![Fashion going back to the root - Designers Going Back To Cultural, Tradition](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/fashion.jpg.webp?itok=DiH9uZvq)
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్ల క్రితం ఫ్యాషన్ ఔత్సాహికులు అత్యాధునిక డిజైన్ల వైపు మొగ్గు చూపేవారని, కానీ ప్రస్తుతం మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నారని, ఆనాటి డిజైన్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోందని ప్రముఖ జువెల్లరీ డిజైనర్, విభ జ్యూవెలరీ వ్యవస్థాపకురాలు అనీషారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా సాధారణ స్థాయి మొదలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహిళల వరకు ఆభరణాల ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. దీనికి అనుగుణంగా రూపొందిస్తున్న కలెక్షన్లకు మాత్రమే మార్కెట్‌లో ఆదరణ పెరుగుతోందని అన్నారు. మణికొండ వేదికగా నూతనంగా రూపొందించిన వింటెరా కలెక్షన్‌ను బుధవారం ఆవిష్కరించారు.
అంతరంగమే.. ప్రేరణ అందించేలా..
మన ఆలోచనల్లోని మార్పులు, చేర్పులు, ఆచరణాత్మక దృక్పథాలే మన విజయాలు, గమ్యాన్ని నిర్ణయిస్తాయని విద్యావేత్తలు,
ప్రముఖులు స్పష్టం చేశారు. నగరంలోని వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన టెడ్ ఎక్స్ టాక్స్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని యువతకు విజయాల సాధనలో దిశానిర్ధేశం చేశారు. ఇంటర్నేషనల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత, ఆరి్టస్ట్, ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్ మయూర్ కల్‌బాగ్ స్వీయ–ఆవిష్కరణ పరివర్తనపై తన దృక్పథాలతో ఆకట్టుకున్నారు. అఘోరి – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ, స్మైల్ ఎట్ స్ట్రెస్, రైజింగ్ వాటర్‌ఫాల్ అడ్వెంచర్స్ ఆఫ్ పూర్ణ వంటి విజయవంతమైన పుస్తకాలకు ప్రసిద్ధి చెందిన కల్‌బాగ్ తన ప్రసంగంలో వృద్ధికి ఉ్రత్పేరకంగా ఆంతరంగిక భావనను చూపారు. ఎర్టెన్ ట్యూన్స్ సహవ్యవస్థాపకుడు అసోసియేట్ డీన్ సంతోష్ కొచెర్లకోట, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చింతకింది మల్లేశం, చుర్రోల్టో హైదరాబాద్ – జాసా మీడియా వ్యవస్థాపకుడు నీహర్ బిసాబతిని పాల్గొన్నారు.
మలేషియా రెగట్టాలోలో సిటీ సెయిలర్స్
మలేషియాలోని పెర్దానాలో జరగనున్న 21వ లంకావై అంతర్జాతీయ రెగట్టాకు మన రాష్ట్రానికి చెందిన 11 మంది సెయిలర్స్ ఎంపికయ్యారు. ముంబైలో ఇటీవల జరిగిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం గెలుచుకున్న ప్రీతి కొంగర, జోగులాంబ గద్వాల్‌కు చెందిన చాకలి కార్తీక్‌తో కలిసి 470 మిక్స్‌డ్ క్లాస్ సీనియర్స్ విభాగంలో పోటీపడనున్నారు. పలు జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన నగరానికి చెందిన వైష్ణవి వీరవంశం, నల్గొండ జిల్లాకు చెందిన యువ గిరిజన బాలుడు శ్రావణ్ కాత్రవత్‌తో 420 మిక్స్‌డ్ క్లాస్ జూనియర్స్‌లో పోటీ పడుతున్నారు. వీరు ప్రస్తుతం భారత్‌లో నంబర్–1 ర్యాంక్‌లో ఉన్నారు. రిజ్వాన్ మొహమ్మద్, రసూల్‌పురాకు చెందిన లాహిరి కొమరవెల్లి, వినోద్ దండు, చంద్రలేఖ, భానుచంద్ర, రవికుమార్, బద్రీనాథ్ కూడా పోటీ పడుతున్నారని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుహీమ్ షేక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment