Kosi
-
బీహార్‌ను భయపెడుతున్న వరదలు
పట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. వివిధ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గండక్ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, కమ్యూనిటీ కిచెన్లు, డ్రై రేషన్ ప్యాకెట్లు/ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ఖజానాపై విపత్తు బాధితులకు మొదటి హక్కు ఉంటుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ వరదల కారణంగా ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు. -
నాడు కుటీరం.. నేడు వీఐపీల గెస్ట్‌హౌస్
గుంతకల్లు : క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణలో ఉన్న రైల్వే అధికారులు తాత్కాలికంగా సేద తీరడం కోసం నిర్మించిన ఓ కుటీరం కాలక్రమేణా ‘కోసి’ గెస్ట్‌హౌస్‌గా రూపాంతరం చెందింది. 1980లో అప్పటి డీఈఎన్ గోపాలక్రిష్ణ, ఐఓడబ్ల్యూ దొరైస్వామిల హయాంలో గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలో రేకులతో చిన్నపాటి హాల్ నిర్మించారు. కిందిస్థాయి రైల్వే అధికారులకే కాకుండా ఉన్నతాధికారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అనంతర కాలంలో భావించారు. దానికి మరిన్ని హంగులు అద్దాలనుకున్నారు. సుమారు రెండు ఎకరాల భూమిలో విశాలంగా గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ గెస్ట్‌హౌస్ ముందు భాగాన 10 గదులతో కూడిన ఏసీ రూమ్‌లు, ఒక నాన్ ఏసీ గదిని నిర్మించారు. మిగిలిన ఎకరం స్థలంలో గెస్ట్‌హౌస్ అందాలను ద్విగుణీకృతమయ్యేలా రకరకాల పూల మొక్కలు, షో మొక్కలు నాటారు. విశ్రాంతి గృహం ముందు భాగంలో మట్టి కడవతో ఆహ్వానిస్తున్నట్లు ఉన్న అందమైన నర్తకి బొమ్మను ఏర్పాటు చేశారు. ముందుభాగంలో ఫౌంటెన్ నిర్మించి దాని చుట్టూ రంగు రంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో వేసిన పచ్చని గడ్డి ఇక్కడకు విచ్చేసిన వీఐపీలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం పంచుతోంది. గుంతకల్లు రైల్వే కోసీ గెస్ట్‌హౌస్‌కు ప్రత్యేక స్థానం కల్పించేందుకు 2010లో అప్పటి డీఆర్ఎం సందీప్కుమార్జైన్ లక్షలాది రూపాయలు వెచ్చించి విశ్రాంతి గృహం రూపురేఖలు మార్చారు. ఈ గెస్ట్‌హౌస్‌లో బస చేయాలంటే డీఆర్ఎం లేదా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. - గుంతకల్లు -
బీహార్‌కు భారీ వరద ముప్పు
కోసీ నదిలో పెరుగుతున్న నీటిమట్టం {పజలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ఇప్పటికే 44 వేల మంది సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్తలు.. పాట్నా: బీహార్‌లోని తొమ్మిది జిల్లాలకు భారీ వరద ముప్పు ముంచుకొస్తోంది. కోసీ నదిలో నీటిమట్టం భారీగా పెరుగుతుండడంతో తీరప్రాంతాల్లోని వేలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎగువ ప్రాంతాలకు బలవంత ంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 44 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేపాల్‌లోని కోసీ ప్రధాన ఉపనది భోటే కోసీ నుంచి నీరు వెల్లువెత్తడంతో కోసీ నిండుకుండలా మారింది. నేపాల్-బీహార్ సరిహద్దుకు 260 కి.మీ దూరంలో శుక్రవారం భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డంతో భోటే కోసీ మూసుకుపోయి, 32 లక్షల క్యూసెక్కుల నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతం 2.5 కి.మీ విస్తీర్ణంతో సరస్సులా మారింది. అంతకుముందు.. దగ్గర్లోని మంఖానా గ్రామంలో వంద ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డంతో ఎనిమిది మంది చనిపోగా, 200 మందికిపైగా గల్లంతయ్యారు. నదిలో శిథిలాలను తొలగించేందుకు నేపాల్ ఆర్మీ రెండు తక్కువ స్థాయి పేలుళ్లు జరిపింది. నది నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో బీహార్‌లోని కోసీలో నీరు పెరుగుతోంది. ముందు జాగ్రత్తగా సుపౌల్, సహర్సా, మాధేపురా, ఖగారియా, అరారియ, మధుబని, భాగలూపర్, పూర్ణియా, దర్భంగా జిల్లాలోని తీరప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇందుకోసంజాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఏన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, ఆర్మీలకు చెందిన జవాన్లను వందల సంఖ్యలో ఈ జిల్లాల్లో మోహరించారు. నదిలో నీరు గణనీయంగా పెరిగితే 4.25 లక్షల మంది ఇబ్బంది పడతారని, వారందర్నీ బలవంతంగా తర లించడానికి విపత్తునియంత్రణ చట్ట నిబంధనలను అమల్లోకి తెచ్చామని విపత్తు నియంత్రణ విభాగం(డీఎండీ) ప్రత్యేక కార్యదర్శి అనిరుధ్ కుమార్ చెప్పారు.