
కొలంబియాలో పడవ ప్రమాదం
కొలంబియా: కొలంబియాలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చాలామంది గల్లంతయ్యారు. బ్రిటన్ కొలంబియాలోని కెనడీయన్ ప్రావిన్స్ కు చెందిన టోఫినో కోస్తా తీరంలో 27మందితో బయలు దేరిన షికారు బోటు అనూహ్యంగా మునిగిపోయింది.
సమాచారం అందుకున్న నేవీ సంస్థ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు ప్రారంభించారు. చిన్న పడవలను కూడా అక్కడికి తరలించి ప్రాణాలతో ఉన్నవారిని రక్షిస్తున్నారు. లెవియథాన్ 2 అనే పేరు కలిగిన ఈ పడవ 'వేలింగ్ స్టేషన్ అండ్ అడ్వెంచర్ సంస్థ'కు చెందినది. కాగా, ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.