మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.
కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21 మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు.
హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని మొజాంబిక్ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment