bagmati
-
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్‌ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
బీహార్‌లో పడవ మునక.. పలువురు గల్లంతు
బీహార్‌లోని ఖగారియాలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నియా సమీపంలోగల బాగ్మతి నదిలో నేటి (ఆదివారం) ఉదయం పడవ మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 25మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం.బాల్కుంద గ్రామానికి చెందిన గోపాల్ కుమార్(18), ఖిర్నియా గ్రామ నివాసి అమలా దేవి(50) ఈ ప్రమాదంలో గల్లంతైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. పడవ నదిలో మునిగిన వెంటనే కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. ఖిర్నియా డ్యామ్ నుండి అంబ మీదుగా బహియర్ వైపు పడవ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం. ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఖగారియాలో గంగా నది ఉప్పొంగుతుండటంతో ఇక్కడి పర్బట్టా బ్లాక్‌లోని రింగ్ డ్యాం కూలిపోయేలా ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రింగ్ డ్యాం మీదుగా నీరు ప్రవహిస్తోంది. -
తెలుగులో మలయాళ విలన్!
మలయాళ నటుడు జయరామ్ గురించి పెద్దగా పరిచయ వాక్యాలు అవసరంలేదు. కమల్‌హాసన్ నటించిన ‘తెనాలి’, ‘పంచతంత్రం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడయ్యారు. ఆ చిత్రాల్లో జయరామ్ చేసిన కామెడీని అంత సులువుగా మరచిపోలేరు. అప్పుడు నవ్వించిన జయరామ్ ఇప్పుడు అనుష్కకు విలన్‌గా మారారు? అదేంటీ అనుకుంటున్నారా?. అనుష్క టైటిల్ రోల్లో తెరకెక్కుతోన్న ‘భాగమతి’ చిత్రంలో జయరామ్ విలన్‌గా ఎంపికయ్యారు. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తాను విలన్‌గా చేస్తున్న విషయాన్ని జయరామ్ స్వయంగా చెబుతూ.. ‘నేను నటించబోయే తెలుగు సినిమా ‘భాగమతి’లో నా విలన్ గెటప్ ఇదే’ అంటూ ఫేస్బుక్లో తన గెటప్ తాలూకు ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూస్తుంటే.. ఇప్పటివరకూ కనిపించినదానికి పూర్తి భిన్నంగా జయరామ్ కనిపిస్తారనిపిస్తోంది కదూ!