
ఆహార ప్రియులకు ఒరిజినల్ రుచులు అందిస్తున్న టిగా
వినూత్న రుచులకు ప్రముఖ చెఫ్స్ ఆల్బర్ట్ రాయన్, షా
‘సాక్షి’తో అనుభవాలు పంచుకున్న ఇంటర్నేషనల్ చెఫ్స్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో
సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే..
దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి.

వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్
దక్షిణాది ప్రేరణతో..
మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్
Comments
Please login to add a commentAdd a comment