boat sink
-
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రమాదంలో 14 నెలల చిన్నారి.. పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు. అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్‌గుప్తా ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్‌గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు. ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్‌గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో పడవ ఎక్కను ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్‌కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్‌లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు. -
మయన్మార్‌లో పడక మునక..
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్కర్లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్కు పడవలో బయలుదేరారు. అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి. -
బీహార్‌లో పడవ మునక.. పలువురు గల్లంతు
బీహార్‌లోని ఖగారియాలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నియా సమీపంలోగల బాగ్మతి నదిలో నేటి (ఆదివారం) ఉదయం పడవ మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 25మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం.బాల్కుంద గ్రామానికి చెందిన గోపాల్ కుమార్(18), ఖిర్నియా గ్రామ నివాసి అమలా దేవి(50) ఈ ప్రమాదంలో గల్లంతైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. పడవ నదిలో మునిగిన వెంటనే కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. ఖిర్నియా డ్యామ్ నుండి అంబ మీదుగా బహియర్ వైపు పడవ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం. ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఖగారియాలో గంగా నది ఉప్పొంగుతుండటంతో ఇక్కడి పర్బట్టా బ్లాక్‌లోని రింగ్ డ్యాం కూలిపోయేలా ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రింగ్ డ్యాం మీదుగా నీరు ప్రవహిస్తోంది. -
West Africa: పడవ బోల్తా.. 105 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.ఈ ఉదంతం గురించి ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.పశ్చిమ ఆఫ్రికా దేశపు మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. -
Bihar: గంగా నదిలో పడవ మునక.. నలుగురు గల్లంతు
పాట్నా: బిహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. బర్హ్ సబ్ డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నది మధ్యలో ఉండగా పడవ బోల్తా పడి మునిగిందని, 13 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభమ్ కుమార్ చెప్పారు. కనిపించకుండాపోయిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
బీహార్ రాజధాని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణీకులతో నిండిన పడవ బోల్తా పడింది. ఉమానాథ్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.పడవ బోల్తా పడిన వెంటనే 11 మంది ఈదుకుంటూ బయటికి రాగా, ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.గంగా దసరా సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్నానం చేయడానికి డయారా వైపు పడవలో వెళుతుండగా, గంగా నది మధ్యలో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్డీఎం శుభం కుమార్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. -
86కు చేరిన కాంగో పడవ మృతులు
కిన్షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు. -
తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి పడవలోకి ప్రయాణికులు ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా ప్రావిన్స్ అధికారులు చెప్పారు. Andy Vermaut shares: Dozens killed as boat sinks off north coast of Mozambique: More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. https://t.co/O4MSafGYK0 Thanks. pic.twitter.com/vVehEtxG9C — Andy Vermaut (@AndyVermaut) April 7, 2024 ఈ ప్రమాదంలో అధికంగా చిన్నారులే మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితుల కారణంగా మృత దేహాలు వెతికే ఆపరేషన్ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నరని స్థానిక అధికారులు తెలిపారు. More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. Read more at: https://t.co/8lVayQMPHE — Daily Tribune (@tribunephl) April 7, 2024 -
‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి
కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్‌కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది. ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది. -
సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం
-
నంద్యాల అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు కన్నుమూత..
అవుకు/నంద్యాల: నంద్యాల జిల్లా అవుకు గ్రామంలోని జలాశయంలో ఆదివారం బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి సహా ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో యువతిగల్లంతైంది. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు చిన్నారులకు ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోవెలకుంట్లకు చెందిన హసియా (23), నూర్జహాన్ (37) మృతి చెందగా.. సాజిదా (20) గల్లంతైంది. ప్రమాదం నుంచి బయటపడిన చశ్విక్ (3), హనీ (1) అనే చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో హనీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డి.రసూల్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో తన సమీప బంధువు ఇంటిలో జరిగిన వివాహ వేడుకకు రసూల్, అతని భార్య మహేశ్వరి, కుమార్తెలు సైదా, సాజిదా (20), రసూల్ అన్న దస్తగిరి, అతని భార్య కాశీంబి, కూతుళ్లు హసీనాభాను, హసియా (23), మనవడు చశ్విక్ , మనవరాలు హనీ, తమ్ముడి కుటుంబం మహబూబ్ బాషా, అతడి భార్య హుసేబీ, మరో తమ్ముడి కుటుంబం బషీర్ బాషా, అతని భార్య నూర్జహాన్(37) హాజరయ్యారు. బోటులో జలవిహారానికి వెళ్లగా.. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వీరంతా ఆదివారం ఉదయం జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది కలిసి బోటులో జల విహారానికి బయల్దేరారు. రిజర్వాయర్ మధ్యకు వెళ్లగానే బోటులోకి నీళ్లు రావటం చూసి బోట్‌ను నడుపుతున్న వ్యక్తి వెంటనే నీళ్లలోకి దూకేశాడు. బోటు తిరగబడటంతో అందులోని వారంతా ఒక్కసారిగా నీటిలోకి పడిపోయారు. స్థానికుల సాయంతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీయగా.. బోటుకింద చిక్కుకున్న హసియా (23) అప్పటికే మృతి చెందింది. మరో మహిళ నూర్జహాన్ (37), చిన్నారులు చశ్విక్, హనీ పరిస్థితి విషమంగా ఉండటంతో బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందింది. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో వెంకటరెడ్డి, ఆరోగ్య శాఖ, టూరిజం, అగ్నిమాపక శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా, ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖది కాదని జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటు నిర్వాహకులు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. చదవండి: ‘నా చావుకు నేనే కారణం...’ -
ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక
రోమ్: ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న ఒక చెక్క పడవ రెండు ముక్కలై నీళ్లల్లో మునిగిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎందరో మరణించారు. ఇప్పటివరకు సహాయ సిబ్బంది 58 మృతదేహాలను వెలికి తీశారు. మరో 60 మంది ప్రాణాలు కాపాడారని స్టేట్ టీవీ వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 180 మందికి పైగా శరణార్థులున్నట్టుగా తీర ప్రాంత పట్టణమైన క్రోటోన్‌లో ఓడరేవు అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్లే అయోనియాన్ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు. చదవండి: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 76 మంది దుర్మరణం
లాగోస్: వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వెళ్తున్న పడవ మునిగి 76 మంది దుర్మరణం చెందారు. ఈ విషాదం సంఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. వరద నీటిలో పడవ మునకపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి. నైగెర్ నది వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పడవలో దాదాపు 85 మంది ప్రయాణించారని, ఓవర్ లోడ్ కారణంగా మునిగిపోయినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాష్ట్రంలోని ఓగుబరూ ప్రాంతంలో సుమారు 85 మందితో వెళ్తున్న పడవ వరదలతో ఉప్పొంగిన నదిలో మునిగిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 76 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం ధ్రువీకరించింది. బాధితులకు అత్యవసర సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.’ అని తెలిపారు అధ్యక్షుడు బుహారి. భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు అత్యవసర విభాగం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారినట్లు తెలిపింది. సహాయ చర్యల కోసం నౌకాదళ హెలికాప్టర్ సాయం కోరామని పేర్కొంది. ఇదీ చదవండి: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి -
రోబోటిక్ ‘లైఫ్‌బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్‌బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్‌తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్‌గా విశాఖ తీరం ఆర్కే బీచ్‌లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్‌లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
అర్ధరాత్రి ఘోరం.. వలసదారుల పడవ బోల్తా పడి 17 మంది మృతి!
నసౌ: వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయి 15 మంది మహిళలు సహా మొత్తం 17 మంది మృతి చెందారు. వారంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ దీవి బహమాస్‌లో జరిగింది. పడవలోని మరో 25 మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి. న్యూప్రోవిడెన్స్‌కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని.. ఎంత మంది ఉన్నారనేదానికి స్పష్టత లేదని పేర్కొన్నాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఓ వ్యక్తి, ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు. ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ట్విన్ ఇంజిన్ స్పీడ్ బోట్ సుమారు 60 మందితో రాత్రి ఒంటిగంటకు బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ పడవ మియామీకి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బహమాస్ ప్రజలు, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి యాత్రలపై హెచ్చరిస్తూనే ఉంది.’ అని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతీ ప్రధాని అరియెల్ హెన్రీ. ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం విడిచి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. గత ఏడాది జులైలో హైతీ అధ్యక్షుడు జెవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
భారీ వర్షాలు: మునిగిన 12 పడవలు..
Gujarat 12 Boats Sink in Sea Near Gir Somnath: గుజరాత్లో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 పడవలు మునిగిపోయాయి. వీటిల్లో 23 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని కాపాడగ.. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ గుజరాత్లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గుజరాత్ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో అరేబియా సముద్రం సమీపంలోని గిర్-సోమ్‌నాథ్ ప్రాంతంలో, బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన 12 మత్స్యకారుల పడవలు మునిగిపోయాయి. (చదవండి: విషాదం నింపిన విహారయాత్ర) వాతావరణ మార్పుల గురించి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని పదే పదే హెచ్చరించారు. కానీ మత్స్యకారులు వాటిని పట్టించుకోకుండా వేటకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బుధవారం ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం లోపలికి వెళ్లవెద్దని అధికారులు హెచ్చరించారు. దాంతో చాలా మంది మత్స్యకారలు వెనక్కి వచ్చేశారు. గల్లంతయిన వారు కూడా తిరిగి వస్తుండగా.. బలమైన గాలులు వీచడం.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం నేవీ అధికారులు, రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. (చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు) దక్షిణ గుజరాత్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉన్నట్లుండి మూడు డిగ్రీలకు దిగజారింది. ఈ క్రమంలో డయ్యూ ప్రాంతంలో కూడా పడవ మునిగిపోవడం కారణంగా ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. చదవండి: దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ -
తూర్పు గోదావరిలో లాంచీ ప్రమాదం
రాజమండ్రి: గతేడాది జరిగిన దేవీపట్నం లాంచీ ప్రమాదం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతుండగానే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఏజెన్సీలో లాంచీ ప్రమాదానికి గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. చింతూరులో శబరినది బ్రిడ్జిని ఢీకొన్న లాంచీ ముక్కలైంది.. ఏజీ కోడేరు వద్ద వంతెన పిల్లర్‌ను ఢీకొట్టిన లాంచీ నీట మునిగింది. ప్రమాద సమయంలో లాంచీలో నలుగురు సిబ్బంది ఉండగా, పెంటయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. కాగా, ఆ సమయంలో మరో బోట్లోని వ్యక్తులు వెంటనే స్పందించడంతో ముప్పు తప్పింది. మిగతా ముగ్గుర్నీ కాపాడారు. పెంటయ్య గజ ఈతగాడు కావడంతో సురక్షితంగానే ఉంటాడని మిగతా సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు బోట్లను పంపినట్లు చింతూరు ఐటీడీఏ పీవో తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
టర్కీలో విషాదం; 11 మంది మృతి
టర్కీ : టర్కీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వలసదారులుతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందారు. కాగా వీరిలో 8మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే చనిపోయిన వారంతా ఏ దేశం నుంచి వలస వచ్చారనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో చోటుచేసుకున్నట్లు టర్కీ కోస్టు గార్డ్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. -
బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి
-
గోదావరిలో బోటు మునక
-
బ్రేకింగ్ : గోదావరిలో పర్యాటక పడవ బోల్తా
-
పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి : గోదావరిలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. తూరు గోదావరి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా జిల్లాకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సహాయక చర్యల నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్‌ను రాజమండ్రి నుంచి తరలించారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అధికారులతో మాట్లాడారు. చదవండి: బ్రేకింగ్ : గోదావరిలో పడవ మునక అలాగే గోదావరి బోటు ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగాయి. అలాగే జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కూడా సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా బోటు ప్రమాదంలో దాదాపు ఇరవైమంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం వద్ద సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారం అందడంలో జాప్యం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కచ్చనూరు సమీపంలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో 61మంది ఉన్నారు. ప్రమాద ఘటన దురదృష్టకరం: మంత్రి కన్నబాబు గోదావరిలో బోటు ప్రమాదం దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందని, ఘటనా స్థలానికి విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ నుంచి రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో గల్లంత అయిన వారి ఆచూకీ కోసం విశాఖ నుంచి 60మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే విపత్తలు నిర్వహణ శాఖ కమిషనర్...బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30మంది, మరో బృందంలో 40మంది సభ్యులు ఉన్నారు. -
బోటు ప్రమాదం : ఒకే కుటుంబం నుంచి 8 మంది గల్లంతు
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునక దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. విశాఖకు చెందిన మధపాడ రమణ, అరుణ కుటుంబాని చెందిన 9 మంది ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి వెళ్లారు. అక్కడ నుంచి బోటులో పాపికొండలు విహార యాత్రకు వెళ్తున్నట్లు బంధువు రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. మొత్తం 9 మందిలో ఒక్కరు మాత్రం బ్రతికి ఉన్నారు. మిగిలిన 8 మంది జాడ తెలియాల్సిఉంది. మధపాడ రమణబాబు, అరుణ కుమారి ప్రమాదానికి ముందు లాంచీ సిబ్బంది హెచ్చరించారు : ప్రత్యక్ష సాక్షి బోటు ప్రమాదం జరిగే కొద్ది క్షణాల ముందు లాంచీ సిబ్బంది తమను(పర్యాటకులను) హెచ్చరించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ..‘ప్రమాదం జరిగిన స్థలం అత్యంత ప్రమాదకరమైనదని సిబ్బంది చెప్పారు. భోజన విరామ సమయం కావడంతో చాలా మంది లైఫ్ జాకెట్లు తీసేశారు. నేను లైఫ్ జాకెట్ సాయంతో ఈదుకుంటూ కొండ ప్రాంతానికి చేరుకున్నాను. ఆ తర్వాత సహాయ బృందాలు నన్ను రక్షించాయి. ఆ తర్వాత లాంచీ పూర్తిగా తిరగబడి మునిపోయింద’ని తెలిపారు. విశాఖ నుంచి పాపికొండలు పర్యటనకు వెళ్లింది వీరే అరిలోవకి చెందిన తలారి అప్పల నరసమ్మ, వారి ఇద్దరు పిల్లలు అనన్య, కుమారి; మధపాడ రమణబాబు, అరుణ కుమారి, మధపాడ అభిషేక్, వైష్ణవి, పుష్ప( వీరంతా విశాఖ నగరం రామలక్ష్మీ కాలనీకి చెందినవారు. కాగా ప్రమాదం నుంచి బయట పడిన వ్యక్తి వేపగుంటకు చెందిన బోశాల లక్ష్మీగా గుర్తించారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు విజ్ఞప్తి తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన, మృతిచెందిన వారి వివరాల కొరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు.. దిగువ తెలిపిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం కోసం సంప్రదించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని తెలిపారు. భద్రాచలం తానీషా కళ్యాణ మండపంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం 9490636555 ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం 8332861100 పిఓ ఐటీడీఏ, భద్రాచలం 94909 57005, ఏఎస్పీ 9440795319 రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్ తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద బోటు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ ప్రాంత మృతుల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్ కుమార్ హుటాహుటిన కాకినాడ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి బోటు ప్రమాదం ప్రమాదం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. బోటు మునిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని చంద్రబాబు నాయడు అన్నారు. ప్రభుత్వం సత్వరమే గాలింపు చర్యలు ముమ్మరం చేసి గల్లంతైనవారిని కాపాడాలని కోరారు. ప్రమాదం జరగడం దురదృష్టకరం : హరీశ్, కేటీఆర్ ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు భరోసానిచ్చారు. లాంఛీ ప్రమాదంపై ఏపీ మంత్రులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకునేలా సమన్వయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’ అని ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినవారు వీరే బసికె. వెంకటస్వామి (వరంగల్) ఆరేపల్లి. యాదగిరి (వరంగల్) గొర్రె. ప్రభాకర్ (వరంగల్) దర్శనాల సురేష్ (వరంగల్) బసికె దశరథం (వరంగల్) ఎండీ మజ్హార్ (హైదరాబాద్) సీహెచ్. రామారావు (హైదరాబాద్) కె.అర్జున్ (హైదరాబాద్) జానకి రామారావు (హైదరాబాద్) సురేష్ (హైదరాబాద్) కిరణ్ కుమార్ (హైదరాబాద్) శివశంకర్ (హైదరాబాద్) రాజేష్ (హైదరాబాద్) గాంధీ (విజయనగరం) మధులత (తిరుపతి) బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం) వరంగల్ నుంచి వెళ్లినవారిలో ఆచూకీ తెలియని వారి వివరాలు సివి. వెంకటస్వామి బసికె. రాజేంద్రప్రసాద్ కొండూరు. రాజకుమార్ బసికె. ధర్మరాజు గడ్డమీది. సునీల్ కొమ్ముల. రవి బసికె. రాజేందర్ బసికె. అవినాష్ గొర్రె. రాజేంద్రప్రసాద్ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద బోటు ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లాంచీలో 22 మంది హైదరాబాద్ పర్యాటకులు గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో హైదరాబాద్‌కు చెందిన 22 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వరంగల్‌కు చెందిన 14 మంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదం నుంచి వరంగల్ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మందికి సీరియస్‌గా ఉండటంతో వారిని ట్రాక్టర్లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్ వాసులు గాంధీ, విశాల్, లక్ష్మణ్, జానకిరామ్, రాజేష్, రఘురామ్, అబ్దుల్ సలీమ్, సాయికుమార్, రఘురామ్, విష్ణుకుమార్, మహేశ్వరరెడ్డి కుటుంబం, ధశరథన్-వరంగల్, రమణ-విశాఖ, జగన్-రాజోలు వరంగల్ నుంచి విహార యాత్రకు వెళ్లినవారు ధర్మరాజు, రాజేందర్, వెంకటస్వామి, బస్కే దశరథం, వెంకటయ్య, ప్రసాద్, అవినాష్, దర్శనాల సురేశ్, సునీల్, అరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండూరి రాజ్ కుమార్, కొమ్మల రవిగొర్రె ప్రభాకర్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి అధికారులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. మా కళ్ల ముందే కొంతమంది మునిగిపోయారు : ప్రత్యక్ష సాక్షి ప్రమాదం జరిగినప్పుడు లాంచీలో 60 మందికి పైనా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తనది వరంగల్ అని, తనతో పాటు 14 మంది ఇక్కడికి వచ్చామని తెలిపారు. లాంచీ పక్కకు ఒరుగుతూ నీళ్లలో మునిగిందన్నారు. ఆ సమయంలో కొంతమంది పైకి ఎక్కారని, మరి కొంతమంది తమ కళ్ల ముందే మునిగిపోయారన్నారు. ఆ సమయంలో మరో పడవ వచ్చి తమను రక్షించారని ప్రత్యక్ష సాక్షి మీడియాతో తెలిపారు. 7 మృతదేహాలు లభ్యం దేవిపట్నం మండలం కచులూరుమందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 7మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. లైఫ్ జాకెట్లు వేసుకున్నవారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మొత్తం 27మందిని గ్రామస్థులు పడవల్లో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి తరలివెళ్లారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. నిన్నటివరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సంఘటనా స్థలానికి సహాయక బృందాలు బోటు మునక ప్రాంతానికి సహాయ బృందాలు వేగంగా చేరుకుంటున్నాయి. సుమారు 140మంది ఎన్డీఆర్ఎఫ్బృందాలు కచులూరు మందం బయల్దేరాయి. సహాయ చర్యల కోసం విశాఖపట్నం నుంచి 30మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లింది. మంగళగిరి నుంచి మరో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయల్దేరి వెళ్లాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఎస్డీఆర్ఎఫ్ కూడా ఘటనాస్థలానికి తరలివెళ్లింది. సహాయక చర్యల కోసం రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనాస్థలికి పంపారు అధికారులు. నీటి ఉద్ధృతి, సహాయక చర్యలకు గల అవకాశాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. సీఎం జగన్ సీరియస్ తూర్పుగోదావరి జిల్లాలో లాంచి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు గోదావరిలో మొత్తం అన్ని బోట్లను నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులతో మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు నేవీ, ఓఎన్జీసీ హెలికాఫ్టర్లను సహాయక చర్యలకు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు దేవిపట్నం లాంచీ ప్రమాదం నేపథ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు కోరారు. ప్రమాద ఘటనపై మంత్రి అవంతి ఆరా పడవ ప్రమాద ఘటనపై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరా తీశారు. జిల్లా ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారులతో ఫోన్ చేసి ఘటనకు సంభందించిన విషయాలు అడిగితెలుసుకున్నారు. పర్యాటకులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హుటాహుటిన సంఘటనా స్ధలానికి బయలుదేరి వెళ్లారు. గోదావరిలో బోటు మునక తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడింది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ ప్రైవేటు లాంచీలో 61 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 50 మంది పర్యాటకులు, మిగతా 11 మంది సిబ్బందిగా తెలుస్తోంది. 27 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వీరంతా గండిపోచమ్మ నుంచి పాపికొండలు టూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించినట్లు తెలుస్తోంది. గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతి ఇచ్చారు. లైఫ్ జాకెట్లు ధరించిన కొంత మంది ఒడ్డుకు చేరినట్లు స్థానికులు చెప్పారు. కాగా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. -
నట్టనడుమ.. చిమ్మచీకట్లో...
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపుపోటు కారణంగా పంటు అదుపు తప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటలకు మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్‌లేక గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్రపోటు తో పంటు వేరేమార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. రెండున్నర గంటలు గోదావరిలోనే.. పంటులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని దాస్తున్నట్టుగా చెబుతున్నారు. పంటులో లైఫ్ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు.