లిబియాలో 500మంది జలసమాధి! | Up to 500 Migrants Feared Dead After Boat Sinks off Libyan Coast | Sakshi
Sakshi News home page

లిబియాలో 500మంది జలసమాధి!

Published Wed, Apr 20 2016 8:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

లిబియాలో 500మంది జలసమాధి!

లిబియాలో 500మంది జలసమాధి!

కైరో: లిబియాలో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం భయంతో ఈజిప్టు నుంచి లిబియా వైపు సముద్రం గుండా వలస వెళుతున్న వారి నౌక లిబియా తీరం మునిగిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో వలసదారులు నీటి మునిగిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది.  దాదాపు 500మందికి పైగా జలసమాధి అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ బోటులో ప్రయాణించినవారిలో 41మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో 37మంది పురుషులు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఐరోపాలో కొనసాగుతున్న వలసల సంక్షోభంలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా నమోదు కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement