ఉత్తరప్రదేశ్‌లోని గంగా, గోమతి, ఘఘ్రా నదుల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. అలాగే రామగంగ, గర్రా, ఖానౌట్, రాప్తి, బుధి రాప్ట్, కానో, శారదా నదులు కూడా ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో లఖింపూర్ ఖేరీ, బల్‌రాంపూర్, అయోధ్య, ఉన్నావ్, బల్లియా, బస్తీ సహా 20 జిల్లాల్లోని దాదాపు 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. బల్లియాలో ఘఘ్రా నది కోతకు గురికావడంతో 13 గ్రామాలు నీట మునిగాయి.
వారణాసిలోని గంగా నది నీటిమట్టం 48 గంటల్లో రెండు మీటర్ల మేర పెరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష జరిపేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, 24 గంటల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,571 గ్రామాలతో పాటు బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్ పట్టణ ప్రాంతాలు వరదల బారిన పడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
కాశీలో గంగానది నీటిమట్టం వరుసగా రెండో రోజు కూడా పెరుగుతూనే ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం గంగానది నీటిమట్టం 61.79 మీటర్లుగా నమోదైంది. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పురాతన దశాశ్వమేధ ఘాట్‌లో సాయంత్రం జరగాల్సిన గంగా హారతి వేదికను కూడా మార్చాల్సి వచ్చింది. విశ్వనాథ్ ధామ్ గంగా గేట్ పక్కనే ఉన్న లలితా ఘాట్, మణికర్ణికా ఘాట్ ర్యాంప్‌పైకి నీరు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment