బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్‌బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్‌తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి.
సేఫ్ బీచ్‌గా విశాఖ తీరం
ఆర్కే బీచ్‌లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్‌లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు
Comments
Please login to add a commentAdd a comment