పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.
ఈ ఉదంతం గురించి ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.
పశ్చిమ ఆఫ్రికా దేశపు మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment