లు చేస్తే ఇక్కడ పదేళ్లు చేసినదానికి సమానం. అయితే సి.ఏ ఉద్యోగాలకు ముంబై నుంచి ఎక్కువ పోటీ ఉండేది. నేను ధైర్యం చేసి అప్లై చేశాను. ఒకే ఒక్క కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. 1980లోనే దోహాకు వెళ్లాను. నా తొలి జీతం 20 వేలు’ మూసేసిన హోటళ్లు ‘నేను వెళ్లిన సంవత్సరం యథావిధిగా రంజాన్ వచ్చింది. అప్పటికి నా భార్యకు వీసా రాకపోవడం వల్ల బేచిలర్‌గా ఉన్నాను. రంజాన్ మాసం రావడంతోటే అక్కడి హోటళ్లన్నీ మూతపడ్డాయి. సూర్యాస్తమయం అంటే ఇఫ్తార్ సమయం తర్వాతనే అవి తెరుచుకునేవి. హోటల్ భోజనం చేస్తున్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరినో అడిగితే ‘రంజాన్ నెలలో ఇంతే’ అన్నారు. ఆ ఉపవాసం పద్ధతి తెలుసుకుని అలా ఉండటం చాలా కష్టమనీ ముస్లింలు ఎలా ఉంటున్నారో అని అనుకున్నాను. ఒకరోజు సాయం త్రం ఆకలితో హోటల్‌కు వెళ్లాను. ఆ హోటల్లో అన్ని ఆహార పదార్థాలు ముందు పెట్టుకుని చాలామంది ముస్లింలు కూచుని ఉన్నారు. వాళ్లెందుకు తినకుండా వెయిట్ చేస్తున్నారని అడిగాను. ఇఫ్తార్ సమయాన్ని సూచిస్తూ సైరన్ మోగుతుందని అప్పుడు తింటారని చెప్పారు. నేను ఆ సమయం తర్వాత హోటల్లో అమ్మే పదార్థాల కోసం కూచుని ఉన్నాను. ఇంతలో ఒక ఎనభై ఏళ్ల ముసలాయన అక్కడకు కుంటుకుంటూ వచ్చాడు. నిండు వృద్ధుడు. కాని ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. ఇఫ్తార్ కోసం వచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది... అరే ఇంత వృద్ధుడు ఉపవాసం ఉంటుంటే నేను ఎందుకు ఉండకూడదు అనుకున్నాను’ భూమిని గౌరవించడానికి ‘దోహ నా సొంతభూమి కాదు. భుక్తినిచ్చిన భూమి. నాకు అన్నం పెట్టి ఆదరిస్తోంది. ఈ భూమి ఆచారాలను గౌరవించడం బాగుంటుందనిపించింది. పైగా సంవత్సరంలో ఒక ముప్పై రోజులపాటు ఉపవాసాలు ఉండటం ఆరోగ్యానికి మంచిదని విన్నాను. అక్కడి మిత్రులను అడిగితే ‘రంజాన్ పవిత్రమాసం. ఉపవాసాలు ఉండి మీ మతదైవం లేదా మీ ఇష్టదైవం ఆరాధనలో మీరుండొచ్చు’ అన్నారు. అలా నేను కూడా ఉపవాసాలు ఉండటం మొదలుపెట్టాను. మొదటి రెండు రోజులు కొంచెం కష్టంగా అనిపించింది. కాని ఆ తర్వాత ఉపవాసం ఉంటున్నందుకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. మనసు దుర్వ్యసనాల, దురాలోచనల జోలికెళ్లదు. శాంతంగా, ప్రేమగా ఉండబుద్ధేస్తుంది’ ఉపవాస దీక్ష ముగిస్తున్న కోటేశ్వరరావు మంచినీరు, టీ, ఖర్జూరం... ‘ముస్లిం మిత్రులు ఉదయాన్నే సహర్ చేసి ఉపవాసం ఉంటారు. నేను ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని టీ, మంచినీరు మాత్రమే తీసుకొని ఉపవాస దీక్ష ప్రారంభిస్తాను. సాయంత్రం ఇఫ్తార్‌ను ఖర్జూర పండ్లతో ముగిస్తాను. అలా ముప్పై రోజులు ఉండటం అలవాటైపోయింది. నేను దోహాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఆ ముప్పై రోజులు మాత్రం ఉపవాసం తప్పక చేస్తాను. ఆ సమయంలో నా ఇష్టదైవాన్ని ధ్యానిస్తాను. ఇది నా ప్రవాస భూమికి నేను చూపించే కృతజ్ఞత. ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కోసారి నా మిత్రులకు ఇది అర్థం కాదు. నేను ఉపవాస దీక్షలో ఉన్నట్టు వాళ్లకు తెలియదు కదా. చెప్పినా ఆశ్చర్యపోవచ్చు. అందుకే రంజాన్ మాసంలో ఎవరైనా భోజనానికి పిలిచినా ఏదైనా తాగమని ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరిస్తాను. దీక్ష తప్పకుండా చూసుకుంటాను’ అన్నాడాయన. మనుషులందరూ మంచివాళ్లే ‘దోహలో నా మతాన్ని నేను ఆచరించడంలో ఏ ఇబ్బందీ పడలేదు. ఎవరి మతరీతులకూ ఎవరూ భంగం వాటిల్లజేయరు. అది ముస్లిం దేశమే అయినా ఈ మధ్యే అక్కడ ఒక చర్చ్‌కు అనుమతి ఇచ్చారని విన్నాను. ఆ దేశాలలో దేవాలయాలు, గురు ద్వారాలు ఉన్నాయి. ఖతార్ సిరి సంపదల దేశం. మన దేశస్తులు ఎందరో ఉన్నారు. తెలుగువాళ్లు కూడా. సర్వ మతస్తులు సామరస్యంగా ఉన్నప్పుడు సిరి దానికదే వృద్ధి చెందుతుంది. ఎండలు భయంకరంగా కాచే ఎడారి నేలలోనే తియ్యటి ఖర్జూరాలు గుత్తులు గుత్తులుగా పండటం దైవలీల. ఆ దైవాన్ని మనసులో పెట్టుకుని సాటి మనిషి బాగు కోసం పాటు పడటమే మనం చేయాల్సిన పని. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు’ అని ముగించాడాయన. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నగరంలో అదో మినీ ఆఫ్రికా..
ఆరడుగులకుపైగా ఎత్తు.. రింగురింగుల జుత్తు.. బ్లాక్ కలర్లో భారీ ఆకారం.. వెస్ట్రన్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్న యువతరం. సరికొత్త స్టైల్ వారి సొంతం.. ప్రపంచ చరిత్రలో వారిదో ప్రత్యేక స్థానం. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీరు కనిపిస్తారు. మన దేశంలోనూ కనిపిస్తారు. అందులో మినీ ఇండియాగా పేరుగాంచిన మన హైదరాబాద్‌లోనూ వారు దర్శనమిస్తారు. నగరంలో వీరికి ఓ ప్రత్యేక కాలనీయే ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఇక్కడికి వెళ్లినవారికి ఆఫ్రికా దేశానికి వెళ్లామనే ఫీలింగ్ కలగమానదు. వీరు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తారు. జూబ్లీహిల్స్‌ను ఆనుకొని ఉన్న పారామౌంట్ హిల్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తోంది. నల్లజాతీయుల జీవనశైలి అబ్బురపరుస్తోంది. రకరకాల కారణాలతో హైదరాబాద్‌కు వస్తున్న వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పారామౌంట్ హిల్ కాలనీలోని ఆఫ్రికన్లపై ప్రత్యేక కథనం. బంజారాహిల్స్ :ఇటీవల కాలంలో ఆఫ్రికన్లు హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం కోసం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మెడికల్ టూరిజంలో ముంబై, చెన్నై తర్వాత హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులకు హైదరాబాద్‌లో కొదవ లేదు. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, హైదరాబాద్ నుంచి విమాన సేవలు మెండుగా ఉండటంతో ఆఫ్రికన్ దేశస్థులు చికిత్స కోసం హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. చాలా మంది ఆఫ్రికన్ యువత ఉన్నత విద్య కోసం నగరాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య, వైద్య సదుపాయాలు, తక్కువ ఖర్చుతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ను బెస్ట్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పారామౌంట్ హిల్ కాలనీ చిన్నపాటి ఆఫ్రికాలా మారింది. వీరు ఇక్కడ 30 ఏళ్లుగా నివసిస్తున్నారు. అడుగడుగునా ఆఫ్రికన్ సంస్కృతి సుడాన్, సోమాలియా, కాంగో, ఘనా తదితర దేశాల నుంచి వచ్చిన ఆఫ్రికన్లు ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్ సంస్కృతీ సంప్రదాయాలు దర్శమిస్తుంటాయి. వారి జీవన విధానాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారాలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, అరేబియన్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్రికన్ ఘుమఘుమలే కాకుండా దుస్తులకు సంబంధించిన వ్యాపారాలూ కనిపిస్తాయి. లాల్చీ లాంటి పొడవాటి రంగురంగుల దుస్తులు ధరించే వారు ఆకట్టుకుంటారు. ఇక జీన్స్, టీషర్టులతో సరికొత్త లుక్ ఇచ్చే యువత ప్రత్యేక ఆకర్షణ. మహిళలు ధరించే బూర్ఖాలు కూడా అందుబాటులో ఉంటాయి. తక్కువ మొత్తంలో అద్దెలు ఉండటంతో ఈ కాలనీని ఎంచుకుంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది వరకు విద్యార్థులు, మరో వెయ్యి మంది వరకు వివిధ కారణాలతోవచ్చిన వారు ఉన్నారు. కొంత మంది ఆఫ్రికన్ల పిల్లలు కూడా ఇక్కడి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ సందడే సందడి. ఉస్మానియాలో బీటెక్ చేస్తున్నా.. నేను మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నాను. పారామౌంట్ కాలనీలో నా స్నేహితులతో కలిసి అద్దెఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్‌లో ఉంటే మా దేశంలో ఉన్నట్లుగానే ఉంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు బాగా నచ్చాయి. – ఇసా సాల ఇసా, విద్యార్థి, ఆఫ్రికా అందరితో కలిసిపోతాం.. నేను ఇక్కడ నా స్నేహితులతో ఉంటున్నా. పారామౌంట్ కాలనీలో ఎటు చూసినా మా కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి ఆఫ్రికన్ ఇదే కాలనీలో ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా మేమే కనిపిస్తాం. ఐకమత్యంతో ఉంటాం. – జరత్ లూయిస్ రాబర్ట్,విద్యార్థి, కామెరూన్ మంచి వాతావరణం.. కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి పారామౌంట్ కాలనీలో ఉంటున్నా. మిగతా దేశాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ ఖర్చుతో నివాసం ఉండటమే కాకుండా అన్ని సౌకర్యాలతో జీవించగలుగుతాం. చదువు కూడా మాకు ఉచితంగానే లభిస్తోంది. – అబ్దుల్ రహీం, విద్యార్థి, సూడాన్ -
సూట్‌కేసులో దాక్కొని దొరికిపోయాడు..
బెర్న్: యూరప్ వలస బాధితుల ఉదంతాలకు అద్దం పట్టే ఘటన స్విజర్లాండ్లో చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి రైల్లో అక్రమంగా స్విజర్లాండ్లోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి సూట్‌కేసులో దాక్కున్నాడు. ఆరడుగుల ఎత్తున్న వ్యక్తి.. చిన్న సూట్‌కేసులో నక్కి మిత్రుడితో పాటు ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సూట్‌కేసులో దాక్కొని సుమారు 45 నిమిషాలు ప్రయాణించిన తరువాత కలిగిన అసౌకర్యం మూలంగా ఆ వ్యక్తి శబ్దం చేయటంతో తోటి ప్రయాణికులకు అనుమానం కలిగింది. వారు సూట్‌కేసు నుంచి శబ్దాలు వస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫాంపై దానిని ఓపెన్ చేసిన పోలీసులు అందులో ఓ వ్యక్తి ఉండటం చూసి షాక్ తిన్నారు. సదరు వ్యక్తితో పాటు.. మిత్రుడి వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించిన పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపారు. వీరు ఎరిత్రియాకు చెందినవారిగా గుర్తించారు. వలసలు వెళ్లే క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను అన్వేషిస్తూ కొందరు మృత్యువాత పడుతున్నారు. -
ప్లాట్లుగా పోర్న్ స్టూడియో.. వద్దంటున్న జనం!
వాయవ్య ఇంగ్లండ్ బ్రిస్టల్ నగరంలోని బ్లూ మూవీ స్టూడియో.. నిన్నమొన్నటి వరకు ఘాటైన శృంగార దృశ్యాల చిత్రీకరణలతో హోరెత్తేది. ఈ స్టూడియోలో నిత్యం పోర్న్ సినిమాలు నిర్మించి.. వాటిని లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. ఈ స్టూడియోను ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి అమ్మేయాలని తాజాగా యజమాని నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని స్థానిక కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్లూ మూవీ స్టూడియోను ఫ్లాట్లుగా చేసి అమ్మితే.. వలసదారులే వాటిని కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుదారని, పోర్న్‌స్టార్లు అంటే వలసదారులకు చాలా ఇష్టమని స్థానిక కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 35 మంది కాలనీ వాసులు ఆందోళనబాటపట్టారు. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా మారిస్తే.. ఇక్కడి తమ ఇళ్లను అమ్మేసుకోని వేరే చోటుకి వెళ్లిపోతామని వారిలో కొందరు హెచ్చరిస్తున్నారు. బ్రిస్టల్ సెయింట్ జార్జ్‌లోని ఈ స్టూడియోను నిన్నమొన్నటి వరకు ఫిల్ బేరి స్టూడియోగా వాడుకున్నాడు. పోర్న్ స్టార్ క్యాథీ బేరి భర్త అయిన ఫిల్ల్ ఈ నివాసంలో పోర్న్ దృశ్యాలు తీసి.. వాటిని లైవ్ ప్రసారం చేసేవాడు. అయితే, దీని యజమాని మైక్ హాబిన్స్ ఇంటిని 40 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లుగా మార్చి.. అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా నగరంలో నెలకొన్న ఇళ్ల సంక్షోభం పరిష్కారానికి కొంత సహకారం అందించాలని ఆయన భావిస్తున్నారు. అయితే, హాబిన్స్ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. పోర్న్ స్టూడియో వల్ల తమకు గతంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, ఎదైనా సమస్య వస్తే.. దానిని యజమాని దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించేవారని, ఇప్పుడు దీనిని ఫ్లాట్లుగా చేస్తే.. ఇందులో ఉండేందుకు విదేశీ ఉద్యోగులే ముందుకొస్తారని, అలా 35 మంది వరకు వలసదారులు తమ కాలనీలోకి వస్తే సమస్యలు వచ్చే అవకాశముంటుందని స్థానికంగా నివాసముండే 38 ఏళ్ల నవోమి మ్యాగ్స్ పేర్కొంది. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా చేస్తే.. దాని ఎదురుగా ఉన్న తమ ఇంటిని అమ్మేస్తామని ఆమె హెచ్చరిస్తున్నది. -
సొరంగంలో ముగిసిపోయిన వలస జీవితం
పాస్- డి- కాలిస్: ఆకలి మనిషితో ఎంతటి సాహసం చేయిస్తుందో.. ప్రాణాలు నిలుపుకోవాలనే కోరిక ఎంత దుర్బలమైనదో తెలియజేసే వార్త ఇది. అంత్యుద్ధాలతో అట్టుడికిపోతోన్న లిబియా, ఎరిత్రియా, సోమాలియాల నుంచి ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లకు వలసపోతోన్న ఆఫ్రికన్లు ఎంత ప్రమాదకరమై మార్గాలద్వారా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 3 వేల మంది వసలదారులు రబ్బరు బోట్లు, చేపలుపట్టే పడవలద్వారా వలసవెళ్లగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. వాటిలో ఒకటి.. ఛానెల్ టెన్నల్. మంగళవారం ఆ సొరంగం గుండా రహస్యంగా ప్రయాణిస్తూ మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్‌కు చేరుకుంటాడనగా.. ప్రమాదవశాత్తు ఓ వలసజీవుడు దుర్మరణం చెందాడు. మృతుడ్ని ఎరిత్రియా పౌరుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతడి శవాన్ని మొదట ఓ రైలు డ్రైవర్ గుర్తించాడు. అయితే మృతుడు పట్టాలు దాటుతున్నాడా, లేక రైలుపైన లేదా అడుగు భాగంలో దాక్కొని ప్రయాణిస్తున్నాడా అనే విషయాలు తెలియాల్సిఉంది. డ్రైవర్ రైలును నిలిపివేయడంతో దాదాపు ఐదుగంటలపాటు రైలు, రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు టన్నెల్ గుండా ప్రయాణం ఎలా? డోవర్ జలసంధి.. ఇంగ్లాండ్- ఫ్రాన్స్ లను విడదీసే 53 కిలోమీటర్ల సముద్ర శాఖ. ఇరుదేశాలను కలుపుతూ నిర్మించిన ఛానెల్ టెన్నెల్.. ప్రపంచంలోనే పొడవైన సముద్ర నిర్మిత సొరంగంగా ప్రసిద్ధి చెందిందింది. ఫ్రాన్స్ వైపు నుంచి పాస్- డి- కాలిస్ ప్రాంతంలో ఆ చానెల్ లోకి ప్రవేశం ఉంటుంది. ప్రశాంతమైన సరిహద్దుగా పేరుపొందిన ఆ చోటు గడిచిన రెండేళ్లనుంచి మాత్రం పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రబ్బరుబోట్లు, చేపల బోట్ల తర్వాత ఇంగ్లాండ్ లోకి ప్రవేశించేందుకు ఆఫ్రికా వసలజీవులు ఆ టెన్నెల్ గుండా ప్రయాణించడమే అందుకు కారణం. పై చిత్రంలోలాగా ట్రక్కులు, ఇతర వాహనాల కింద రహస్యంగా దాక్కొని ఇంగ్లాండ్ లోకి ప్రవేశించే దుస్సాహసం చేస్తున్నారు వలసజీవులు. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 5 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
సొంతదేశం పొమ్మంది.. వలస దేశం వద్దంది..