ఇటీవల ప్రేమించకపోయినా లేదా ఏ కారణాల చేత ప్రేమ జంటలు విడిపోతే ఆ కథలు చివరికి చంపుకోవడంతో ముగింపు పలుకుతున్నాయి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్ చిన్న మనస్పర్థలకు వేరైతే ఎవ్వరి వారు ఉండాలి. లేదా ఆ వ్యక్తికి మనమనుసులో చోటు లేదని లైట్ తీసుకునేలా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ కక్ష పెంచుకుని ఏదో క్రిమినల్ మాదిరి స్పాట్ పెట్టి చంపేంత స్థాయికి దిగజారి కటకటలా పాలవ్వతున్నారు. దీనివల్ల ఇరువురు జీవితాలు కోల్పోవడమే గానీ ఏం యూజ్ ఉండుదు. అలాంటి దారుణ ఘటనే స్వీడిష్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..అల్జరీయన్ వలసదారు 26 ఏళ్ల మహమ్మద్ అమనా, స్వీడిష్ గర్లఫ్రెండ్‌తో ఉండేవాడు. ఏమయ్యింది ఏమో కొన్నాళ్లుగా ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. దీన్ని అంగీకరించని మహమ్మద్ అమనా కక్షతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేసి మరీ మాజీ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఓ నిచ్చెన సాయంతో ఆమె అపార్ట్‌మెంట్‌లోకి నేరుగా వచ్చేశాడు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ స్నేహితుడితో కలిసి ఉంటోంది.
అక్కడ ఉన్న ఆమె స్నేహితుడి అమనాని రావద్దని అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో అమనా కోపంతో అతడిపైకి రాయితోటి, కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. ఈ మొత్తాన్ని అమనా మాజీ ప్రియురాలే రికార్డు చేసింది. ఈ దుశ్చర్య కారణంగా మహ్మద్ అమనాకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా స్వీడన్‌కి తిరిగి రాకుండా పదేళ్ల నిషేధంతో బహిష్కరించింది. అమనాకి ఈ శిక్ష మొదటిసారేం కాదు. ఐతే ఆ బహిష్కరణ అమనా విషయంలో అమలు కాకపోగా అతడు మళ్లీ ఇలాంటి అనేక కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవలే కోర్టు మళ్లీ అతనికి ఇదే తరహా శిక్ష విధించింది. మరీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్‌లన్నీ..)
Comments
Please login to add a commentAdd a comment