
పాట్నా: బిహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. బర్హ్ సబ్ డివిజన్‌లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
పడవలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నది మధ్యలో ఉండగా పడవ బోల్తా పడి మునిగిందని, 13 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభమ్ కుమార్ చెప్పారు. కనిపించకుండాపోయిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.