
టర్కీ : టర్కీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వలసదారులుతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందారు. కాగా వీరిలో 8మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే చనిపోయిన వారంతా ఏ దేశం నుంచి వలస వచ్చారనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో చోటుచేసుకున్నట్లు టర్కీ కోస్టు గార్డ్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment