
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది.
ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది.
తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది.
గొప్ప విశేషం..
ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను.
– శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా
బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా..
గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్‌కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్‌కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు.
ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్‌లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.
ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి.