పట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. వివిధ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గండక్ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, డ్రై రేషన్ ప్యాకెట్లు/ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ఖజానాపై విపత్తు బాధితులకు మొదటి హక్కు ఉంటుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ వరదల కారణంగా ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment