రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం నగరానికి చెందిన రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత కేవీ రమణమూర్తి (80) సోమవారం కన్నుమూశారు. స్వాతంత్రోద్యమ సమయంలో స్వదేశీ వస్తువుల వాడకం విషయమై మహత్మాగాంధీ పిలుపును అందుకుని రమణమూర్తి తండ్రి కోసూరి వెంకటరత్నం రాజమహేంద్రవరంలో తొలి స్వదేశీ పెన్ (రత్నం పెన్ ) తయారీ పరిశ్రమను నెలకొల్పారు.
చదవండి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ‘దేవరవాండ్లు’కు కుల ధ్రువీకరణ పత్రాలు
రమణమూర్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన మృతికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: రాష్ట్ర పోలీసు అధికారులతో పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ హీనా విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment