కోడి చూడు.. కోడందం చూడు..
అందాల పోటీలు.. ఈ మధ్య అందరికీ పెట్టేస్తున్నారు. మలేసియాలో అయితే కోళ్ల అందాల పోటీలకు ఉండే క్రేజే వేరు. ఇదిగో చిత్రంలో రొమ్ము విరుచుకుని.. ఒక్క మగాడు తరహాలో పోజిచ్చిన ఈ కోడి పుంజు లాంటి వాటిని చూడటానికి అక్కడ జనం ఎగబడి వస్తారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొనేది మాత్రం సెరామా జాతి కోళ్లే. ప్రపంచంలోని చిన్న జాతి కోళ్లలో ఇవీ ఒకటి. మహా అయితే.. అర కిలో బరువుంటాయి. అందాల పోటీల్లో నెగ్గాలంటే మాత్రం.. కోడిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపించాలట.. నిల్చునే భంగిమ అదరాలట.. ఇలా పలు విభాగాల్లో మార్కులు కొట్టేయాలి. గెలిచే పుంజుకు బహుమతి కింద రూ.6 లక్షలు సొంతమవుతాయి.