అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.