
బీహార్‌లోని ఖగారియాలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నియా సమీపంలోగల బాగ్‌మతి నదిలో నేటి (ఆదివారం) ఉదయం పడవ మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 25మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం.
బాల్కుంద గ్రామానికి చెందిన గోపాల్ కుమార్(18), ఖిర్నియా గ్రామ నివాసి అమలా దేవి(50) ఈ ప్రమాదంలో గల్లంతైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. పడవ నదిలో మునిగిన వెంటనే కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. ఖిర్నియా డ్యామ్ నుండి అంబ మీదుగా బహియర్ వైపు పడవ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఖగారియాలో గంగా నది ఉప్పొంగుతుండటంతో ఇక్కడి పర్బట్టా బ్లాక్‌లోని రింగ్ డ్యాం కూలిపోయేలా ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రింగ్ డ్యాం మీదుగా నీరు ప్రవహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment