పడవ మునక.. 66 మంది గల్లంతు | 66 missing after boat sinks off Malaysia | Sakshi
Sakshi News home page

పడవ మునక.. 66 మంది గల్లంతు

Published Wed, Jun 18 2014 12:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

66 missing after boat sinks off Malaysia

కౌలాలంపూర్: మలేసియాలో పడవ మునిగిన సంఘటనలో 66 మంది గల్లంతయ్యారు. పడవ సామర్థ్యానికి మించి అందులో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్పారు. మలేసియా పశ్చిమ కోస్తా తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు ఇండోనేసియా నుంచి  మలేసియాకు అక్రమంగా వలస వస్తున్నవారని తెలిపారు.

పడవలో 97 మంది ఇండోనేసియా జాతీయులున్నారని, ప్రమాదం జరిగిన తర్వాత 31 మందిని కాపాడారు. మిగిలిన వారి ఆచూకీ లభించలేదు. హెలీకాపర్ట సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement