Beauty Competitions
-
ఆరు పదులకు అందాల కిరీటం
వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్ ఆసియా రన్నరప్, మిసెస్ ఎలిగాన్స్, మిసెస్ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్–గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు. -
అందాల పోటీలు: మీరు ఎలా ఉన్నా పర్వాలేదు.. కాళ్లు బావుంటే చాలు
అందాలపోటీలు అనగానే అందమైన యువతులు స్టైల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తున్న దృశ్యం మన కళ్లముందు కనిపిస్తుంది. 90వ దశకం నుంచి సౌందర్యపోటీలు వెలుగులోకి వచ్చాయి. బ్యూటీ విత్ ఏ పర్సన్ అన్నట్లు బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. ఈ పోటీలు వివిధ దశల్లో జరుగుతుంటాయి. అయితే 1930 -53 కాలంలో చెప్పులతో అందాల పోటీలు జరిగేవి. వినడానికి విడ్డూరంగా ఉన్నా సౌందర్యం చూసో, ఫిజికల్ ఫిట్నెస్ చూసో కాకుండా కాళ్లను చూసి విజేతలుగా ప్రకటించేవారు. సౌందర్య పోటీల్లో వస్త్రధారణ, ర్యాంప్‌వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ. అయితే 1900 ప్రారంభంలో మహిళల అందాల పోటీల్లో "ది ప్రెట్టీ యాంకిల్ కాంటెస్ట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ముఖం చూపించకుండా తెర వెనుక నిల్చుంటారు. మోకాలి కింద వరకు డ్రెస్ చేసుకొని అందరూ ఒకే వరుసలో నిల్చుంటారు. ఈ పోటీల్లో ప్రధానంగా కాళ్లను బట్టి విజేత ఎవరో ప్రకటించేవారు. అల వైకుంఠపురములో సినిమాలో పూజాహెగ్డే కాళ్లను చూసి అల్లు అర్జున్ మెస్మరైజ్ అయినట్లు ఈ యాంకిల్ కాంటెస్ట్ పోటీల్లో అందమైన కాళ్లతో ఫిదా చేయాలన్నమాట. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనేవారు అవివాహితులై ఉండాలి కానీ యాంకిల్ కాంటెస్ట్‌కి మాత్రం ఈ రూల్ అవసరం లేదు. ఎవరైనా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..ఈ పోటీలకు పోలీసులు లేదా క్లర్క్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. When women were judged by the attractiveness of their ankles (1930-1953) "The pretty ankle contest" appeared in the early 1900s as special shows within women's beauty competitions. Contestants would have to stand behind a curtain to conceal their bodies, so that all that could… pic.twitter.com/RTsB1JkHQU — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
మిస్ కర్ణాటక రాణి
సాక్షి, శివాజీనగర : బెంగళూరు నగరానికి చెందిన ఇశ్ ఈవెంట్ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో దావణగెరెకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్ కర్ణాటక కిరీటాన్ని ధరించగా, మండ్య జిల్లా మళవళ్లికి చెందిన సవితా ఎం.శంకర్ మిసెస్ కర్ణాటక కిరీటాన్ని ధరించారు. గత నెల 15 నుంచి మూడు రోజుల పాటు కనకపుర రోడ్డులోని ఓ ప్రైవేట్ రెసార్ట్‌లో ఏర్పాటు చేసిన బ్యూటీ మిసెస్ కర్ణాటక, మిస్ కర్ణాటక పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రేక్షకులతో పాటు పోటీదారులు 600 మందికిపైగా ఇందులో సవితా ఎం.శంకర్ మిసెస్ కర్ణాటక విన్నర్‌గాను, బ్యూటీ మిస్ పోటీలో రాణి గెలుపొందారని ఇశ్ ఈవెంట్ సంస్థ డైరెక్టర్ వీరేశ్ శనివారం మీడియాకు తెలిపారు. పుష్ఫ, వైష్ణవి ద్వితీయ, తృతీయ స్థానంలో గెలుపొందారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో జరిపిన అందాల పోటీల్లో 28 మంది ఎంపికయ్యారన్నారు. డైరెక్టర్ వీరు, ఫ్యాశన్ డిజైనర్ శ్వేతా కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రముఖ సినీ నటుడు సుదీప్ కార్యక్రమ అంబాసిడర్‌గా వ్యవహరించారని తెలియజేశారు. వెంకటేశ్, చామరాజ్, అమరేష్, రఘునందన్ కార్యక్రమ ప్రమోటర్స్‌గా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా మిస్, మిసెస్ కర్ణాటక కిరీటాన్ని ధరించిన రాణి, సవితా, వైష్ణవి విలేకరులతో మాట్లాడుతూ అందాల పోటీలు కేవలం నగరాలకు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలవారికి కూడా అవకాశం కల్పించిన ఈశ్ ఇవెంట్ సంస్థకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అందాల పోటీల్లో ప్రతిభా, క్రీడా, సంప్రదాయ పోటీలు జరుగుతాయని, ఇందులో పాల్గొనటం తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు. -
పుంజు చూడు, పుంజందం చూడు...
వర్ణం: టేబుల్ మీద ఠీవిగా, ఛాతీ విరుచుకుని నడిచి, న్యాయమూర్తే అవాక్కయ్యేలా చేసిందీ కోడిపుంజు. సంగతేమిటంటే, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ‘సెరెమా’ రకం కోళ్లమధ్య అందాల పోటీలు జరుగుతాయి. అరకిలో కూడా తూగని ఈ స్థానిక చిన్నరకం జాతికి ఆ దేశంలో బాగా ఆదరణ ఉంది. ఐరోపాకు కూడా ఇవి ఎగుమతి అవుతుంటాయి. పౌల్ట్రీ ప్రమోషన్లో భాగంగా జరిగే ఈ పోటీల్లో ఫొటోలోని పుంజు సుమారు ఆరులక్షల రూపాయల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. ‘దీన్ని కొంటామని చాలామంది అడిగారు, కానీ అమ్మను. ఇది నా కుటుంబంలో భాగం,’ అని మురిసిపోతాడు యజమాని మహమ్మద్ హత్తా. మొరాకో ఘాట్ ఫొటోలోనిది ప్రపంచంలోనే పాతదిగా పేరొందిన ‘చర్మకారశాల’! సుమారు 900 ఏళ్ల నాటిది! గొప్ప నైపుణ్యం కనబరిచే చర్మతీతకారులకు మొరాకోలోని పాతనగరం ఫెజ్ ప్రసిద్ధి. అవసరమైన రసాయనాలు, రంగులు ఇలా గుంటల్లో పోసివుంచుకుంటారు. చనిపోయిన గొర్రెలు, మేకలు, ఒంటెల చర్మాలు ఇక్కడ ఒలుస్తారు. ఒలిచిన జంతుచర్మాలు బ్యాగులు, కోట్లు, బూట్లు, స్లిప్పర్లు లాంటి ఉత్పత్తుల తయారీకి తరలుతాయి. అందం?- ఆరోగ్యం? 100 మీటర్ల హైహీల్స్ పరుగుపందేనికి సిద్ధంగా కూర్చున్న యువతుల్ని ఈ ఫొటోలో చూడవచ్చు. అయితే, ఇది పందెం గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. రష్యాలో మితిమీరిన ఫ్యాషన్స్‌ను అదుపు చేయాలన్న చర్చలు సాగుతున్నాయి. చాలా వంపుగా ఉండే హై హీల్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివికావనీ, వీటి గురించి ఏమైనా చేయాల్సిన సమయం ఆసన్నమైందనీ శాసనకర్త ఒలెగ్ మిఖాయెవ్ చెబుతున్నారు. అదే జరిగితే హీల్స్ మీద నిషేధం విధించే అవకాశం ఉంది. ట్రైనర్స్, బ్యాలె ఫ్లాట్స్, మగవాళ్లు ధరించే లోఫర్స్ కూడా ‘అనారోగ్య’ జాబితాలో ఉన్నాయి. -
అందాల వేట
-
కోడి చూడు.. కోడందం చూడు..
అందాల పోటీలు.. ఈ మధ్య అందరికీ పెట్టేస్తున్నారు. మలేసియాలో అయితే కోళ్ల అందాల పోటీలకు ఉండే క్రేజే వేరు. ఇదిగో చిత్రంలో రొమ్ము విరుచుకుని.. ఒక్క మగాడు తరహాలో పోజిచ్చిన ఈ కోడి పుంజు లాంటి వాటిని చూడటానికి అక్కడ జనం ఎగబడి వస్తారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొనేది మాత్రం సెరామా జాతి కోళ్లే. ప్రపంచంలోని చిన్న జాతి కోళ్లలో ఇవీ ఒకటి. మహా అయితే.. అర కిలో బరువుంటాయి. అందాల పోటీల్లో నెగ్గాలంటే మాత్రం.. కోడిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపించాలట.. నిల్చునే భంగిమ అదరాలట.. ఇలా పలు విభాగాల్లో మార్కులు కొట్టేయాలి. గెలిచే పుంజుకు బహుమతి కింద రూ.6 లక్షలు సొంతమవుతాయి.