lifeboat
-
రోబోటిక్ ‘లైఫ్‌బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్‌బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్‌తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్‌గా విశాఖ తీరం ఆర్కే బీచ్‌లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్‌లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
ఆ చివరి లైఫ్‌బోట్..
టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు.. నేనున్నానంటూ పలువురి ప్రాణాలకు భరోసా కల్పిస్తూ.. నౌకలోని చివరి లైఫ్‌బోట్ తన ప్రయాణాన్ని సాగించింది.. మరేమైంది.. మాట నిలబెట్టుకుందా? టైటానిక్‌లాగే మునిగిపోయిందా? మే 13, 1912.. టైటానిక్ విషాదం జరిగి దాదాపు నెల రోజులు.. ప్రమాద స్థలానికి సరిగ్గా 200 మైళ్ల దూరం.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆర్ఎంఎస్ ఓషియానిక్ నౌక నెమ్మదిగా ప్రయాణం సాగిస్తోంది.. అల్లంత దూరంలో సముద్రంలో సగం మునిగి తేలుతున్నట్లు పడవలాంటిది కనిపించింది.. అదేంటో పరిశోధించడానికి ఓషియానిక్ నుంచి కొందరు బయల్దేరారు.. అప్పుడు కనిపించింది వీరికా చివరి లైఫ్‌బోట్.. తనతోపాటు ముగ్గురు అభాగ్యుల మృతదేహాల్ని మోస్తూ.. ఇంతకీ ఈ మధ్యలో ఏం జరిగింది? టైటానిక్ నుంచి పదుల సంఖ్యలో ప్రయాణికులను మోసుకుని బయల్దేరిన ఈ చివరి లైఫ్ బోట్‌కు కూడా టైటానిక్‌కు పట్టిన గతే పట్టిందని తేలింది. బయల్దేరిన కొద్దిసేపటికే.. టైటానిక్‌లాగే ఇది కూడా ఓ మంచు కొండను ఢీకొంది. పలువురు సముద్రంలో మునిగిపోయారు. షిప్‌నకు చెందిన ఇద్దరు ఫైర్మన్లు, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు థాంప్సన్ మృతదేహాలను మాత్రం మోస్తూ.. ఇదలాగే ఉండిపోయింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు ఓషియానిక్ సిబ్బందికి బోటు అడుగుభాగంలో కనిపించాయి. ఈ చివరి లైఫ్‌బోట్ కు సంబంధించిన అరుదైన చిత్రాలు, మొత్తం ఆపరేషన్‌ను వివరిస్తూ రాసిన పత్రం తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీన్ని ఈ శనివారం బ్రిటన్‌లోని విల్ట్‌షైర్‌లో వేలం వేయనున్నారు. భారీగా ధర పలుకుతుందని అంచనా.