తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి | Several Deceased As Boat Sinks Off Mozambique Coast Due To Overcrowded, Details Inside- Sakshi
Sakshi News home page

Mozambique: తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి

Published Mon, Apr 8 2024 7:04 AM | Last Updated on Mon, Apr 8 2024 9:49 AM

several deceased As Boat Sinks Off Mozambique Coast - Sakshi

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  మొజాంబిక్‌ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  సామర్థ్యానికి మించి పడవలోకి ప్రయాణికులు ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా ప్రావిన్స్ అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో అధికంగా చిన్నారులే మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితుల కారణంగా మృత దేహాలు వెతికే ఆపరేషన్ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నరని స్థానిక  అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement