
రాజమండ్రి: గతేడాది జరిగిన దేవీపట్నం లాంచీ ప్రమాదం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతుండగానే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఏజెన్సీలో లాంచీ ప్రమాదానికి గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. చింతూరులో శబరినది బ్రిడ్జిని ఢీకొన్న లాంచీ ముక్కలైంది.. ఏజీ కోడేరు వద్ద వంతెన పిల్లర్‌ను ఢీకొట్టిన లాంచీ నీట మునిగింది.
ప్రమాద సమయంలో లాంచీలో నలుగురు సిబ్బంది ఉండగా, పెంటయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. కాగా, ఆ సమయంలో మరో బోట్‌లోని వ్యక్తులు వెంటనే స్పందించడంతో ముప్పు తప్పింది. మిగతా ముగ్గుర్నీ కాపాడారు. పెంటయ్య గజ ఈతగాడు కావడంతో సురక్షితంగానే ఉంటాడని మిగతా సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు బోట్లను పంపినట్లు చింతూరు ఐటీడీఏ పీవో తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర‍్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment